Bigg Boss 10 Telugu Day 21 : బిగ్ బాస్‌లో భారీ డ్రామా..కెప్టెన్సీ బలి ఇచ్చి ఇద్దరిని సేవ్ చేసిన ముకేశ్..
Bigg Boss 10 Telugu Day 21 : ముకేశ్ కెప్టెన్సీని, ఇమ్యూనిటీని వదులుకుని, నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్తేనే వంశీ, వర్షిణి ఇద్దరూ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారని నాగ్ కండీషన్ విధించారు.
Bigg Boss 10 Telugu Day 21
మరోసారి ఊహించని డ్రామాలు, హౌస్ మేట్స్ గొడవలు, అంతకు మించిన మైండ్ గేమ్‌లతో బిగ్ బాస్ హౌస్ ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. వైల్డ్ కార్డు ఎంట్రీతో అడుగుపెట్టిన మిథిలేష్ ఒక్క రోజులోనే నాగార్జున ఆఫర్ చేసిన రూ.15 లక్షల క్యాష్ ప్రైజ్ తీసుకుని బయటకు వచ్చేయడంతో బిగ్ బాస్(Bigg Boss 10 Telugu Day 21) ఇంట్లో చిన్నపాటి తుపాను రేగింది.
అసలు రన్నర్ లేదంటే విన్నర్ ప్రైజ్ మనీని ఒక్కరోజు ఉన్న మిథిలేష్‌కు ఎందుకు ఇవ్వాలంటూ ముకేశ్, వంశీ, త్రిగుణ్, దేబ్జానీ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ముకేశ్, త్రిగుణ్ రామ్ ప్రసాద్‌పై విరుచుకుపడగా, రోహిత మాత్రం తన అగ్నిపరీక్ష టీమ్‌కి సపోర్ట్‌గా మిథిలేష్‌ను వెనకేసుకొచ్చాడు.
అమన్, రామ్ ప్రసాద్ మిథిలేష్‌కు సపోర్ట్ చేయడంతో.. త్రిగుణ్ సిగ్గు, శరం లేదనే భారీ డైలాగ్‌లు వాడటంతో వాతావరణం మరింత హీటెక్కింది. చివరకు అమన్, త్రిగుణ్ ఏకంగా కొట్టుకునేంత రేంజ్‌కి వెళ్లిపోయారు.
రూ. 15 లక్షలతో స్టేజీపైకి వచ్చిన మిథిలేష్‌తో కింగ్ నాగార్జున మాట్లాడిస్తూ, హౌస్‌లోని ఐదుగురికి ఎవరి గురించి జాగ్రత్తగా ఉండాలో చెప్పాలన్నారు. దీంతో అమన్ రోహిత్‌తో, వర్షిణి ముకేశ్‌తో, వంశీ త్రిగుణ్‌తో, నరేష్ రామ్ ప్రసాద్‌తో, చరణ్ షాలినితో జాగ్రత్తగా ఉండాలని చెబుతూ అలర్ట్ చేశాడు.
తర్వాత నామినేషన్స్‌లో ఉన్న వారిలో ఝాన్సీ సేవ్ అయినట్లు చెప్పిన నాగార్జున.. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌కు జంగిల్ గేమ్ టాస్క్ ఇచ్చారు. దానిలో ఒక్కో యానిమల్ బొమ్మ ఉన్న మెడల్‌కు ఒక్కో క్వాలిటీని కేటాయించి, అది ఎవరికి సెట్ అవుతుందో రీజన్ చెప్పి ఇవ్వాలని అన్నారు.
ఈ జంగిల్ టాస్క్‌లో ఇంటి సభ్యులంతా ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. డెసిషన్ మేకింగ్ లేదంటూ అమన్‌కు ముకేశ్ ప్యారెట్ మెడల్ ఇవ్వగా, షాలిని ఓవర్ యాక్షన్ చేస్తోందని ఆమెకు రామ్ ప్రసాద్ నెమలి మెడల్ ఇచ్చాడు. పాత గొడవలను మనసులో పెట్టుకుని అపూర్వకు షాలిని స్నేక్ మెడల్ ఇవ్వడంతో.. నాగార్జున షాలినికి గట్టిగానే క్లాస్ పీకారు.
దేబ్జానీకి నరేష్ పాండా మెడల్, త్రిగుణ్ కన్నింగ్ అండ్ పాయిజనెస్ అంటూ అపూర్వ, రోహిత్ వరుసగా పాము, నక్క మెడల్స్ ఇచ్చారు. అయితే త్రిగుణ్‌ను తిట్టినందుకు రోహిత్‌పై నాగ్ సీరియస్ అయ్యారు. ఇబ్బంది పెడతాడని వంశీ త్రిగుణ్‌కు కోతి మెడల్, పని చేయట్లేదని రోహిత్‌కు ఝాన్సీ పాండా మెడల్, ఫియర్లెస్ అంటూ ముకేశ్‌కు వర్షిణి, సుధీర్ సింహం మెడల్ ఇచ్చారు.
ముకేశ్‌ను బ్లైండ్‌గా ఫాలో అవుతోందని వర్షిణికి చరణ్ ప్యారెట్ మెడల్, ఇబ్బందిగా ఉన్నారని అపూర్వ, షాలినికి వరుసగా సృష్టి, దేబ్జానీ కోతి మెడల్స్ ఇచ్చారు. అలాగే వంశీకి త్రిగుణ్ నెమలి మెడల్, ముకేశ్ కన్నింగ్ అంటూ అమన్ నక్క మెడల్ తొడిగారు.
దీని తర్వాత ముకేశ్ బాత్రూమ్ సీన్‌ను నాగార్జున గుర్తుచేసి నవ్వులు పూయించారు. ఆ తర్వాత డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చిన.. ఫహద్ ఫాజిల్, సారా, కార్తికేయ సందడి చేశారు. వాళ్లు కాసేపు కంటెస్టెంట్లతో ఆటలు ఆడించి డ్యాన్సులు చేయించారు.
వాళ్లు వెళ్లిన తర్వాత నామినేషన్స్‌లోని త్రిగుణ్ సేవ్ అయినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో రోహిత్‌కు మేనల్లుడు పుట్టాడనే శుభవార్త చెబుతూ.. బాబు ఫోటోను నాగ్ స్క్రీన్‌పై చూపించడంతో అతను బాగా ఎమోషనల్ అయ్యాడు.

(Bigg Boss 10 Telugu Day 21)ఎపిసోడ్ చివరిలో నామినేషన్స్‌లో వంశీ, వర్షిణి మిగలగా.. అక్కడ బిగ్ ట్విస్ట్ పడింది. కెప్టెన్ ముకేశ్‌కు .. తన కెప్టెన్సీని, ఇమ్యూనిటీని వదులుకుని, నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్తేనే వంశీ, వర్షిణి ఇద్దరూ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారని నాగ్ కండీషన్ విధించారు.
ముకేశ్ ఏ మాత్రం ఆలోచించకుండా ఆ కండీషన్‌కు ఒప్పుకుని వాళ్లిద్దరినీ సేవ్ చేశాడు. దీంతో ముకేశ్ నుంచి కెప్టెన్సీని తీసుకుని, టాస్క్ గెలిచిన అపూర్వకు దీనిని ఇచ్చారు. దీంతో హౌస్‌లోకి(Bigg Boss 10 Telugu Day 21) వచ్చిన కేవలం 2 రోజుల్లోనే కెప్టెన్ అయి అపూర్వ కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది.
Secretariat Employees Protest : రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు..విజయవాడ ధర్నా చౌక్‌లో రణరంగం..





