Just Andhra PradeshJust TelanganaLatest News

Meteorological:తెలుగు రాష్ట్రాలకు పెద్ద రిలీఫ్..వాతావరణశాఖ అధికారుల కీలక సూచనలు

Meteorological : వర్షం పడే సమయంలో ఎవరూ కూడా చెట్ల కింద నిలబడొద్దనీ..అలాగే కరెంట్ స్తంభాలు లేదా పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద ఉండొద్దనీ సూచించింది.

Meteorological

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి భానుడి భగభగలతో, ఓ రేంజ్‌ ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు హమ్మయ్య అనేలాంటి వార్తను వినిపించింది. వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological) వెల్లడించింది.

ఇప్పటికే మంగళవారం అంటే మే 26 రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వానలు మొదలవగా.. బుధ, గురువారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాల వల్ల సుమారు అన్ని చోట్లా ఎండల తీవ్రత తగ్గి, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి నుంచే గట్టి వాన దంచికొట్టగా, ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు.

అయితే ఏపీలో మాత్రం ఇప్పుడు ఒక విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ఎండలు ఓ రేంజ్‌లో మండిపోతుంటే.. ఇంకోవైపు అకస్మాత్తుగా వానలు కురుస్తున్నాయి. అయితే రాబోయే రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన వర్షాలు పడతాయని చెప్పిన విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

వర్షం పడే సమయంలో ఎవరూ కూడా చెట్ల కింద నిలబడొద్దనీ..అలాగే కరెంట్ స్తంభాలు లేదా పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద ఉండొద్దనీ సూచించింది. వాతావరణ మార్పుల తీవ్రతను బట్టి అధికారులు ఏపీలోని ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడ్డాయి. అనకాపల్లి, నంద్యాల, ప్రకాశం, అనంతపురం, కాకినాడ వంటి ప్రాంతాల్లో మోస్తరుగా వర్షాలు కురిశాయి.

Meteorological
Meteorological

వానలతో పాటు గంటకు యాభై నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల ఎండల ప్రభావం కూడా గట్టిగానే ఉండబోతోంది.

బుధవారం రోజు ఏపీవ్యాప్తంగా 68 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు, మరో 93 మండలాల్లో సాధారణ వేడిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ, ఏలూరు, కృష్ణా, బాపట్ల, అనకాపల్లి జిల్లాలలో ప్రజలు ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైన పనులుంటే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావద్దని వాతావరణ శాఖ (Meteorological) అధికారులు సూచిస్తున్నారు.

Trust Issues :ఎదుటివారు మంచివారే కానీ నమ్మలేని స్థితి.. ఇలాంటి ట్రస్ట్ ఇష్యూస్ వల్ల జరిగేదేంటి?

Related Articles

Back to top button