Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss 10 : బిగ్‌బాస్ 10 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..హోస్ట్ ఎవరు? ఎప్పటి నుంచి సందడి చేయనుంది?

Bigg Boss 10 : బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ వచ్చే ఆగస్టు లాస్ట్ వీక్‌లో లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో కానీ గ్రాండ్‌గా లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి

Bigg Boss 10

బుల్లితెరపై సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ, రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు.. ఇపుడు సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది.

ఇప్పటివరకు విజయవంతంగా 9 సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ క్రేజీ షో, ఇప్పుడు గ్రాండ్‌గా 10వ(Bigg Boss 10) సీజన్‌లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది.

దీనిలో భాగంగా తాజాగా రిలీజైన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కొన్ని సీజన్లుగా తనదైన స్టైల్, మేనరిజమ్స్‌తో షోను నడిపిస్తున్న కింగ్ నాగార్జునే ఈ ప్రతిష్టాత్మక 10వ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు ఈ స్పెషల్ వీడియో ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఈ అప్‌డేట్‌తో బిగ్‌బాస్ లవర్స్‌లో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

తెలుగు బిగ్‌బాస్ హిస్టరీని ఒకసారి చూస్తే, మొదటి సీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయగా, మూడో సీజన్ నుంచి మాత్రం కింగ్ నాగార్జునే ఆ బాధ్యతలు తీసుకుని షోను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు.

బిగ్ బాస్ తెలుగు 10వ(Bigg Boss 10) సీజన్ వచ్చే ఆగస్టు లాస్ట్ వీక్‌లో లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో కానీ గ్రాండ్‌గా లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిసారి లాగే ఈసారి కూడా సెలబ్రెటీలతో పాటు సామాన్యులకు కూడా హౌస్‌లోకి వెళ్లే చాన్స్ కల్పిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పటికే టాక్ నడుస్తోంది.

అయితే ఈ ల్యాండ్ మార్క్ సీజన్‌లోకి అడుగుపెట్టబోయే ఆ లక్కీ కంటెస్టెంట్స్.. ఎవరు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.

ఈ సందర్భంగా ఇప్పటివరకు ముగిసిన 9 సీజన్లలో విజేతలుగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేసిన ఆ విన్నర్స్‌ను ఆడియన్స్ రివైండ్ చేసుకుంటున్నారు. మొదటి సీజన్‌లో తనదైన ఆటతీరుతో ఆడియన్స్ మనసు గెలుచుకున్న నటుడు శివ బాలాజీ విజేతగా నిలిచారు.

ఆ తర్వాత రెండో సీజన్‌లో కౌశల్ మండా కౌశల్..తన ఆర్మీ సపోర్ట్‌తో టైటిల్ గెలుచుకున్నారు. ఇక మూడో సీజన్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ను గెలుచుకోగా.. నాలుగో సీజన్‌లో కూల్ అండ్ కంపోజ్డ్‌గా ఆడిన అభిజీత్ విన్నర్స్‌గా నిలిచారు.

ఐదో సీజన్‌లో విజే సన్నీ తన మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కప్ కొట్టగా.. ఆరో సీజన్‌లో సింగర్ రేవంత్ ఎల్‌వీ టైటిల్ విన్నర్ అయ్యారు. ఇక ఏడో సీజన్‌లో రైతుబిడ్డగా అడుగుపెట్టిన యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

Bigg Boss 10
Bigg Boss 10

గతేడాది ముగిసిన ఎనిమిదో సీజన్‌లో సీరియల్ యాక్టర్ నిఖిల్ తన ఆటతీరుతో ట్రోఫీని కైవసం చేసుకోగా..ఇటీవల ముగిసిన తొమ్మిదో సీజన్‌లో కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి నయా రికార్డు సృష్టించారు.

ఈసారి రాబోయే 10వ సీజన్ మైలురాయి కాబట్టి టాస్కులు, హౌస్ థీమ్ ,ట్విస్టులు ఇప్పటి వరకూ జరిగిన బిగ్ బాస్‌ సీజన్ల కంటే ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సీజన్‌లో ఎవరెవరు వస్తారో.. అందులో ఎవరు ఆడియన్స్ మనసు గెలుచుకుని విన్నర్ అవుతారో చూడాలి.

Chepa Prasadam : చేప ప్రసాదం పంపిణీకి కౌంట్ డౌన్..మోసగాళ్లపై నిర్వాహకుల హెచ్చరిక

Related Articles

Back to top button