Just BusinessJust NationalLatest News

Banks Open Sunday : కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. ఈ ఆదివారం రోజు బ్యాంకులు ఓపెన్..

Banks Open Sunday : సెప్టెంబర్ 28వ తేదీ నుంచి సోమ, మంగళ, బుధవారాల్లో వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులు సమ్మె చేయబోతున్నట్లు ప్రకటించాయి.

Banks Open Sunday

బ్యాంకింగ్ సెక్టార్‌లో వారంలో ఐదు రోజుల వర్కింగ్ డేస్ అమలు చేయాలని, దాంతో పాటు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) మెథడ్‌లో ఉన్న లోపాలను సవరించమని కోరుతూ వివిధ బ్యాంకింగ్ యూనియన్లు వచ్చే వారం పెద్ద ఎత్తున సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి సోమ, మంగళ, బుధవారాల్లో వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులు సమ్మె చేయబోతున్నట్లు ప్రకటించాయి.

అయితే బ్యాంకుల సమ్మెకు ముందే ఫోర్త్ సాటర్డే,అలాగే సండే సాధారణ సెలవులు కావడం కస్టమర్లకు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఏకంగా 5 రోజుల పాటు బ్యాంకింగ్ సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. దీని వల్ల సాధారణ ప్రజలకు, బిజినెస్‌ చేసేవారికి తీవ్రమైన డబ్బు కొరతతో పాటు, అత్యవసర బ్యాంకింగ్ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొనే పరిస్థితిని ఫేస్ చేయాల్సి వస్తుంది.

అయితే ఈ టఫ్ సిచ్యువేషన్‌ను ముందుగానే ఊహించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెంటనే రియాక్టయ్యి ఒక కీలక అత్యవసర నిర్ణయాన్ని తీసుకున్నాయి. వరుసగా 5 రోజులు బ్యాంకులు మూతపడితే సిస్టం దెబ్బతింటుందనే ఉద్దేశంతో.. జనరల్ హాలీడే అయినా కూడా ఈ నెల 27వ తేదీ ఆదివారం రోజు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నిటినీ తెరవాలని(Banks Open Sunday) ఆదేశాలు జారీ చేశాయి. ఆర్‌బీఐ కూడా ఈ ప్రతిపాదనకు వెంటనే అనుమతి ఇచ్చింది.

ఈ ఆదేశాల ప్రకారం, అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు (Public Sector Banks)తో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) కూడా సండే రోజు ఎప్పటిలాగే అవే టైమింగ్స్ ప్రకారం పనిచేస్తాయి. దీని వల్ల డిపాజిట్లు చేసుకోవడం, క్యాష్ విత్‌డ్రాయల్స్ (Withdrawals), చెక్కుల క్లియరెన్స్ వంటి ఎమర్జెన్సీ పనులను ఆదివారం(Banks Open Sunday) రోజు పూర్తి చేసుకోవచ్చు.

Banks Open Sunday
Banks Open Sunday

అయినా కూడా ఆ తర్వాత వచ్చే సోమ, మంగళ, బుధవారాలు డైరెక్టుగా బ్యాంకు బ్రాంచులకు వెళ్లి చేసే ట్రాన్జాక్షన్స్‌కు సమ్మె వల్ల అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా 12 మెయిన్ గవర్నెంట్ రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు ముందస్తు గైడెన్స్ జారీ చేశాయి. డైరెక్టుగా బ్రాంచ్‌లకు రావడానికి బదులు డిజిటల్ మార్గాలైన యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, ఏటీఎం (ATM) సర్వీసులను వాడుకోవాలని కోరాయి. డిజిటల్ సేవలకు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదని బ్యాంకులు స్పష్టం చేశాయి.

Appreciation : మనసులోని మెచ్చుకోలును దాచుకోకండి..ఎదుటివారిలో కాన్ఫిడెన్స్ నింపండి..

Related Articles

Back to top button