Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss 10 Mind Game : బిగ్ బాస్ 10 మైండ్ గేమ్‌ మొదలైంది.. బెడ్‌రూమ్ యాక్సెస్ కోసం రచ్చ..

Bigg Boss 10 Mind Game : తాళాలు గెలుచుకున్న 10 మంది మెంబర్స్‌ని స్టోర్ రూమ్‌కి పిలిచి పవర్ బాక్సులు ఓపెన్ చేయించాడు బిగ్ బాస్.

Bigg Boss 10 Mind Game

బుల్లితెరపై తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లో ఫస్ట్ డే నే ఊహించని ట్విస్టులు, పవర్ ప్యాక్డ్ డ్రామాలు ఆడియన్స్‌ను ఎడిక్ట్ చేయడానికి రెడీ అయిపోయాయి . హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మందికి బిగ్ బాస్ షాక్‌ల మీద షాక్‌లిస్తుంటే, ఇప్పుడు ఆ 10 స్పెషల్ పవర్స్ చుట్టూ అసలు ఆట మొత్తం తిరుగుతోంది.

మొదటిరోజు టాస్కుల్లో త్రిగుణ్, ఝాన్సీ, ఆటో రామ్ ప్రసాద్, వర్షిణి, షాలిని పటేల్, జబర్దస్త్ నరేష్, సృష్టి,నిహార్‌కు కీస్ దక్కగా.. మిగిలిన రెండు తాళాలు ఎవరికివ్వాలో వీళ్లే డిసైడ్ చేయాలంటూ బిగ్ బాస్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసేశాడు.

కీస్ గెలుచుకున్న టీమ్ మెంబర్స్ అంతా కలిసి డిస్కస్ చేసి మిగిలిన 2 పవర్ కీస్‌ను వంశీ, కృష్ణుడుకి ఇచ్చేశారు. దాంతో మాకెందుకు కీస్ ఇవ్వలేదంటూ మిగిలిన వాళ్లు రచ్చ లేపారు. ఇక్కడే బిగ్ బాస్ మొదటి బాంబ్ పేల్చాడు. పవర్ కీస్ దక్కిన ఆ 10 మంది కంటెస్టెంట్స్‌కు మాత్రమే బెడ్‌రూమ్‌లోకి ఎంట్రీ ఉంటుందని, మిగిలిన ఆరుగురు బయటే పడుకోవాలని చెప్పాడు.

కాగా దేబ్జానీకి కింగ్ నాగార్జున ఇచ్చిన 18 బ్యాడ్జీల బాక్స్ పట్టుకుని ఎవరికి ఏ బ్యాడ్జీ ఇవ్వాలా అని ఆమె తెగ ఆలోచించింది. మరోవైపు సుధీర్ రెడ్డి కాంబో సభ్యులంతా కలిసి త్రిగుణ్ హౌస్‌ని బాగా డామినేట్ చేస్తున్నాడంటూ అప్పుడే ముచ్చట్లు పెట్టారు.

సెప్టెంబర్ 7 వ తేదీ మార్నింగ్ బిగ్ బాస్ ఏషనాగుల మాస్ సాంగ్‌ ప్లే చేయడంతో కంటెస్టెంట్లు ఎనర్జిటిక్‌గా స్టెప్పులేశారు. రామ్ ప్రసాద్, దేబ్జానీ అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ పండించగా, దేబ్జానీ మైక్ బ్యాటరీ మార్చడం మర్చిపోయి బిగ్ బాస్‌ను కాకా పట్టే పనిలో పడింది.

తర్వాత నాగార్జున తనకు ఎంట్రీలో ఇచ్చిన సీక్రెట్ మిషన్ ప్రకారం ..బిగ్ బాస్ హౌస్‌లో దెయ్యం ఉందంటూ అందరినీ నమ్మించే పనిలో త్రిగుణ్ బిజీ అయిపోయాడు. సుధీర్ రెడ్డి మాత్రం సృష్టిని ఫ్లర్ట్ చేసే పనిని చాలా సీరియస్‌గా చేస్తున్నాడు . మరోవైపు రామ్ ప్రసాద్, నరేష్ నామినేషన్స్ ప్లాన్ల గురించి గుసగుసలాడుకున్నారు.

ఆ తర్వాత అసలైన సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టాడు బిగ్ బాస్. తాళాలు గెలుచుకున్న 10 మంది మెంబర్స్‌ని స్టోర్ రూమ్‌కి పిలిచి పవర్ బాక్సులు ఓపెన్ చేయించాడు . త్రిగుణ్‌కి వేరొకరి పవర్‌ను దొంగిలించి వెంటనే వాడే శక్తి రాగా, సింగర్ ఝాన్సీకి ఈ వారం ఎలిమినేషన్ నుంచి డైరెక్ట్‌గా సేవ్ అయ్యే పవర్ దక్కింది. నిహార్‌కి మాత్రం వాడేసిన పవర్‌ను మళ్లీ రీ-యాక్టివేట్ చేసే అవకాశం వచ్చింది. వర్షిణి బిగ్ బాస్‌ని సరదాగా ఫ్లర్ట్ చేస్తూ ..ఎవరైనా గెలిచిన టాస్క్ విజయాన్ని సొంతం చేసుకునే క్రేజీ పవర్‌నే కొట్టేసింది.

ఇక కృష్ణుడుకి ఎలిమినేషన్స్ తప్ప ఏ టైమ్‌లోనైనా ఇద్దరు ప్లేయర్ల ప్లేస్‌లను స్వాప్ చేసే పవర్ దక్కగా.. ఎవరికైనా నచ్చిన హౌస్ డ్యూటీ అసైన్ చేసే పవర్ షాలినికి దక్కాయి. అలాగే సృష్టికి ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేసేలా పవర్ ,ఆటో రామ్ ప్రసాద్‌కి నామినేషన్స్‌లో తనను కానీ లేదంటే తనకు నచ్చిన వారిని కానీ సేవ్ చేసే అవకాశం వచ్చింది.

అలాగే ఒక ప్లేయర్‌ను టూ వీక్స్ కెప్టెన్సీ రేస్ నుంచి తుడిచేసే పవర్ టెంపర్ వంశీకి దక్కగా, తన ఒక్క ఓటుకు రెండు ఓట్ల విలువ ఉండేలా బిగ్ పవర్ జబర్దస్త్ నరేష్‌కి లభించింది. కాకపోతే పవర్ వాడాలంటే బిగ్ బాస్‌ని అడిగి తాళం తీసుకోవాల్సిందేనని కండీషన్ పడింది.

Bigg Boss 10 Mind Game
Bigg Boss 10 Mind Game

ఆ తర్వాత నామినేషన్స్ చర్చలు ముగిసాక మహాపరీక్ష స్టార్ట్ అవుతుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దీనిలో గెలిచి అఫీషియల్ హౌస్‌మేట్స్ అవ్వాలంటే 2 టీమ్‌లుగా విడిపోవాలని, ఇద్దరు లీడర్లను సెలక్ట్ చేసుకోవాలని చెప్పాడు. దీని కోసం ఓటింగ్ పెట్టగా అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా .. రోహిత్‌ను లీడర్ చేశారు. మరో లీడర్ కోసం త్రిగుణ్, రామ్ ప్రసాద్ మధ్య పోటీ ఉండగా.. త్రిగుణ్ ఆ పొజిషన్‌ను రామ్ ప్రసాద్‌కిచ్చేశాడు.

అయితే అగ్నిపరీక్ష కంటెస్టెంట్లంతా గ్రూపిజమ్ చేసి రోహిత్‌ను లీడర్‌గా గెలిపించారంటూ త్రిగుణ్ పాయింట్ చేయడంతో హౌస్‌లో పెద్ద గొడవ జరిగింది. త్రిగుణ్ ఎంత లాజిక్‌గా మాట్లాడినా కూడా అగ్నిపరీక్ష టీమ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరికి బ్లూ టీమ్ రామ్ ప్రసాద్‌కి , రోహిత్‌కి రెడ్ టీమ్ అని కేటాయించాడు బిగ్ బాస్ . మరి ఈ కలర్‌ఫుల్ ఫైట్‌లో ఎవరు ఎవరి టీమ్‌లోకి వెళ్లారు.. మహాపరీక్షలో ఎవరు గెలిచారో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాలి.

Brain Problems : మెదడులోని ఒక్క స్విచ్ నొక్కితే చాలు..అల్జీమర్స్, హంటింగ్టన్ వ్యాధులకు బ్రేక్ వేయొచ్చట..

Related Articles

Back to top button