Just BusinessLatest News

Silver: భారీగా దిగి వచ్చిన వెండి .. పుత్తడి ధరల్లోనూ స్వల్ప ఊరట

Silver: హైదరాబాద్‌తో పాటు చెన్నై, కేరళలో వెండి ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉన్నాయి.

Silver

వెండి ఆభరణాలు, వస్తువులను కొనాలని చూస్తున్న వారికి ఇది నిజంగానే ఊరటనిచ్చే వార్త. కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న సిల్వర్ ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో వస్తున్న మార్పులతో పాటు భౌగోళిక రాజకీయ పరిస్థితుల ఎఫెక్ట్ వల్ల బులియన్ మార్కెట్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వెండి ధరలు ఊహించని విధంగా దిగి రావడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈరోజు అంటే ఏప్రిల్ 21న వెండి(Silver) ధరల్లో భారీగానే క్షీణత నమోదైంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కిలో వెండిపై ఏకంగా 10 వేల రూపాయల వరకు ధర తగ్గింది. ఈరోజు ఉదయం ప్రారంభంలో కిలో వెండి ధర 2,75,000 రూపాయలుగా నమోదవగా , ఉదయం 11 గంటల తర్వాత పది వేల రూపాయలు తగ్గి అది 2,65,000 రూపాయలకు చేరుకుంది. ఒకప్పుడు కిలో వెండి ధర 4 లక్షల రూపాయల వరకు వెళ్లి రికార్డు క్రియేట్ చేయగా, ప్రస్తుతం అది మెల్లమెల్లగా దిగివచ్చి దాదాపు లక్ష రూపాయలకు పైనే తగ్గడం గమనార్హం.

హైదరాబాద్‌తో పాటు చెన్నై, కేరళలో వెండి(Silver) ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం కిలో వెండి ధర 2,75,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. స్థానిక పన్నులు , రవాణా ఖర్చుల వల్ల ధరల్లో ఈ స్వల్ప తేడా కనిపిస్తుంది. సిల్వర్ ధరలు భారీగా తగ్గుతున్న సమయంలో, వెండి వస్తువులు, ఆభరణాల కొనుగోలుకు ఇదే సరైన సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Silver
Silver

ఇక పసిడి ధరల విషయానికి వస్తే, ప్రస్తుతం బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. నిన్న అంటే ఏప్రిల్ 20 వ తేదీన తులం బంగారంపై సుమారు 490 రూపాయల వరకు తగ్గింది. ఇక ఈరోజు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,55,290 రూపాయల వద్ద ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 1,42,350 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర 1,16,470 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్న సమయంలో వెండి ధరలు ఇలా భారీగా తగ్గడం సామాన్యులకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు. అయితే అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల బంగారం , వెండి ధరల్లో మార్పులు వచ్చే అవకాశముంటుంది. కాబట్టి, కొనుగోలుదారులు తాజా ధరలను గమనిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

New CEO: ఏఐ సవాళ్ల మధ్య యాపిల్ కొత్త సీఈఓ ఎంట్రీ.. టెక్ దిగ్గజం పయనం ఎలా ఉండబోతోంది?

Related Articles

Back to top button