Just Andhra PradeshJust TelanganaLatest News

Rain Alert : తెలుగు రాష్ట్రాలలో వణుకు పుట్టిస్తున్న బంగాళాఖాతం..ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త..

Rain Alert : రాబోయే కొద్ది గంటల్లో వాయు గుండం బీభత్సం సృష్టిస్తూ తీరాన్ని దాటనుందని..దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Rain Alert

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇప్పుడు కోస్తాంధ్ర తీర ప్రాంతాలను వణికించడానికి శరవేగంగా దూసుకొస్తోంది. రాబోయే కొద్ది గంటల్లో ఇది బీభత్సం సృష్టిస్తూ తీరాన్ని దాటనుందని..దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రకృతి కోపానికి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ప్రజలు, అధికారులు ముందే అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వాతావరణ కేంద్రం లెక్కల ప్రకారం చూస్తే ఈ వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీటర్ల స్పీడుతో పశ్చిమవాయువ్య దిశగా అడుగులు వేసింది. ఇది కళింగపట్నానికి సౌత్ వెస్ట్ దిశలో కేవలం 30 కి.మీటర్ల దూరంలో, విశాఖపట్నానికి నార్త్ ఈస్ట్‌గా 90 కి.మీటర్ల డిస్టెన్స్‌లో ఉంది. మరో 2 నుంచి 3 గంటల్లోనే ఇది విశాఖపట్నం, ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్య, కళింగపట్నం బోర్డర్స్‌లో తీరాన్ని తుడిచి పెడుతూ దాటే అవకాశం ఉంది.

ఈ వాయుగుండం ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర అలాగే యానాంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్ర పరిధిలోని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ గండం తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 60 కి.మీటర్లు, వేగం పెరిగితే ఏకంగా 70 కి.మీటర్ల స్పీడుతో భయంకరమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు.

రాయలసీమలో కూడా 40 నుంచి 50 కి.మీటర్ల వేగంతో గాలులతో పాటు భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఈరోజు అంటే సెప్టెంబర్ 24వ తేదీ దాటిన తర్వాత వానల జోరు కాస్త తగ్గినా.. మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపుల విలయం అలాగే కొనసాగుతుంది.దీంతో మత్స్యకారులెవరూ కూడా సముద్రంలోకి వెళ్లొద్దని, తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.

Rain Alert
Rain Alert

ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గురు, శుక్రవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు(Rain Alert) కురుస్తయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అత్యవసర అలర్ట్‌ను జారీ చేసింది.భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఖమ్మం,కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ భారీ వర్షాల(Rain Alert) వల్ల స్టూడెంట్స్ ఇబ్బందులు పడకుండా.. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌కు 2 రోజులు సెలవులు ప్రకటించారు. అలాగే ఏపీ,తెలంగాణలో ప్రజలెవరైనా బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Re-Connect Old Bonds : కట్ అయిన పాత బంధాలను రీ-కనెక్ట్ చేసుకోవాలా? ఈ 5 బెస్ట్ రూట్స్ ఫాలో అవ్వండి..

Related Articles

Back to top button