Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు సర్జరీ సక్సెస్..2 నెలల తర్వాత మరో ఆపరేషన్ ఉంటుందా?

Pawan Kalyan : కొద్దిరోజుల క్రితమే ముంబైలో కంప్లీట్ చెకప్స్ పూర్తయ్యాక ఈ సర్జరీ డేట్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హెల్త్ నిలకడ గానే ఉందని, హాస్పిటల్‌లోనే రెస్ట్ తీసుకుంటున్నారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

Pawan Kalyan

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముంబైలో భుజానికి సంబంధించిన సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్‌కు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్ల టీమ్ పవన్ కుడి భుజానికి ఉన్న రొటేటర్ కఫ్ ఇంజ్యూరీపై సుమారు మూడున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రెండు భుజాల్లో కూడా తీవ్రమైన గాయాలున్నట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే రెండు చేతులకూ ఒకేసారి సర్జరీ చేస్తే రికవరీ కష్టమవుతుందని , ప్రస్తుతానికి కుడి భుజానికి మాత్రమే ఆపరేషన్ చేశారు.

ఎడమ భుజానికి మరో 2 నెలల తర్వాత రెండో సర్జరీ చేయనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హాస్పిటల్‌లోనే డాక్టర్ల అబ్జర్వేషన్‌లో కోలుకుంటున్నారు. పవన్ సర్జరీ విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ హెల్త్ కండిషన్‌ను అడిగి తెలుసుకున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

నిజానికి పవన్ కళ్యాణ్‌ పదేళ్లుగా భుజాల నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 2016లోనే ఆయన భుజానికి మొదటిసారి గాయమైంది. అయినా సరే ఆయన రెస్ట్ తీసుకోకుండా పబ్లిక్ లైఫ్‌లోనే తన జీవితాన్ని కొనసాగించారు.

గాయం తర్వాత జనసేన పార్టీ తరఫున చేపట్టిన పోరాట యాత్ర, రైతు పర్యటనలు, సుదీర్ఘమైన వారాహి యాత్రతో పాటు ఇటీవలి ఎన్నికల ప్రచారం వరకూ నిరంతరం జనాల్లోనే ఉన్నారు.

ఈ సమయంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కరచాలనం చేయడం, ఒక్కోసారి చేతులు పట్టి గట్టిగా లాగడం వంటి ఇన్సిడెంట్స్ వల్ల ఆ పాత గాయాలు మరింత పెరిగాయని డిప్యూటీ సీఎం ఆఫీస్ ఒక స్టేట్‌మెంట్‌లో గతంలోనే వెల్లడించింది.

అయితే ముందే ఫిక్స్ అయిన అఫీషియల్ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక మాత్రమే సర్జరీ చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లూ వెయిట్ చేశారు.

Pawan Kalyan

ఇటీవల నిర్వహించిన మెడికల్ టెస్టుల్లో రెండు భుజాల్లో కూడా రొటేటర్ కఫ్ పూర్తిగా దెబ్బతినడమే కాకుండా, లోపల కండరాలు కూడా చిట్లిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. ఇంత సివియర్ పెయిన్ ఉన్నా సరే.. ఆయన ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా భారీ పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించడం చూసి మెడికల్ టీమ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

కొద్దిరోజుల క్రితమే ముంబైలో కంప్లీట్ చెకప్స్ పూర్తయ్యాక ఈ సర్జరీ డేట్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హెల్త్ నిలకడ గానే ఉందని, హాస్పిటల్‌లోనే రెస్ట్ తీసుకుంటున్నారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

Aluminum Foil : అల్యూమినియం ఫాయిల్‌తో వైఫై మ్యాజిక్..సిగ్నల్ ప్రాబ్లెమ్స్‌కి చెక్ పెట్టే ఈజీ ట్రిక్

Exit mobile version