Just EntertainmentLatest News

Ramayana : రామాయణకు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ కూడా లీక్..

Ramayana : నితీశ్ తివారీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న 'రామాయణ' మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి క్లీన్ 'యూ' సర్టిఫికెట్ లభించగా, 3 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో నవంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా విడుదల కానుంది.

Ramayana

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త హిస్టరీని తిరగరాయడానికి దార్శనిక దృశ్యకావ్యం రామాయణ మూవీ రెడీ అవుతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

రామాయణ(Ramayana) రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ మూవీకి సంబంధించిన ఒక్కో క్రేజీ అప్‌డేట్ ఒక్కోటీ బయటకు వచ్చి నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఇలా ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’ ద్వారా ఈ మూవీ సెన్సార్ , నిడివికి సంబంధించిన ఒక మైండ్ బ్లాకింగ్ న్యూస్ బయటకు వచ్చి వైరల్ అవుతోంది.

ఈ విజువల్ ఎపిక్‌ను సెన్సార్ బోర్డు ఇప్పటికే చూసి..ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యూ’ (U) సర్టిఫికెట్ జారీ చేసినట్లు టికెటింగ్ పోర్టల్‌లో దర్శనమిస్తోంది. అంటే ఎలాంటి ఏజ్ లిమిట్ కండీషన్లు లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కుటుంబ సమేతంగా థియేటర్లలో ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.

అంతేకాకుండా, బుక్‌మైషోలో లీకైన ఇన్ఫో ప్రకారం ఈ మూవీ లెంగ్త్ ఏకంగా 3 గంటల 15 నిమిషాలుగా పొందుపరిచారు. ఈ సమాచారం ఇంకా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఎంట్రీ కాకపోయినా, సాధారణంగా ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే వివరాలే ఆఖరి రన్‌టైమ్‌గా ఖరారవుతుంటాయని ట్రేడ్ వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి.

హిందువుల పవిత్ర ఇతిహాసమైన రామాయణ(Ramayana) గాథను ఏమాత్రం తొందరపడకుండా, ప్రతి సన్నివేశాన్ని కూడా ఎంతో సవివరంగా వెండితెరపై ఆవిష్కరించడానికి ఇంత సుదీర్ఘమైన రన్‌టైమ్ ఎంతో అవసరమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కేజీఎఫ్ స్టార్ యశ్ రావణాసురుడిగానూ, సౌత్ లేడీ పవర్ హౌస్ సాయి పల్లవి సీతాదేవిగా మెప్పించబోతున్న ఈ అద్భుత కాన్వాస్‌కు ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ , హన్స్ జిమ్మెర్ సంయుక్తంగా మ్యూజిక్‌ను అందిస్తున్నారు. అడుగడుగునా విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. దీపావళి కానుకగా నవంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి ఎంటర్ కాబోతోంది.

SBI Data Leak : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్..డార్క్ వెబ్‌లో డేటా లీక్

Related Articles

Back to top button