Ketan : పూణే మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. క్రూయల్ మైండ్‌తో పక్కా క్రైమ్ స్కెచ్ అంత దారుణమా?
Ketan : టెక్నాలజీని వాడుకుని, సీసీటీవీల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. చట్టం ముందు ఏ నేరస్థుడూ తప్పించుకోలేడని అనడానికి కేతన్ కేసే నిదర్శనంగా నిలుస్తుంది.
Ketan
పూణేకు చెందిన యంగ్ బిజినెస్మెన్ కేతన్ అగర్వాల్ కేసులో.. రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి లోయలో పడి చనిపోవడంతో.. మొదట్లో ఇదొక యాక్సిడెంట్ అనే అందరూ అనుకున్నారు.
తర్వాత తీగ లాగితే డొంక కదిలినట్లుగా కేతన్(Ketan) మర్డర్ గురించి ఒక్కొక్క విషయం వెలుగులోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. కేతన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్న సియా గోయల్, ఆమె సీక్రెట్ లవర్ చేతన్ చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణను స్పీడప్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా పోలీసుల విచారణలో అత్యంత భయంకరమైన, ఒళ్లు గగుర్పొడిచే విషయాలు బయటపడ్డాయి. జూన్ 18న జరిగిన కేతన్ మరణం వెనుక.. పక్కా సినిమా స్క్రిప్ట్‌ను తలపించేలా ఒక షూలేస్ డెత్ సిగ్నల్ ప్లాన్ కూడా దాగుందని తెలిసి పోలీసులే కంగుతిన్నారు.
అంతేకాదు ఈ ఘాతుకానికి ముందే సియా గోయల్, పెళ్లి షాపింగ్ , ఇతర అరేంజ్మెంట్స్ పేరుతో.. కేతన్(Ketan) అగర్వాల్ దగ్గర ఏకంగా రూ. కోటి నొక్కేసింది. ఫైనాన్షియల్‌గా కాస్త వీక్‌గా ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన తన లవర్ చేతన్ చౌదరి బిజినెస్‌లో సెటిల్ అవ్వడానికి ఆ రూ. కోటి అతనికి సీక్రెట్‌గా ఇచ్చేసింది.
ఇక్కడే ఇంకాస్త క్రిమినల్ మైండ్‌తో ఆలోచించిన ఈ కిల్లర్ లవర్స్.. ఈ హత్య తర్వాత ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండడానికి మూడేళ్ల టైమ్‌లైన్ స్కెచ్ కూడా సిద్ధం చేసుకున్నారు. కేతన్ చనిపోయాక మూడేళ్ల వరకు తామిద్దరూ కూడా పెళ్లి చేసుకోకూడదని,కేతన్ కేసు పూర్తిగా క్లోజ్ అయ్యాక, ఈలోగా చేతన్ బిజినెస్‌లో బాగా నిలదొక్కుకున్నాక.. అప్పుడు సియా ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేశారు.
అయితే, జూన్ 18న లోహగడ్ కోటపై కేతన్‌ను లోయలోకి నెట్టేయడానికి సియా.. చేతన్‌కు సీక్రెట్ సిగ్నల్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. కోటపై నడుస్తున్నప్పుడు సియా వాటర్ తాగడానికో లేక తన షూలేస్ కట్టుకోవడానికో కిందకు వంగి కూర్చోవడమే వీరిద్దరి మెయిన్ సిగ్నల్ అని ఫిక్స్ చేసుకున్నారు.
ప్లాన్ ప్రకారమే సియా కిందకు కూర్చోవడంతో వెనుక దాక్కుని ఉన్న చేతన్ ఒక్కసారిగా ముందుకు వచ్చి కేతన్‌ను లోయలోకి నెట్టేశాడు. అయితే ఈ కూర్చోవడాన్ని సెలక్ట్ చేసుకోవడం వెనుక సియా సేఫ్టీ ప్లాన్ ఉందట. ఒకవేళ చేతన్.. కేతన్‌ను తోసేటప్పుడు తనను తాను కాపాడుకోవడానికి పక్కనే ఉన్న సియాను కేతన్(Ketan) కనుక పట్టుకుంటే.. ఆమె కూడా లోయలో పడిపోకుండా, సియాను సేఫ్‌గా ఉంచడానికే ఈ స్కెచ్ వేసినట్లు పోలీసులు వివరించారు.
ఈ మర్డర్ ప్లాన్‌లో దొరకకూడదని చేతన్ చౌదరి చాలా తెలివిగా ప్లాన్ చేశాడట. కారు వాడితే హైవే టోల్ ప్లాజాల వద్ద ఉండే సీసీటీవీ కెమెరాల్లో తన కారు నెంబర్ రికార్డ్ అవుతుందని ఆలోచించి.. ఉద్దేశపూర్వకంగానే ఒక స్కూటర్‌పై పూణే నుంచి దాదాపు 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కేతన్, సియాలను ఫాలో అయ్యాడు.
అంతేకాదు, కోటపై నుంచి కేతన్(Ketan)ను తోసేయడానికి 35 నిమిషాల ముందు వీరిద్దరూ కాల్లో మాట్లాడుకున్నట్లు విచారణలో తేలింది. కాల్ డేటా రికార్డులతో పాటు నిందితుల తాజా వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో ఉన్న నమ్మకశ్యం కాని లింకులను క్లియర్ కట్‌గా ఛేదించారు.
అయితే ఈ కేసులో నిందితులు ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్లే, మంచి ఫ్యూచర్ ఉన్నవాళ్లే.. అయినా డబ్బుపై ఆశ, ఒకరిపై ఒకరికి వ్యామోహం కోసం ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం .. ఇప్పటి జనాల మైండ్‌సెట్ ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పకనే చెబుతుంది.

చదువుతో సంస్కారాన్ని అలవర్చుకోవడం మానేసి.. ఇలాంటి క్రూరమైన నేరాలకు ప్లాన్ గీసే క్రిమినల్ నాలెడ్జ్‌గా మారడం నిజంగా ఆలోచించతగ్గదే. అయితే టెక్నాలజీని వాడుకుని, సీసీటీవీల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. చట్టం ముందు ఏ నేరస్థుడూ తప్పించుకోలేడని అనడానికి ఈ కేసే నిదర్శనంగా నిలుస్తుంది.
చదువుకున్న నాలెడ్జిని మంచి దారిలో కాకుండా, ఇలాంటి షార్ట్‌కట్ సక్సెస్ కోసం, క్రైమ్ కోసం వాడితే జీవితాలు ఎలా జైలు పాలవుతాయో చెప్పడానికి ఈ పూణే ఘటనను ఒక గుణపాఠంగా తీసుకోవాలి. నేరం చేసిన వాడు ఈరోజు కాకపోతే రేపు అయినా శిక్ష అనుభవించాల్సిందే అన్న చేదు నిజాన్ని తెలుసుకోవాలి.
RAPO23 : డైరెక్టర్ రామ్ పోతినేని ..సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌తో రాపో కొత్త జర్నీ..





