Gold – Silver : పండుగ ముందు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..
Gold - Silver : 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1లక్ష48వేల260 వద్ద ఉండగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల పసిడి ధర సుమారు రూ.1లక్ష35,900 స్థాయికి పడిపోయింది.
Gold – Silver
దసరా, దీపావళి పండగలను సెలబ్రేట్ చేసుకోవడానికి అంతా రెడీ అవుతున్న సమయంలో పసిడి ప్రియులకు మార్కెట్ బ్రోకర్లు, విశ్లేషకులు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ అండ్ సిల్వర్(Gold – Silver) ధరలు అకస్మాత్తుగా ఊహించని విధంగా దిగొచ్చాయి.
గ్లోబల్ మార్కెట్లో ఏర్పడిన పరిణామాలు, ముఖ్యంగా ఏషియన్ యూరోపియన్ ట్రేడింగ్ సెషన్ స్టార్టింగ్లో అమెరికన్ డాలర్ విలువ పుంజుకోవడం ఈ ధరలు తగ్గడంలో ప్రధాన కారణంగా నిలిచింది. దీనికి తోడు అంతకుముందు సెషన్లలో లాభాలు గడించిన ట్రేడర్లు స్వల్పకాలిక లాభాల కోసం అమ్మకాల వైపు మొగ్గు చూపించడంతో పసిడి మార్కెట్లో ఒక్కసారిగా కరెక్షన్ వచ్చింది.
దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1లక్ష48వేల260 వద్ద ట్రేడవుతుండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల పసిడి ధర సుమారు రూ.1లక్ష35,900 స్థాయికి పడిపోయింది. ఇక హైదరాబాద్తో పాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలోనూ ఈ ధరలే కొనసాగుతున్నాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ కాస్ట్ రూ.1లక్ష48వేల410 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1లక్ష36వేల50 వద్ద ఉంది. ముంబై, బెంగళూరు, పూనే లాంటి మెట్రో సిటీల్లో 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.1లక్ష48వేల260 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1లక్ష35వేల900గా రికార్డయింది. అలాగే హైదరాబాద్లో కిలో సిల్వర్ కాస్ట్ రూ.2లక్షల45వేల వద్ద ట్రేడ్ అవుతుండగా, ముంబై వంటి మార్కెట్లలో రూ.2లక్షల34వేల900గా ఉంది.
అయితే ఈ ధరలు ఎప్పటికప్పుడు గ్లోబల్ కరెన్సీ హెచ్చుతగ్గులు, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ పరిస్థితులపై ఆధారపడి మారుతుంటాయి. పండగ సమయానికి బంగారం(Gold – Silver) కొనాలని ప్లాన్ చేసుకునే వారు ముందుగా లైవ్ రేట్లు చెక్ చేసుకుని కొనడం మంచిది.
OpenAI : ఓపెన్ఏఐ సీక్రెట్ మీటింగ్పై కన్ను..ఏఐ టెక్నాలజీతోనే దొంగను పట్టిన ఎఫ్బీఐ..





