Anirudh : అనిరుధ్ , కావ్య పాప పెళ్లి ఫిక్స్?..కన్ఫమ్ చేసిన సీనియర్ యాక్టర్
Anirudh : డైరెక్టర్ అనిరుధ్ అందించే మ్యూజిక్‌కు కోలీవుడ్, టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో.. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో కావ్య పాప ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కు అంతకంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పొచ్చు.
Anirudh
సినీ ఇండస్ట్రీలోనూ, అటు క్రికెట్ ప్రపంచంలోనూ కొద్ది రోజులుగా ఒక క్రేజీ రూమర్ ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తోంది. యూత్ హాట్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
అయితే తాజాగా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తూ అఖండ 2 నటుడు, అనిరుధ్‌కు బంధువు అయిన సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరి రిలేషన్‌షిప్ , మ్యారేజ్ గురించిన అప్‌డేట్‌ను ఆయన ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకోవడంతో ఈ లవ్ స్టోరీపై చర్చ జోరుగా సాగుతోంది.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్(Anirudh) మ్యారేజ్ గురించి వై.జి. మహేంద్రన్ కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అనిరుధ్ చాలా మంచి వ్యక్తి అని, వృత్తిపరంగా ఎంతో సమర్థుడని మహేంద్రన్ చెప్పారు. అయితే ఏదొక విషయం అతన్ని వివాహం వైపు అడుగులు వేయకుండా ఇన్నాళ్లూ ఆపుతూ వచ్చిందన్న ఆయన.. కానీ త్వరలోనే ఆ అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయని తాను ఆశిస్తున్నానని అన్నారు.
తాను కూడా బయట విన్నదాన్ని బట్టే చెబుతున్నా అంటూ.. అనిరుధ్, కావ్య మారన్ మ్యారేజ్ మాత్రం గ్యారంటీగా జరుగుతుందని మహేంద్రన్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. వీరిద్దరి జోడి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుందన్న ఆయన..ఒకరికొకరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని ప్రశంసించారు.

కాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించే మ్యూజిక్‌కు కోలీవుడ్, టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో.. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో.. కావ్య మారన్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కు అంతకంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పొచ్చు.
ఇలాంటి సమయంలో వీరిద్దరూ అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వారి ఆప్తుల నుంచే హింట్ బయటకు రావడంతో అటు మూవీ లవర్స్, ఇటు ఐపీఎల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ చెబుతున్నారు. అలాగే ఈ క్రేజీ వెడ్డింగ్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.
Its Official Now.@anirudhofficial Going To Marry @sunpictures Kalanithi Maaran's Daughter #KaavyaMaaran & The Wedding Bells Soon.❤️pic.twitter.com/VFZmOJ1t1E
— CinemaXverse (@CinemaXverse) June 27, 2026
Sleep : నిద్రపోయే సమయం కాదు.. పడుకునే ముందు ఆ 30 నిమిషాలే ఇంపార్టెంట్ అట..





