Just SportsLatest News

Rajasthan Royals : గెలిస్తేనే నిలిచేది..లక్నోతో రాజస్థాన్ డూ ఆర్ డై

Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్ మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది

Rajasthan Royals

ఐపీఎల్ 19వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్ధమైంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆ జట్టు మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ప్లే ఆఫ్ రేసులో వెనుకబడిన రాజస్థాన్ మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ గెలిస్తేనే ముందంజ వేస్తుంది. ఒక మ్యాచ్ ఓడినా మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఆ జట్టు 12 మ్యాచ్ లలో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. సీజన్ ఆరంభంలో అదరగొట్టిన రాజస్థాన్(Rajasthan Royals) సెకండాఫ్ లో మాత్రం తడబడుతోంది. వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గత మ్యాచ్ లో మంచి స్కోరే చేసినా ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది. ఢిల్లీ చేతిలో ఇంటా బయటా రెండు చోట్ల పరాజయం పాలైంది.

బ్యాటింగ్ లో వైభవ్ సూర్యవంశీ , జైస్వాల్ మెరుపు ఆరంభాలనిస్తున్నారు. జురెల్, రియాన్ పరాగ్ కూడా ఫామ్ లోకి వచ్చారు. ఢిల్లీపై పరాగ్ విధ్వంసం సృష్టించినా మిగిలిన బ్యాటర్ల వైఫల్యం కొంపముంచింది. దీంతో అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. జడేజా, ఫెర్రీరా చివర్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోతుండడం ఇబ్బందిగా మారింది.

బౌలింగ్ లో మాత్రం రాజస్థాన్ మెరుగవ్వాల్సిందే. జోఫ్రా ఆర్చర్ రాణిస్తున్నా మిగిలిన బౌలర్లు మాత్రం తేలిపోతున్నారు. ఆడమ్ మిల్నే, శనక గత మ్యాచ్ లో నిరాశపరిచారు. బ్రిజేశ్ శర్మ వికెట్లు తీస్తున్నా పరుగులు ఇచ్చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. యశ్ రాజ్ పుంజా అంచనాలున్నాయి.

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయింది. 12 మ్యాచ్ లలో కేవలం నాలుగింటిలోనే గెలిచిన లక్నోకు గత మ్యాచ్ లో చెన్నైని ఓడించడం కాన్ఫిడెన్స్ పెంచింది. మిఛెల్ మార్ష్ సూపర్ ఫామ్ తో దూసుకెళుతుంటే జోష్ ఇంగ్లీస్, నికోలస్ పూరన్ కూడా టచ్ లోకి వచ్చారు. అయితే రిషబ్ పంత్ మాత్రం నిరాశపరుస్తూనే ఉన్నాడు.

Rajasthan Royals
Rajasthan Royals

కెప్టెన్ గానూ, ఆటగాడిగానూ విఫలమవుతున్న పంత్ ను సీజన్ చివరి రెండు మ్యాచ్ లలోనైనా రాణిస్తాడేమో చూడాలి. లక్నో బ్యాటింగ్ లో మార్క్ రమ్, ముకుల్ చౌదరి, అబ్దుల్ సమద్ వంటి యువ ఆటగాళ్లు కూడా ఆకట్టుకుంటున్నారు. కీలక మ్యాచ్ లలో బ్యాటర్లు ఆడలేకపోతుండడంతోనే వరుస పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అటు బౌలింగ్ లో షాబాజ్ అహ్మద్, షమీ, దిగ్వేశ్ , ఆకాశ్ సింగ్ తో పాటు ప్రిన్స్ యాదవ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత రికార్డుల విషయానికొస్తే రాజస్థాన్ దే పైచేయిగా ఉంది. జైపూర్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా.

Peddi Trailer : ఆట మారుతోంది..ఆటగాడు మారట్లే..గూస్ బంప్స్ తెప్పిస్తోన్న పెద్ది ట్రైలర్

Related Articles

Back to top button