Vangaveeti Radha Krishna : పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్న వంగవీటి రాధా..మేయర్ పీఠమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్..
Vangaveeti Radha Krishna : విజయవాడ నగర మేయర్ పదవి అన్ రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్లడంతో పాటు.. కూటమి పొత్తుల్లో భాగంగా ఈ స్థానం జనసేనకే దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది.
Vangaveeti Radha Krishna
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్టాపిక్గా ఉండే వంగవీటి కుటుంబం మరోసారి వార్తలలో నిలిచింది. కొంతకాలంగా సైలెంట్గా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ(Vangaveeti Radha Krishna).. సంచలన నిర్ణయాన్ని తీసుకుంటూ జనసేన పార్టీ గూటికి చేరారు.
రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రాధాకృష్ణ(Vangaveeti Radha Krishna)కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచి పొలిటికల్ అనుభవం ఉన్న వంగవీటి రాధా, ఆ తర్వాత కాలంలో కొన్ని పరిణామాల మధ్య టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు.
రాధాకృష్ణతో పాటు తిరుపతికి చెందిన ప్రముఖ నాయకుడు ప్రణీత్ ప్రమోద్ కూడా జనసేన కండువా కప్పుకున్నారు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన సమయంలో.. ఈ ఇద్దరు నేతల ఎంట్రీ జనసేన పార్టీ శ్రేణుల్లో భారీ జోష్ నింపింది.

అయితే తాజాగా ప్రస్తుత లోకల్ బాడీ ఎన్నికల సమయంలో.. విజయవాడ నగర మేయర్ పదవి అన్ రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్లడంతో పాటు.. కూటమి పొత్తుల్లో భాగంగా ఈ స్థానం జనసేనకే దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది. దీంతోనే వంగవీటి రాధా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
జనసేన పార్టీ తరఫున విజయవాడ మేయర్ కేండిడేట్గా వంగవీటి రాధా బరిలో దిగడం పక్కా అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు తిరుపతి మేయర్ రేసులో ప్రణీత్ ప్రమోద్ పేరు కూడా తెర మీదకు రావడంతో ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారి ఒక్కసారిగా హీట్ పెరిగింది.





