Just BusinessJust NationalLatest News

Gold Rates : గోల్డ్ లవర్స్ గెట్ రెడీ.. బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయ్..

Gold Rates : అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ తీవ్రంగా పుంజుకోవడం, దీంతో పాటు ఇన్వెస్టర్లు సేఫ్ సైడ్ ఉండటానికి ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గు చూపించడంతో.. బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి.

Gold Rates

గోల్డ్ కొనాలని రెడీ అవుతున్న బంగారం ప్రియులకు, శుభకార్యాలు పెట్టుకున్నవారికి పుత్తడి మార్కెట్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. మొన్నటి వరకూ బంగారం కొనాలంటేనే వణికిపోయే పరిస్థితి నుంచి కొన్ని రోజులుగా ఈ రేట్లు దిగివస్తూ కొనుగోలుదారులకు పెద్ద రిలీఫ్‌ను ఇస్తున్నాయి.

అయితే ఈ తగ్గుదల టెంపరరీ కాదని, నెక్స్ట్ వీక్‌లో కూడా పుత్తడి గ్రాఫ్ కిందకే పడిపోయే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ తీవ్రంగా పుంజుకోవడం, దీంతో పాటు ఇన్వెస్టర్లు సేఫ్ సైడ్ ఉండటానికి ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గు చూపించడంతో.. బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి.

అంతర్జాతీయ మార్కెట్లను గమనిస్తే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లను మరింత పెంచొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ సంకేతాలతో డాలర్ తో పాటు యూఎస్ బాండ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఎప్పుడైతే ఇలా డాలర్ విలువ పెరిగిందో, అలా ఆటోమేటిక్‌గానే గోల్డ్ అండ్ సిల్వర్ వంటి విలువైన లోహాల కొనుగోళ్లు తగ్గి వాటిపై ఒత్తిడి పెరిగింది. ఈ గ్లోబల్ ఎఫెక్ట్ వల్ల పుత్తడి రేట్లు రాబోయే రోజుల్లో మరింత తగ్గే ఛాన్స్ ఉందనేది నిపుణుల మాట.

ఇక స్థానిక మార్కెట్ వివరాల్లోకి వెళ్తే..ఆదివారం ఉదయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1లక్ష58వేల240 దగ్గర కొనసాగుతోంది. అలాగే జ్యువెలరీకి తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ కాస్ట్ రూ.1లక్ష45వేల50గా నమోదైంది.

Gold Rates
Gold Rates

కాగా బంగారం బాటలోనే సిల్వర్ కూడా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2.60 లక్షలుగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మెయిన్ సిటీలయిన వరంగల్, ఖమ్మం, విజయవాడ,రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెయిన్ న మెట్రో నగరాల్లో కూడా చిన్న చిన్న తేడాలతో సుమారు ఇదే ధరలతో.. బంగారం, వెండి రేట్లు కొనసాగుతున్నాయి. అయితే గోల్డ్ మార్కెట్‌లో రేట్లు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. కాబట్టి, షాపింగ్‌కి వెళ్లే ముందు కొనుగోలుదారులు పక్కా ధరలను అన్ని చోట్ల సరిచూసుకోవడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Soul After Death : మనిషి చనిపోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరణానికి ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయి?

Related Articles

Back to top button