Just CrimeLatest News

SBI Data Leak : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్..డార్క్ వెబ్‌లో డేటా లీక్

SBI Data Leak : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐలో భారీ డేటా లీక్ నమోదైంది. దాదాపు 3,900 మంది కస్టమర్ల వ్యక్తిగత వివరాలు డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమైనట్లు బ్యాంకు గుర్తించింది. ఈ ఘటనపై విచారణను స్పీడప్ చేస్తూ కస్టమర్లకు కీలక సూచనలు చేసింది.

SBI Data Leak

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ హోల్డర్స్ భద్రతపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకుకు చెందిన వేలాది మంది కస్టమర్ల ఇంపార్టెంట్ అండ్ పర్సనల్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్లు, డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమైనట్లు వార్తలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఎస్బీఐ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఫైలింగ్ చేస్తూ అఫీషియల్ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ లీకేజీ వ్యవహారంపై హై లెవెల్ ఇండిపెండెంట్ ఎంక్వైరీని వేగవంతం చేసినట్లు వెల్లడించింది.

ఈ నెల 16న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)తో పాటు డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, థ్రెట్ ఇంటెలిజెన్స్ కంపెనీల నుంచి తమకు వచ్చిన వార్నింగ్‌ను బేస్ చేసుకుని బ్యాంకు యంత్రాంగం అప్రమత్తమైంది.

డార్క్ వెబ్‌లో దొరికిన సుమారు 3.75 లక్షల రికార్డులను లోతుగా పరిశీలించగా, దానిలో దాదాపు 3,897 రికార్డులు ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించినవిగా బేసిక్ అనాలసిస్‌లో తేలింది. ఈ బహిర్గతమైన డేటాలో ఖాతాదారుల ఫుల్ నేమ్స్, ఫోన్ నెంబర్లు, డేట్ ఆఫ్ బర్త్‌లు, రెసిడెన్షియల్ అడ్రస్‌లతో పాటు సీఐఎఫ్ (CIF) ఐడెంటిఫైయర్లు, లోన్ , లీడ్ రికార్డులకు సంబంధించిన కీలక మెటాడేటా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

డేటా లీక్(SBI Data Leak) వ్యవహారం బయటపడటంతో ఎస్బీఐ వెంటనే సైబర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ కంటైన్‌మెంట్ ప్రోటోకాల్స్‌ను అమల్లోకి తెచ్చింది. లీకేజీ ఎలా జరిగింది? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమున్నాయి? ఎంత వరకూ నష్టం వాటిల్లిందనే విషయాలను సమగ్రంగా అంచనా వేయడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులను ఆశ్రయించినట్లు స్పష్టం చేసింది.

అయితే ఈ డేటా లీక్(SBI Data Leak) వల్ల బ్యాంకు డైలీ బిజినెస్ యాక్టివిటీస్ , ఆర్ధిక పనితీరు లేదా మెయిన్ సర్వీసులపై ఎలాంటి నెగిటివ్ ప్రభావం పడదని ఎస్బీఐ కస్టమర్లకు కొండంత భరోసానిచ్చింది. అదే సమయంలో ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని బ్యాంకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. లీకైన పర్సనల్ డేటాను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా ఫిషింగ్ లేదా సోషల్ ఇంజనీరింగ్ మోసాలకు పాల్పడే ముప్పుందని హెచ్చరించింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు అధికారులమని చెప్పే ఎవరికీ కూడా ఓటీపీ, పిన్ నెంబర్లు, పాస్‌వర్డ్‌లు చెప్పొద్దని చెప్పింది. ప్రస్తుతం ఘటనపై విచారణ సాగుతోందని.. ఇలాంటి ఘటనలు రిపీట్ అవకుండా భద్రతా చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది.

Ravana Tandavam : రామాయణ నుంచి రావణ తాండవం గ్లింప్స్.. ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్స్ క్రేజీ కాంబో..

Related Articles

Back to top button