Just CrimeJust InternationalLatest News

Phoebe Gates : బిల్ గేట్స్ కూతురు డిజిటల్ చోరీ చేశారా? కూకీ స్టఫింగ్ అనేది అంత పెద్ద స్కామ్‌నా?

Phoebe Gates : ఫోబ్ గేట్స్ నిజంగాఈ నేరం చేసినట్లు కనుక కోర్టులో అధికారికంగా రుజువైతే అమెరికా చట్టాల ప్రకారం ఫెడరల్ వైర్ ఫ్రాడ్ కింద ఏకంగా 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంది.

Phoebe Gates

వరల్డ్ టాప్ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూతురు ఫోబ్ గేట్స్ స్థాపించిన ఫియా (Phia) అనే షాపింగ్ స్టార్టప్ ఇప్పుడు టెక్, బిజినెస్ వరల్డ్‌ను షేక్ చేసేంత పెద్ద వివాదంలో కూరుకుపోయింది. బయటకు చాలా కలర్‌ఫుల్ అండ్ ట్రెండీగా కనిపించే ఈ స్టార్టప్ వెనుక పెద్ద స్థాయిలో కూకీ స్టఫింగ్ అనే డిజిటల్ చోరీ జరిగిందనే ఆరోపణలు విపరీతంగా వెల్లువెత్తుతున్నాయి.

ఒకవేళ ఫోబ్ గేట్స్(Phoebe Gates) నిజంగాఈ నేరం చేసినట్లు కనుక కోర్టులో అధికారికంగా రుజువైతే అమెరికా చట్టాల ప్రకారం ఫెడరల్ వైర్ ఫ్రాడ్ కింద ఏకంగా 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎలాంటి అఫీషియల్ కేసులు నమోదు కాకపోయినా, బిలియనీర్ కూతురి కంపెనీపై వచ్చిన ఈ అతిపెద్ద స్కామ్ వార్త ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది

ఇదే సమయంలో అసలు మైండ్ బ్లాక్ అయ్యే ఈ కూకీ స్టఫింగ్ డర్టీ గేమ్ ఏంటనే ప్రశ్న చాలామందిలో వినిపిస్తోంది. సాధారణంగా మనం ఏదైనా పర్చేజ్ చేయాలనుకుని వెబ్‌సైట్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు వాళ్లు ఇచ్చే డిస్కౌంట్లు , కూపన్లు వాడినా వాడకపోయినా, మనకు తెలీయకుండానే మన బ్రౌజర్‌లోకి కొన్ని సీక్రెట్ ట్రాకింగ్ కుకీలను బలవంతంగా తోసేస్తారు.

సీక్రెట్ ట్రాకింగ్ కుకీలను బ్రౌజర్‌లోకి పంపడం వల్ల యూజర్లు ఆ తర్వాత నుంచి ఏం కొన్నా సరే తమ వల్లే ఈ కస్టమర్ ఆ సైట్‌కి వచ్చి కొన్నాడని చెప్పి నైక్, గ్యాప్, నార్డ్‌స్ట్రామ్ వంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి ఈ స్టార్టప్ కంపెనీ దొంగదారిన భారీగా కమీషన్లు గుంజేసింది.

బ్లూమ్‌బెర్గ్ రిలీజ్ చేసిన ఒక షాకింగ్ నివేదిక ప్రకారం.. ఈ డిజిటల్ మాయాజాలం గురించి ఆ స్టార్టప్ ఫౌండర్లు అయిన ఫోబ్ గేట్స్ (Phoebe Gates), సోఫియా కియానీలకు 7 నెలల ముందే ఇంటర్నల్‌గా ఇ పక్కా సమాచారం తెలుసని తేలింది. అంతేకాదు కంపెనీ ఇప్పటి వరకూ చూపించిన వావ్ అనిపించే ఆదాయంలో ఎక్కువ భాగం ఈ అడ్డదారి కమీషన్ల ద్వారానే వచ్చిందని ఆ రిపోర్ట్ చెప్పింది. ఈ ఆరోపణలు బయటకు వచ్చి రచ్చ రచ్చ అవ్వడం స్టార్ట్ అవగానే.. జులై 7న వెంటనే ఆ ఫీచర్‌ను సైలెంట్‌గా ఆపేసినట్లు కూడా ప్రకటించింది.

Phoebe Gates
Phoebe Gates

చిత్రం ఏంటంటే, ఆ ఫీచర్ ఆపేసిన మర్నాడే కంపెనీ డైలీ ఇన్కమ్ ఒక్కసారిగా దారుణంగా పడిపోయింది. మొదట్లో దీనిని సింపుల్‌గా ఒక టెక్నికల్ ఎర్రర్ అని కంపెనీ కవర్ చేయడానికి ట్రై చేసినా.. మ్యాటర్ సీరియస్ అవ్వడంతో ఇప్పుడు టోన్ మార్చేసింది.

తాము పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని, దెబ్బతిన్న బ్రాండ్ పార్ట్‌నర్స్‌కు అమౌంట్ రిఫండ్ చేస్తామని, ఫ్యూచర్‌లో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఒక స్పెషల్ కంప్లయన్స్ హెడ్‌ను కూడా తాము అపాయింట్ చేసుకుంటున్నామని ఫియా ఒక స్టేట్‌మెంట్‌లో క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమయినా ఈ నేరం కనుక ప్రూవ్ అయితే బిల్‌గేట్స్ తనయకు భారీ పనిష్‌మెంట్ ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Sravana Masam Prasadam : శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ ప్రసాదం చేసి పెట్టండి..లక్ష్మీదేవి కటాక్షం ఖాయం

Related Articles

Back to top button