Just EntertainmentLatest News

Raaka : టైటిల్ తోనే హైప్ పెంచిన రాకా…అసలు స్టోరీ ఇదేనా ?

Raaka : అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న ఈ కొత్త మూవీపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి

Raaka

పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తగ్గట్టే అదిరిపోయే కాంబినేషన్ తో సినిమా చేస్తున్నాడు బన్నీ. అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న ఈ కొత్త మూవీపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమా ప్రకటించినప్పుడే అంచనాలు బాగా పెరిగిపోగా.. ఇప్పుడు టైటిల్ రివీల్ చేయడంతో అవి తారాస్థాయికి చేరాయి.

అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీకి ‘ రాకా ‘ (Raaka)అనే క్రేజీ టైటిల్ పెట్టారు. ఐకాన్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అట్లీ ‘ రాకా ‘(Raaka) టైటిల్ ను అనౌన్స్ చేసారు. ఈ సందర్భంగా మూవీలో బన్నీ లుక్ ను కూడా రివీల్ చేశారు. తోడేలు చేయి, నుదుటిపై గాయం, గుండుతో బన్నీ లుక్ ఇప్పటివరకూ చూడని విధంగా చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ లుక్ రివీల్ చేసిన తర్వాత పునర్జన్మలు, సమాంతర ప్రపంచం అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే ఈ మూవీ వస్తుందన్న ప్రచారం మరింత బలపడింది.

టైటిల్ తో పాటు అల్లు అర్జున్ లుక్ తో అసలు స్టోరీ ఏంటా అంటూ నెటిజన్లు, అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు. అసలు రాకా(Raaka) అంటే అర్థమేంటనేది కూడా తెగ వెతికేస్తున్నారు. రాకా అంచే సంస్కృతంలో నిండు పున్నమి అని అర్థమట. దీంతో చీకటి నుంచి వెలుగులు నింపే వారియర్‌గా బన్నీ కనిపిస్తాడని చెబుతున్నారు.

ఈ క్రమంలో అట్లీ ఆ టైటిల్ పెట్టాడంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. అలాగే యుద్ధంలో లేదా హింస జరిగినప్పుడు ఎర్రగా మారిన చంద్రుడు అనే అర్థం వచ్చేలా హీరో విశ్వరూపం ఇలా ఉండబోతోందన్న మరో స్టోరీ కూడా ట్రెండింగ్ లో ఉంది.

అదే సమయంలో పునర్జన్మల బ్యాక్ డ్రాప్ కథగా వచ్చే ఈ సినిమాలో హీరోకి మరణం ఉండదని అర్థం వచ్చేలా రాకా టైటిల్ పెట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది. బన్నీ ఫస్ట్ లుక్ చూస్తుంటే రాక్షసుడిగా కనిపిస్తున్నాడు. చాలా కొత్తగా గుండుతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Raaka
Raaka

అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ 3 విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. హీరోతో పాటు విలన్ గా కూడా బన్నీనే అంటున్నారు. రూపం లేని ఒక వ్యక్తి తన ఉనికిని చాటుకునే కథగా మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకూ రాకా స్టోరీ ఏంటనేది డైరెక్టర్ ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు.

కానీ టైటిల్ అనౌన్స్ చేసాక, బన్నీ లుక్ చూసిన తర్వాత చాలా మంది చాలా అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కాకుంటే బన్నీ మాత్రం ఒక కొత్త పాత్రలో ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నట్టు తేలిపోయింది. దాదాపు 18 ఏళ్లుగా ఒకే ఆలోచనను కథగా తీర్చిదిద్దానంటూ అట్లీ చెప్పడం కూడా రాకా మూవీపై మరింత హైప్ పెంచేసింది. వచ్చే ఏడాది ఈ మూవీ అభిమానుల ముందుకు రాబోతోంది.

Gujarat Titans : గట్టెక్కిన గుజరాత్…ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి

Related Articles

Back to top button