Just TechnologyLatest News

Aluminum Foil : అల్యూమినియం ఫాయిల్‌తో వైఫై మ్యాజిక్..సిగ్నల్ ప్రాబ్లెమ్స్‌కి చెక్ పెట్టే ఈజీ ట్రిక్

Aluminum Foil : ఉన్న సిగ్నల్‌ను కావాల్సిన డైరెక్షన్‌లోకి మళ్లించడానికి వంటగదిలో వాడే అల్యూమినియం ఫాయిల్ బాగా హెల్ప్ అవుతుందని టెక్ నిపుణులు చెప్తున్నారు.

Aluminum Foil

ఇంట్లో వైఫై కనెక్షన్ ఉన్న చాలామంది ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ..సిగ్నల్ ఇష్యూనే. కొన్ని గదుల్లో ఇంటర్నెట్ స్పీడ్ అదిరిపోయేలా వస్తుంటే.. ఇంకో రూములో మాత్రం అసలు సిగ్నల్స్ అందవు. ఎందుకంటే గోడలు, ఇంట్లోని ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ఎఫెక్ట్ వల్ల కూడా వైఫై ప్రసారం దెబ్బతింటుంది.

ఇలాంటపుడు రౌటర్ మార్చాల్సిన అవసరం లేకుండా, ఎక్స్‌ట్రా రౌటర్ పని లేకుండా.. ఉన్న సిగ్నల్‌ను కావాల్సిన డైరెక్షన్‌లోకి మళ్లించడానికి వంటగదిలో వాడే అల్యూమినియం ఫాయిల్(Aluminum Foil) బాగా హెల్ప్ అవుతుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఇదేమీ కొత్త ఇన్వెన్షన్ కాకపోయినా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ట్రై చేయగల ట్రిక్ కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Related Articles

సాధారణంగా వైఫై రౌటర్ తన చుట్టూ రౌండ్‌గా అన్ని వైపులా ఈక్వెల్‌గా తరంగాలను పంపుతుంది. దీనివల్ల ఇంట్లో ఉండే అందరికీ అన్ని మూలల్లో సిగ్నల్ అందదు. అందుకే అల్యూమినియం ఫాయిల్‌ను ఒక సిగ్నల్ షీల్డ్‌లా వాడుకుని దీనికి చెక్ పెట్టొచ్చు.

అల్యూమినియం ఫాయిల్‌(Aluminum Foil)ను రౌటర్ వెనుక భాగంలో ఒక వక్రంగా అంటే సీ ( C ) ఆకారంలో లేదా పారాబోలిక్ షేప్‌లో అమర్చినప్పుడు అది రేడియో తరంగాలను తిరిగి రిఫ్లెక్ట్ చేస్తుంది. దీనివల్ల అనవసరంగా బయటి వైపు కానీ ఖాళీ ప్రదేశాల్లోకి కానీ వెళ్లే ప్రసారాలు తగ్గి.. మనకు ఏ గదిలోనైతే ఇంటర్నెట్ ఎక్కువగా కావాలో ఆ వైపునకు సిగ్నల్ వెళ్తుంది. అయితే ఇది రౌటర్ మోడల్, రూమ్ సైజ్ బట్టి మారుతుంది కాబట్టి ఒక్కసారిగా ఇంటర్నెట్ స్పీడ్ పెరిగిపోతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేం.

కాగా ఈ ఫాయిల్ పెడితే వైఫై వేరే వాళ్లకు పూర్తిగా హైడ్ అవుతుందా అని చాలా మందికి డౌట్ వస్తుంది. దీనివల్ల సిగ్నల్ లీకేజ్ కొంతవరకు తగ్గి పక్క ఇళ్ల వాళ్లకు కనెక్షన్ వీక్‌గా అందుతుందే తప్ప, ఇది కంప్లీట్ సెక్యూరిటీని ఇవ్వలేదు.

Aluminum Foil
Aluminum Foil

వైఫై సేఫ్‌గా ఉండాలంటే స్ట్రాంగ్ పాస్‌వర్డ్, WPA2 లేదా WPA3 ఎన్‌క్రిప్షన్, రెగ్యులర్ ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్ వంటివే మెయిన్ వెపన్స్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. అపార్ట్‌మెంట్లు, చిన్న ఇళ్లలో ఉండే వాళ్లకు ఈ ఫాయిల్ ట్రిక్ ఒక బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు అందుకే చెబుతున్నారు.

ఒకవేళ ఫాయిల్‌ను తప్పుడు యాంగిల్‌లో పెడితే ఉన్న సిగ్నల్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, రెండు మూడు యాంగిల్స్‌లో మార్చి చూస్తూ సెట్ చేసుకోవాలి. ఒకవేళ పెద్ద ఇళ్లు లేదా రెండు అంతస్తుల బిల్డింగ్స్ అయితే మాత్రం ఈ చిన్న ట్రిక్ సరిపోదు. అప్పుడు మెష్ వైఫై లేదా రేంజ్ ఎక్స్‌టెండర్ల వైపు వెళ్లడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Nutmeg : పరగడుపున జాజికాయ నీళ్లు..ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు మిస్ చేయరు..

Related Articles

Back to top button