New Pulsar 150 : ఇండియన్ మార్కెట్‌లోకి న్యూ పల్సర్ 150.. కొత్త ఇంజిన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రీ ఎంట్రీ..
New Pulsar 150 : యూత్‌ను రీసౌండింగ్ లెవెల్‌లో అట్రాక్ట్ చేసేలా బజాజ్ ఆటో.. తమ ఐకానిక్ బైక్ పల్సర్ 150కి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్స్‌తో నయా మోడల్‌ను ఇండియన్ మార్కెట్లో అఫీషియల్‌గా లాంచ్ చేసింది.
New Pulsar 150
భారతీయ టూ వీలర్ మార్కెట్‌లో పల్సర్ అనే పేరుకున్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. యూత్‌ను రీసౌండింగ్ లెవెల్‌లో అట్రాక్ట్ చేసేలా బజాజ్ ఆటో.. తమ ఐకానిక్ బైక్ పల్సర్ 150కి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్స్‌తో నయా మోడల్‌ను ఇండియన్ మార్కెట్లో అఫీషియల్‌గా లాంచ్ చేసింది.
కేవలం డిజైన్ మాత్రమే కాదు.. ఇంజిన్, టెక్నాలజీ, సేఫ్టీ విషయంలోనూ ఎక్కడా తగ్గేదేలే అన్న రేంజ్‌లో చేసిన ఛేంజెస్‌తో ఈ బైక్.. 150సీసీ సెగ్మెంట్‌లో మోస్ట్ ప్రీమియం ఆప్షన్‌గా నిలబడింది. భారత్ రోడ్లపై మళ్లీ తన ఆధిపత్యాన్ని ప్రూవ్ చేసుకోవడానికి రూ.1.15 లక్షల స్టార్టింగ్ ఎక్స్-షోరూమ్ ధరకు ఈ న్యూ అవతార్‌ను తీసుకొచ్చింది.
ఈ కొత్త పల్సర్ 150 బైక్‌ను కస్టమర్ల ఇష్టానికి అనుగుణంగా మెయిన్‌గా మూడు వేరియంట్లలో వస్తుంది. వీటిలో సింగిల్ డిస్క్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.15 లక్షలుగా డిసైడ్ చేశారు. ఇక ట్విన్ డిస్క్ సింగిల్ సీట్ వెర్షన్ ధర రూ.1.22 లక్షలుగా ఫిక్స్ చేయగా, మరింత స్పోర్టీ లుక్ ఇచ్చే స్ప్లిట్ సీట్ వేరియంట్ రూ.1.23 లక్షలు పలుకుతుంది. లాస్ట్ మోడల్‌తో పోలిస్తే కొత్తగా చేర్చిన హై-ఎండ్ ఫీచర్ల వల్ల వేరియంట్‌ను బట్టి ధర దాదాపు రూ.4 వేల నుంచి రూ.9 వేల వరకు పెరిగింది.
ఇక బైక్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బజాజ్ దీనిలో కంప్లీట్‌గా రీ-డిజైన్ చేసిన 150సీసీ పవర్‌ఫుల్ ఇంజిన్‌ను ఫిక్స్ చేసింది. ఈ న్యూ ఇంజిన్ 14 పీఎస్ పవర్, 14.1 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి అందించిన అప్‌గ్రేడెడ్ గేర్‌బాక్స్ వల్ల బైక్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా ఎలాంటి రోడ్డులో అయినా ఆ పరిస్థితులకు తగ్గట్లుగా రైడ్ చేయడానికి రెయిన్, రోడ్, స్పోర్ట్ పేరుతో మూడు స్పెషల్ మోడల్ రైడింగ్ మోడ్స్‌ను దీనిలో అందిస్తున్నారు.

రైడింగ్ కంఫర్ట్ కోసం ఈ బైక్‌కు న్యూ ఫ్రేమ్‌ను డిజైన్ చేశారు. ఓల్డ్ మోడల్‌లో ఉన్న ట్విన్ షాక్ అబ్జార్బర్లకు బదులు ఇప్పుడు మోడర్న్ మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్‌ను ఫిక్స్ చేశారు. లుక్స్ పరంగా స్మోక్డ్ ఎఫెక్ట్ కలిగిన ఎల్ఈడీ హెడ్‌లాంప్, డీఆర్‌ఎల్స్, ఎమర్జెన్సీ సైన్ కోసం హజార్డ్ లాంప్స్ అవైలబుల్ ఉన్నాయి.
ఇక టాప్ ఎండ్ ట్విన్ డిస్క్ వేరియంట్‌లో టెక్ లవర్స్ మెచ్చేలా 5 ఇంచెస్ కలర్‌ఫుల్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ సపోర్ట్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు మైలేజ్ అండ్ సైలెంట్ స్టార్ట్ ఇచ్చే ఐఎస్‌జీ (ISG) టెక్నాలజీని కూడా యాడ్ చేశారు.





