Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss 10 Telugu Day 20 : బిగ్ బాస్ హౌస్‌లో నాగ్ మాస్ వార్నింగ్..రూ.15 లక్షల సూట్‌కేస్‌తో బిగ్ ట్విస్ట్

Bigg Boss 10 Telugu Day 20 : ఎపిసోడ్ చివర్లో నాగార్జున రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ తెచ్చి బిగ్ బాస్ హౌస్‌లో బడా బాంబ్ పేల్చారు.

Bigg Boss 10 Telugu Day 20

వీకెండ్ వచ్చిందంటేనే నాగార్జున ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌ ఓ రేంజ్‌లో హీటెక్కుతుంది. అనుకున్నట్టుగానే శనివారం నైట్ హౌస్‌లో మాస్ డ్రామా నడిచింది. కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి.. ప్రతీ ఒక్కరి ముసుగులను తీసి పక్కన పడేశారు. ముఖ్యంగా సుధీర్‌పై సృష్టి ఆడిన ఎమోషనల్ డ్రామాను సింగిల్ వీడియోతో బట్టబయలు చేయడం అలాగే, రోహిత్ డబుల్ గేమ్‌ను ఎండగట్టడం హైలైట్‌గా నిలిచాయ.

ఎపిసోడ్(Bigg Boss 10 Telugu Day 20) స్టార్టింగ్‌ అంతా సరదా ముచ్చట్లు నడిచాయి. ముకేశ్ కెప్టెన్ అవ్వడంతో తనకు మెడల్ ఇచ్చారు. అయితే హౌస్‌లోకి వచ్చిన న్యూ కంటెస్టెంట్ మిథిలేష్ తన బ్యాచ్‌తో కూర్చొని ముకేశ్ అసలు స్టార్ ప్లేయరే కాదంటూ కామెంట్లు చేయగా.. రోహిత్ దానికి ఊకొట్టాడు. ఇటు దేబ్జానీ అడగ్గానే మిథిలేష్, రామ్ ప్రసాద్, నరేష్ షర్టులు తీసి కామెడీ చేయడం, అందరూ తమ లవ్ స్టోరీలు చెప్పుకుంటూ కాసేపు రిలాక్స్ అవడం వీకెండ్ ఎపిసోడ్‌కు జోష్ ఇచ్చింది.

తర్వాత కింగ్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాక.. సృష్టిని కన్ఫెషన్ రూమ్‌కు పిలిచారు. సుధీర్ నెత్తిపై చెత్త వేసి నువ్వు చేసిన పని బాగోలేదంటూ గట్టిగా నిలదీశారు. పాత బ్రేకప్ బాధల వల్ల ఇలా చేశానని సృష్టి చెప్పడంతో.. సుధీర్, సృష్టి మాట్లాడుకున్న వీడియో ప్లే చేసి చూపించారు. నామినేషన్స్ కోసం సృష్టి పక్కా ప్లాన్‌తో సుధీర్‌పై రివెంజ్ తీర్చుకుందని నాగ్ తేల్చేశారు.

తర్వాత సుధీర్‌ను కన్ఫెషన్ రూమ్‌కు పిలవగా.. రోహిత్, త్రిగుణ్ సృష్టిని మ్యానిప్యులేట్ చేసి తనపైకి రెచ్చగొట్టారని సుధీర్ చెప్పాడు. నాగ్ రియాక్ట్ అవుతూ.. వాళ్ల వెధవ రాజకీయాల్లో నువ్వు బలి కావొద్దని సుధీర్‌కు సపోర్ట్ చేశారు.

తర్వాత వన్ బై వన్ మిగిలిన వారికి మాస్ క్లాస్ పీకిన నాగ్ ముందుగా.. దేబ్జానీ నరేష్‌ను పొట్టోడు అని అనడంతో దేబ్జానీతో సారీ చెప్పించారు. వర్షిణి ఆడిన ఆటలో వుమెన్ కార్డ్ వాడిందని నాగ్ ఫైర్ అయ్యారు. బిగ్ బాస్‌ హౌస్‌లో జెండర్ తేడాలుండవని క్లారిటీ ఇచ్చారు.

Bigg Boss 10 Telugu Day 20
Bigg Boss 10 Telugu Day 20

రోహిత్ ఒక దగ్గర మాటలు ఇంకొకరికి చెప్తూ డబుల్ గేమ్ ఆడుతున్నాడని వీడియోలతో సహా చూపించారు. షాలిని కూడా ముందొకలా వెనుక మరోలా మాట్లాడుతోందని ఆమెకు బిచింగ్ స్టార్ అనే టాగ్ ఇచ్చేశారు. కాగా నామినేషన్లలో ఉన్నవారిలో సుధీర్, షాలిని సేవ్ అయ్యారు.

ఎపిసోడ్ మధ్యలో సందీప్ కిషన్, జేసన్ సంజయ్ తమ సిగ్మా మూవీ ప్రమోషన్ల కోసం వచ్చారు. ఇక చివర్లో నాగార్జున రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ తెచ్చి బిగ్ బాస్ హౌస్‌లో బడా బాంబ్ పేల్చారు. ఆ ఆఫర్‌కు మిథిలేష్ ఓకే చెప్పి, మిగిలినవారిని ఒప్పించి బయటకు వెళ్లడానికి రెడీ అయ్యాడు. మరి మిథిలేష్ రూ.15 లక్షలు తీసుకుని నిజంగానే జంప్ అయ్యాడా లేదా అన్నది సండే ఎపిసోడ్‌లో(Bigg Boss 10 Telugu Day 20) తేలిపోతుంది.

Relationship Secrets : ప్రేమ ఉంటే సరిపోదా? గోల్స్ డిఫరెంట్‌గా ఉంటే రిలేషన్‌షిప్ సక్సెస్ అవడం కష్టమా?

Related Articles

Back to top button