Surekha Vani : సురేఖ వాణి ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్, ప్రైవేట్ కంటెంట్ లీక్..సెలబ్రెటీలే ఎందుకు టార్గెట్ అవుతారు?
Surekha Vani : నటి సురేఖ వాణి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆమె ప్రైవేట్ కంటెంట్‌ను సర్క్యులేట్ చేయడంపై తీవ్రంగా స్పందించిన సురేఖ వాణి, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Surekha Vani
టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖ వాణి(Surekha Vani) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురికావడం టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది. అకౌంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ కేటుగాళ్లు.. సురేఖ వాణికి(Surekha Vani) సంబంధించిన కొన్ని పర్సనల్, ప్రైవేట్ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ చేయడంతో ఈ విషయం క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ అనుకోని ఇన్సిడెంట్‌పై సురేఖ వాణి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక మెసేజ్ విడుదల చేశారు.
తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ కావడాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కావాలనే తన ప్రైవేట్ విషయాలను, కంటెంట్‌ను సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తున్నారని సురేఖ వాణి చెప్పుకొచ్చారు. కేవలం వ్యూస్, లైక్స్, రీచ్ కోసం ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించవద్దని మీడియా సంస్థలను, యూట్యూబ్ ఛానెళ్లను, వివిధ మీమ్ పేజీల నిర్వాహకులను కోరారు. ఎక్కడైనా తన పర్సనల్ కంటెంట్ షేర్ అయి ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయాలని, రీపోస్ట్ చేయడం వెంటనే ఆపేయాలని రిక్వెస్ట్ చేశారు
ఇది పూర్తిగా తన వ్యక్తిగత గౌరవానికి, ప్రైవసీకి సంబంధించిన సెన్సిటివ్ విషయమని దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని సురేఖ వాణి తేల్చిచెప్పారు. తన వార్నింగ్‌ను బేఖాతరు చేసి ఎవరైనా ఆ ప్రైవేట్ కంటెంట్‌ను ఇంకా షేర్ చేస్తే , వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ను గౌరవించాలని, ఇలాంటి బాధ్యతారహిత చర్యలకు దూరంగా ఉండాలని రిక్వెస్ట్ చేశారు.
అయితే సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లకు విపరీతమైన ఫాలోవర్లు, రీచ్ ఉండటం వల్లే హ్యాకర్లు వారిని మెయిన్ టార్గెట్‌గా చేసుకుంటారు. వీక్ పాస్‌వర్డ్‌లను వాడటం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఎనేబుల్ చేయకపోవడం వంటి లైట్ తీసుకునే అలవాట్ల వల్ల హ్యాకర్లు ఈజీగా అకౌంట్లను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. అలాగే,తమ తోటి సెలబ్రిటీల పేరుతో వచ్చే ఫేక్ ఈమెయిళ్లు, ఫిషింగ్ లింక్స్ (Phishing Links) లేదంటే తెలీని థర్డ్-పార్టీ యాప్‌లను యాక్సెస్ చేయడం వల్ల కూడా సైబర్ నేరగాళ్లు ఈజీగా వీరి డేటాను చోరీ చేస్తుంటారు.
కొన్నిసార్లు క్లౌడ్ స్టోరేజ్ (iCloud లేదా Google Drive) హ్యాక్ కావడం వల్ల దానిలో సేవ్ అయి ఉన్న పర్సనల్ ఫోటోలు, వీడియోలు కూడా లీక్ అవుతుంటాయి. ఇలా దొరికిన ప్రైవేట్ కంటెంట్‌ను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం లేదా సోషల్ మీడియాలో లీక్ చేసి క్షణాల్లో విపరీతమైన వ్యూస్, వైరల్ రీచ్ పొందడమే కొందరి మెయిన్ టార్గెట్‌గా మారుతోంది. ఇలాంటి సైబర్ నేరాల పట్ల సెలబ్రిటీలు, అలర్ట్‌గా ఉండాలని, సోషల్ మీడియా అకౌంట్ల సేఫ్టీ కోసం స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఫీచర్లు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
View this post on Instagram





