Just NationalLatest News

NEET Paper Leak : నీట్ పేపర్ లీక్ కేసులో గురువులే నిందితులు.. మైండ్‌నే ఆయుధంగా వాడుకున్న కుట్రదారులు

NEET Paper Leak : నీట్ పేపర్ లీక్ కేసులో భద్రతా వైఫల్యాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి ఇప్పటికే బేసిక్ ఇన్ఫర్మేషన్ అందించిన సీబీఐ.. త్వరలోనే ఈ లోపాలను సరిదిద్దడానికి అవసరమైన కఠినమైన సూచనలతో కూడిన అఫీషియల్ రిపోర్ట్‌ను సమర్పించనుంది.

NEET Paper Leak

దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన నీట్-2026 ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సీబీఐ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. పేపర్‌ను తయారు చేసిన, ట్రాన్స్‌లేట్ చేసిన నిపుణులే ఈ భారీ కుట్రకు తెరతీసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

ఈ భద్రతా వైఫల్యాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి ఇప్పటికే బేసిక్ ఇన్ఫర్మేషన్ అందించిన సీబీఐ.. త్వరలోనే ఈ లోపాలను సరిదిద్దడానికి అవసరమైన కఠినమైన సూచనలతో కూడిన అఫీషియల్ రిపోర్ట్‌ను సమర్పించనుంది.

ప్రశ్నాపత్రాలను తయారుచేసే ప్రక్రియలో ఉన్న భారీ భద్రతా లోపాలే ఈ లీకేజీకి కారణమని సీబీఐ తన దర్యాప్తులో తేల్చింది. పేపర్ తయారీలో పాల్గొన్న నిపుణులను పనులు ముగిసిన తర్వాత ప్రతిరోజూ తమ తమ ఇంటికి వెళ్లడానికి అధికారులు అనుమతించడం పెద్ద తప్పిదంగా మారింది.

ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకున్న మహారాష్ట్రకు చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీకి చెందిన ముగ్గురు నిపుణులు కూడా ప్రతిరోజూ తాము తయారు చేసిన ప్రశ్నలను బాగా గుర్తుపెట్టుకుని.. బయటకు వచ్చిన తర్వాత ప్రైవేటు కోచింగ్ సెంటర్లలోని స్టూడెంట్స్‌కు అవి పరీక్షలో వచ్చే చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలని చెప్పి వాటిని అందించేవారు.

సీబీఐ అధికారుల దర్యాప్తులో తేలిన సమాచారం ప్రకారం.. 2024లో జరిగిన లీకేజీ విధానానికి, ఇప్పుడు జరిగిన తాజా ఘటనకు చాలా తేడా ఉంది. గతంలో ఒక పరీక్షా కేంద్రం అడ్మినిస్ట్రేటర్ సాయంతో పేపర్లను ఫిజికల్‌గా దొంగిలించి బయటకు పంపారు.

కానీ ఈసారి మాత్రం రూట్ మార్చి.. ఏకంగా ఎగ్జామ్ పేపర్ తయారు చేసే బాధ్యతను తీసుకున్న వాళ్లే ప్రశ్నలను గుర్తు పెట్టుకుని ఈ పెద్ద నేరానికి పాల్పడ్డారు. గతేడాది జరిగిన లీకేజీ టైమ్‌లోనే ప్రశ్నపత్రాల భద్రతపై ఎన్‌టీఏకు సీబీఐ చాలా గట్టిగా హెచ్చరించింది. అయినా కూడా మళ్లీ ఇలాంటి భద్రతా లోపాలు తలెత్తడం విద్యావ్యవస్థను మరింత షాక్‌కు గురిచేస్తోంది.

NEET Paper Leak
NEET Paper Leak

ఈ కేసు విచారణను స్పీడప్ చేసిన సీబీఐ.. ఈ వ్యవహారంలో పార్ట్‌నర్స్ అయిన మొత్తం 13 మంది నిందితులపై ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అరెస్టయిన వారంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. వీరికి కోర్టు ఎలాంటి కఠిన శిక్షలు విధిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

మరోవైపు, స్టూడెంట్స్ వారి తల్లిదండ్రులు మాత్రం ఎన్‌టీఏ నిర్లక్ష్యంపై చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అయినా ఇలాంటివి జరగకుండా ఎగ్జామ్ పేపర్ల తయారీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని, అలాగే ప్రశ్నాపత్రాల తరలింపులో ఇండియన్ ఆర్మీ సహాయం తీసుకునే ఆలోచన చేయాలని వారు సూచిస్తున్నారు.

America : కొత్త ప్రాంతాల్లోకి విస్తరిస్తున్న యుద్ధం.. ఖాళీ అవుతున్న అమెరికా ఆయుధాలు

Related Articles

Back to top button