Just EntertainmentLatest News

Anchor Suma: ట్రోలర్స్‌కు సుమ స్ట్రాంగ్ వార్నింగ్..రిటైర్‌మెంట్ గురించి షాకింగ్ ఆన్సర్

Anchor Suma: ప్రేమంటే సినిమా ఈవెంట్‌లో సుమ మాట్లాడుతూ తన రిటైర్మెంట్ కోసం తరచూ ప్రశ్నిస్తున్న వారికి గట్టిగా ఇచ్చిపడేశారు.

Anchor Suma

తెలుగు బుల్లితెరపై తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏలుతున్న యాంకర్ సుమ కనకాల(Anchor Suma). తనదైన స్పాంటేనియస్ మాటలతో, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో మరియు పంచ్‌లతో ఆమె ప్రతీ ఈవెంట్లో సెంట్రల్ అట్రాక్షన్‌గా నిలవడం కొత్తేమీ కాదు.

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా టీవీ, సినిమా రంగంలో కొనసాగుతూ, 20 ఏళ్లకు పైగా యాంకరింగ్‌(Anchor Suma)తో ప్రేక్షకులను అలరిస్తున్న సుమ, ఇటీవల తన రిటైర్మెంట్‌పై కొందరు చేస్తున్న కామెంట్స్‌కు, ఇండైరెక్ట్ విమర్శలకు తన దైన శైలిలోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

50 ఏళ్లు ఉన్నా కూడా, ఎంతో యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ చురుకుగా పనిచేస్తున్న యాంకర్ సుమ(Anchor Suma)పై ఇటీవల కొంతమంది ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “సుమకు ఏజ్ అయిపోతుంది”, “సుమ తర్వాత ఎవరు”, “సుమ ఎప్పుడు రిటైర్ అవుతారు” అంటూ వచ్చిన కామెంట్స్‌ చేశారు.

Anchor Suma
Anchor Suma

అంతేకాదు తరచూ ఇతర యాంకర్లు “సుమ(Anchor Suma)నే అన్ని ఈవెంట్లను కవర్ చేస్తుంది, తమకు అవకాశాలు రావడం లేదు” అంటూ పరోక్షంగా చేసిన విమర్శలకు తాజాగా సుమ ధీటైన సమాధానం ఇచ్చారు.

తాజాగా తాను నటించిన ‘ప్రేమంటే’ సినిమా ఈవెంట్‌లో సుమ(Anchor Suma) మాట్లాడుతూ తన రిటైర్మెంట్ కోసం విమర్శిస్తున్న వారికి గట్టిగా ఇచ్చిపడేశారు.

“చాలా మంది నన్ను అడుగుతున్నారు – మీరు ఎప్పుడు రిటైర్ అవుతారని. నేనెందుకు రిటైర్ అవ్వాలి? మా కుటుంబం జెనెటిక్స్ (Genetics) చాలా స్ట్రాంగ్ జీన్స్‌తో కూడినవి. మా అమ్మకు 84 ఏళ్లు. కానీ ఇప్పటికీ ఆమె చాలా యంగ్‌గా, చురుకుగా ఉంటారు. ఆమెకే రిటైర్మెంట్ లేనప్పుడు నాకెందుకు ఉంటుంది?

మా అమ్మమ్మ 101 ఏళ్ళు బతికారు. మా పెద్ద మామయ్యకు 99 ఏళ్లు. ఇప్పటికీ ఆయన అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు, గిన్నిస్ రికార్డ్ హోల్డర్ కూడా! రిటైర్మెంట్ గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారు ? నేను ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఇలానే ఉత్సాహంగా నా పని చేస్తూ ఉంటాను,” అంటూ సుమ తనదైన శైలిలో సెటైరికల్‌గా విమర్శకుల నోళ్లు మూయించారు.

Anchor Suma
Anchor Suma

కాగా సుమను కేవలం ‘లక్’ మాత్రమే ఈ స్థానానికి తీసుకువచ్చిందని అనడం ఎంతమాత్రం సబబు కాదు. ఆమె సుదీర్ఘ కెరీర్, నిరంతర విజయం వెనుక ఉన్న రహస్యం ఆమె యొక్క అంకితభావం మరియు అసాధారణమైన నైపుణ్యాలే. ఆమె ప్రతి ఈవెంట్ కోసం చేసే కఠినమైన హోంవర్క్, మరియు ఆన్-ది-స్పాట్ స్పాంటేనియస్ కామెడీ టైమింగ్ ఆమెకు తిరుగులేని స్టార్‌డమ్‌ను అందించాయి.

ఎవరితో ఎలా ఉండాలో, ప్రతీ ఆర్టిస్ట్‌ను ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి కాబట్టే, బుల్లితెర చిన్న ఈవెంట్ అయినా, వెండితెర గ్రాండ్ ఈవెంట్ అయినా ‘సుమ ఉండాల్సిందే’ అని ఆడియన్స్ మరియు మేకర్స్ కోరుకుంటారు. సెటైర్ వేయాలన్నా, తనపై వచ్చిన ట్రోలింగ్స్‌కు కౌంటర్ ఇవ్వాలన్నా సుమ తర్వాతే ఎవరైనా. ఈ విషయంలో ఆమె తనదైన శైలిని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

అప్పుడప్పుడు చిన్నచిన్న కాంట్రవర్సీ కామెంట్స్‌లో ఇరుక్కున్నా, మొత్తంగా యాంకరింగ్‌లో ‘ది బెస్ట్ సుమ’ అని విమర్శకులు సైతం ప్రశంసలు అందుకుంటూ అలానే దూసుకుపోతున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button