Just BusinessLatest News

May 1st : మేడే రోజు బ్యాంకు సెలవుందా? మే 1న అన్ని సందర్భాలున్నాయా?

May 1st : బ్యాంకుకు వెళ్లి నేరుగా చేయాల్సిన పనులైన చెక్కుల క్లియరెన్స్, నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ , పాస్‌బుక్ అప్‌డేట్ వంటివి ఈ సెలవు రోజు సాధ్యపడవు.

May 1st

భారతదేశంలో మే నెల మొదటి రోజున బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు సాధారణంగా సెలవు ఉంటుంది. 2026 మే 1 శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ రోజు ఒకేసారి నాలుగు ముఖ్యమైన సందర్భాలు కలిసి రావడంతో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవు ప్రకటించింది.

కార్మిక దినోత్సవం (మే డే), బుద్ధ పౌర్ణమితో పాటు మహారాష్ట్ర దినోత్సవం వంటివి ఒకే రోజు రావడం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు శాఖలన్నీ మూసి ఉంటాయి. సామాన్య ప్రజలు తమ బ్యాంకు పనుల కోసం వెళ్లి.. ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ సెలవు వివరాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది.

ఈ మే 1 వ తేదీ సెలవులో..ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులను, వారి కష్టాన్ని గౌరవిస్తూ జరుపుకునే కార్మిక దినోత్సవం గురించి ముందుగా చెప్పుకోవాలి. అదే రోజు శాంతికి మార్గదర్శకుడైన గౌతమ బుద్ధుని జన్మదినం కావడంతో.. బుద్ధ పౌర్ణమి వేడుకలను కూడా జరుపుకొంటారు.

అలాగే 1960లో ముంబయి రాష్ట్ర విభజన తర్వాత మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన రోజు కావడంతో.. మే 1వ(May 1st) తేదీన మహారాష్ట్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

అలాగే గిరిజన భాషా పరిరక్షకుడు పండిట్ రఘునాథ్ ముర్ము జయంతి కూడా మే 1 వ(May 1st) తేదీనే వస్తుంది. ఈయన సంతాలి భాష కోసం ఓల్-చికీ లిపిని సృష్టించి ఆ సంస్కృతికి ప్రాణం పోశారు. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.

May 1st
May 1st

బ్యాంకు శాఖలు మూతపడినా, కస్టమర్ల సౌకర్యం కోసం డిజిటల్ సర్వీసులు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి. ఏటీఎం (ATM) సేవలు, యూపీఐ (UPI) నగదు బదిలీలు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటివి కంటిన్యూగా పనిచేస్తాయి. అయితే బ్యాంకుకు వెళ్లి నేరుగా చేయాల్సిన పనులైన చెక్కుల క్లియరెన్స్, నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ , పాస్‌బుక్ అప్‌డేట్ వంటివి ఈ సెలవు రోజు సాధ్యపడవు.

కేవలం బ్యాంకులు మాత్రమే కాదు.. ప్రముఖ స్టాక్ మార్కెట్లు అయిన ఎన్‌ఎస్‌ఈ (NSE), బీఎస్‌ఈ (BSE)లలో కూడా ట్రేడింగ్ జరగదు. కాబట్టి ఏదైనా అత్యవసరమైన బ్యాంకు పని ఉన్నవారు.. ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. మరోవైపు మే నెలలో ఈ ప్రారంభ సెలవుతో పాటు మే 28న బక్రీద్ సందర్భంగా కూడా.. కొన్ని చోట్ల సెలవు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Coconut Water: కొబ్బరి నీళ్లను నిల్వ చేసి తాగుతున్నారా? అయితే ఇది మీ కోసమే..

Related Articles

Back to top button