Gold price :స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధరలు.. గోల్డ్ ప్యూరిటీ కూడా మీ చేతుల్లోనే ..
Gold price : బంగారం ధరలు కొంచెం తగ్గుముఖం పట్టడంతో జ్యువెలరీ షాపులన్నీ కొనుగోలుదారులతో సందడి చేస్తున్నాయి.
Gold price
పసిడి కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి నిన్నటితో పోలిస్తే ఈరోజు అంటే ఏప్రిల్ 23వ తేదీ నాటి మార్కెట్ కాస్త ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల ఏప్రిల్ 23వ తేదీ నాటికి ధరల్లో కొంచెం తగ్గుదల కనిపించింది. భారత దేశంలో పండుగలు, శుభకార్యాలు ఏదైనా సరే పుత్తడికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ధరలు కొంచెం తగ్గుముఖం పట్టడంతో జ్యువెలరీ షాపులన్నీ కొనుగోలుదారులతో సందడి చేస్తున్నాయి. దేశంలోని వివిధ సిటీల్లో నేటి గోల్డ్ ధరల పరిస్థితిని ఒకసారి గమనిస్తే, తెలుగు రాష్ట్రాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1, 54, 740 రూపాయలుగా ఉంది. అలాగే జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,41, 840 రూపాయల వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు , కేరళ రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి.
అయితే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1, 54, 890 రూపాయలుగా ఉండగా, చెన్నైలో మాత్రం మిగిలిన నగరాల కంటే కాస్త ఎక్కువగా ఒక లక్షా 55 వేల 450 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక సిల్వర్ ధరల విషయానికి వస్తే, ఇది కూడా కొద్దిగానే దిగి వచ్చింది. హైదరాబాద్, చెన్నైలలో కిలో వెండి ధర 2,74,900 రూపాయలుగా ఉండగా, ఇతర మెయిన్ సిటీల్లో సుమారు రెండు లక్షల 64 వేల 900 రూపాయల వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
సాధారణంగా గోల్డ్ కొనాలనుకున్నప్పుడు కేవలం ధరనే కాకుండా దాని ప్యూరిటీని గమనించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ప్రభుత్వం హాల్ మార్క్ లేని బంగారం విక్రయాలను ఆపేసింది. కాబట్టి మీరు కొనే జ్యువెలరీపై కచ్చితంగా హాల్ మార్క్ ముద్ర ఉందో లేదో సరిచూసుకోవాలి.

దీని కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ‘బీఐఎస్ కేర్’ (BIS Care) అనే స్పెషల్ మొబైల్ యాప్‌ను వాడితే మంచిది. ఈ యాప్‌ను మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని, ప్రాథమిక వివరాలతో లాగిన్ అయిన తర్వాత, అందులో ఉండే వెరిఫై హెచ్‌యూఐడీ (Verify HUID) అనే ఆప్షన్ ద్వారా మీరు కొనే ఆభరణం ప్యూరిటీని టెస్ట్ చేసుకోవచ్చు.
జ్యువెలరీపై ఉండే ఆరు అంకెల హెచ్‌యూఐడీ నంబర్‌ను యాప్‌లో ఎంటర్ చేయగానే, ఆ ఆభరణాన్ని ఎక్కడ తయారు చేశారు, ఏ కేంద్రంలో హాల్ మార్కింగ్ చేశారు. అలాగే ఆ గోల్డ్ ఎన్ని క్యారెట్ల స్వచ్ఛతను కలిగి ఉందనే పూర్తి వివరాలన్ని కూడా మీ స్క్రీన్‌పైనే కనిపిస్తాయి.ఏది ఏమయినా మనం కొనే జ్యువెలరీ ప్యూరిటీ మనమే తెలుసుకుంటే చాలా మోసాలకు చెక్ పెట్టొచ్చు.
Milk :వేసవిలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే..ఈ చిట్కాలు పాటించండి..





