HealthLatest News

Fruits :మెరిసే ఆపిల్..మురిపించే ద్రాక్ష..ముంచేసే కెమికల్స్.. మరి వీటిని తినాలా? వద్దా?

Fruits : ద్రాక్ష గుత్తుల మీద తెల్లటి పొరలా కనిపించే పురుగు మందులు.. నేరుగా మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి

Fruits

ఒకప్పుడు పండ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేవారు. కానీ పండ్లు తింటే లేనిపోని రోగాలు వస్తాయ్ జాగ్రత్త అని నిపుణులు చెబుతున్నారు. దీంతో పండ్లు(Fruits) తిని ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఎందుకని దూరంగానే ఉంటున్నారు చాలామంది. అయితే పండ్లు తినడం మానేయొద్దని వాటిని బాగా క్లీన్ చేసుకుని తింటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ముందుగా ఆపిల్స్ విషయమే తీసుకుంటే ఆపిల్ పైన ఉండే ఆకర్షణీయమైన మెరుపు వెనుక ప్రమాదకరమైన వ్యాక్స్ ఉంటుంది. ఇది కడుపులోకి వెళ్తే జీర్ణకోశ సమస్యలు రావడం గ్యారెంటీ. అందుకే వాటిని కొని తెచ్చిన వెంటనే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, బేకింగ్ సోడా కలిపి అందులో వాటిని 3-5నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత మెత్తటి కాటన్ గుడ్డతో తుడిస్తే ఆపిల్ పైన ఉన్న మైనం పొర తొలగిపోతుంది.

అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా ద్రాక్ష పండ్లే( Grapes Fruits) కనిపిస్తున్నాయి. సీజనల్ ఫ్రూట్స్ కదా అని చాలామంది టేస్ట్ చూడటానికి అక్కడే రెండు పండ్లు నోట్లో వేసుకుంటారు. కానీ ఇది చాలా డేంజర్. అదే కాదు ఇంటికి తీసుకువచ్చాక వాటిని ట్యాప్ వాటర్లో వేసి తినేస్తారు అది కూడా సరిపోదంటున్నారు నిపుణులు.

ఎందుకంటే ద్రాక్ష పండ్లు (Fruits) పురుగులు పట్టే జాతి కావడంతో వీటిపై చాలా ఫెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు. దీనివల్ల ద్రాక్ష గుత్తుల మీద తెల్లటి పొరలా కనిపించే పురుగు మందులు.. నేరుగా మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి.అందుకే తెచ్చిన వెంటనే ప్రిడ్జిలో పెట్టకుండా ద్రాక్ష పళ్లను విడివిడిగా చేసి, ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటిలో కనీసం 20 నిమిషాలు అయినా నానబెట్టాలి.

ఇక స్ట్రాబెర్రీలు, జామ పండ్లు వంటి వాటిని వెనిగర్ కలిపిన నీటిలో అంటే ఒక వంతు వెనిగర్, మూడు వంతుల నీరు వేసి కడిగితే వాటి రంధ్రాల్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. సిట్రస్ ఎక్కువ కావాలి అనుకుంటే కమలాలు ఎక్కువ తీసుకుంటే బెటర్ అని నిపుణులు అంటున్నారు.

అలాగే వేసవి వస్తుందంటే అందరికీ గుర్తొచ్చేది మామిడిపండ్లు. కానీ వీటిని త్వరగా మగ్గబెట్టడానికి చాలా ప్రమాదరకరమైన కాల్షియం కార్బైడ్ వాడుతుంటారు. దీనివల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పండు మొత్తం ఒకే రంగులో ఉండి, అక్కడక్కడా నల్లటి మచ్చలు లేకపోతే మాత్రం అది కచ్చితంగా కెమికల్‌తో మగ్గినట్లే అర్ధం. సహజంగా మగ్గిన మ్యాంగో అక్కడక్కడా పచ్చగా, అక్కడక్కడా పసుపుగా ఉంటుంది.

మామిడి పండ్లను(Mango Fruits) తినే ముందు కనీసం 30 నిమిషాలు నార్మల్ వాటర్లో అయినా నానబెట్టిన తర్వాతే తినాలి. దీనివల్ల పండులోని వేడి (Heat) తగ్గడమే కాకుండా, పైన ఉన్న ఫెస్టిసైడ్స్ ప్రభావం కూడా బాగా తగ్గుతుంది.

అంతేకాదు పుచ్చకాయ లోపల బాగా పండింది అనేలా ఎర్రగా కనిపించడానికి ఎరిత్రోసిన్ అనే రసాయనాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించేస్తున్నారు. పుచ్చకాయ కోసినప్పుడు లోపల రంగు మరీ గాఢంగా ఉండటం కానీ, మధ్యలో రంధ్రంలా అంటే ఇంజెక్షన్ చేసిన గుర్తు కానీ ఉంటే అది అనుమానించాల్సిందే. అలాంటప్పుడు పుచ్చకాయ ముక్కను నీటిలో వేస్తే ఆ నీరు వెంటనే ఎర్రగా మారితే మాత్రం అది రంగు కలిపినట్లే లెక్క. అందుకే పుచ్చకాయను కోసే ముందు బయట బాగా కడగాలి. కోసిన తర్వాత అది సహజమైన రంగులో ఉందో లేదో గమనించాక అప్పుడు తినాలి.

Fruits
Fruits

అలాగే అరటి పండ్లను త్వరగా పండించడానికి ఎథెఫాన్ అనే లిక్విడ్‌లో గెలలతో సహా ముంచుతారు.దీనిని గుర్తించడానికి పండు తొక్క పసుపు రంగులో మెరుస్తూ ఉంటూ.. దాని కాడ (Stem) మాత్రం పచ్చగా ఉంటే మాత్రం అది కెమికల్ అరటిపండే అని అర్ధం. సహజంగా పండిన అరటి పండు అయితే పండుతో పాటు కాడ కూడా నల్లగా లేదా పసుపుగా మారుతుంది. అందుకే అరటి పండ్లను తినే ముందు శుభ్రంగా కడగాలి.

ఇక చివరగా బొప్పాయి పండు. దీనిని తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే వీటని కూడా త్వరగా పండటానికి, నిల్వ ఉంచడానికి కెమికల్స్,స్ప్రేలు వాడుతుంటారు. అందుకే బొప్పాయిని కూడా తొక్క తీసే ముందే బాగా కడగాలి.అలాగే తొక్క తీసాక మరోసారి కడిగి అప్పుడు తినాలి.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button