Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss Captain Task : ఎలిమినేట్ అయిన ప్లేయర్ రీ-ఎంట్రీ.. కెప్టెన్ రేసులో ఊహించని ట్విస్టులు

Bigg Boss Captain Task : హౌస్‌లో ఫస్ట్ వీక్‌లోనే ఊహించని విధంగా ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన చరణ్... మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చాడు.

Bigg Boss Captain Task

బిగ్ బాస్ హౌస్ అంటేనే అక్కడ ఎప్పుడు ఏ ట్విస్ట్ ఎదురవుతుందో ఎవరూ ఊహించలేరు. కెప్టెన్సీ రేసులో కంటెస్టెంట్స్ కొట్టుకుంటున్న సమయంలో..ముందు ఎపిసోడ్‌లో రేసులో నిలిచిన దేబ్జానీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్, ముకేశ్, ఝాన్సీ, షాలిని మధ్య అసలు సిసలు ఫైట్ స్టార్ట్ అయింది.

అయితే వీరందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా బిగ్ బాస్ వేసిన ఒకే ఒక్క రీఎంట్రీ స్కెచ్.. హౌస్‌లోని పాత కక్షలను, గ్రూపిజం లొల్లి అన్నిటినీ మళ్లీ ఒక్కసారిగా బయటకు తీసుకువచ్చింది. కెప్టెన్సీ పీఠం కోసం జరిగిన టాస్కులు, గొడవలు , ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయిన చరణ్ రీ-ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ అందరినీ బాగా ఎంటర్‌టైన్ చేస్తోందన్న టాక్ తెచ్చుకుంది.

ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ముందు రోజు గేమ్ ఆడకుండా చేతులెత్తేసిన రోహిత్, త్రిగుణ్‌ టీమ్‌ను కాకా పట్టి ఎలాగోలా ఛాన్స్ దక్కించుకున్నానని తన రీజన్స్ బయటపెట్టాడు. ఇంకోవైపు హౌస్‌లో డైలీ జరిగే ఫుడ్ లొల్లి ఈరోజు కూడా కంటిన్యూ అవ్వడంతో తట్టుకోలేక వర్షిణి మళ్లీ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ముకేశ్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. దేబ్జానీ కూడా తన సెంటిమెంట్ ఏడుపును రిపీట్ చేసింది.

తర్వాత కెప్టెన్సీ రేసులో ఉన్న దేబ్జానీ, త్రిగుణ్‌, రామ్ ప్రసాద్‌కు బిగ్ బాస్ ఒక క్రిటికల్ ఫిజికల్ టాస్క్ (Physical Task )ఇచ్చాడు. దీనిలో దేబ్జానీ తన సర్వశక్తులూ ఒడ్డి రఫ్ ఆడించినా.. అల్టిమేట్‌గా త్రిగుణ్, రోహిత్ జోడీ గెలిచారు. అయితే ఈ టాస్క్ ముగిశాక షాలిని, రోహిత్ మధ్య ఒక హాట్ డిస్కషన్ నడిచింది. రోహిత్ ఎదుటివారు అంటే మాత్రం అస్సలు ఓర్చుకోడని, త్వరలోనే అతడితో పెద్ద గొడవ అవుతుందని షాలిని ఓపెన్‌గానే వార్నింగ్ ఇచ్చింది.

ఇక హౌస్‌లో ఫస్ట్ వీక్‌లోనే ఊహించని విధంగా ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన చరణ్… మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చాడు. చరణ్‌ను చూడగానే అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా ఎగిరి గంతేసి అతన్ని హగ్ చేసుకుంటే..రోహిత్ ముఖంలో మాత్రం విపరీతమైన కలవరం, డిజప్పాయింట్మెంట్ కనిపించాయి.

చరణ్ తనను ఎక్కడ విలన్‌లా ప్రొజెక్ట్ చేస్తాడో అనే థాట్‌తో వెంటనే అలర్ట్ అయిన రోహిత్..నన్ను నెగిటివ్‌గా చూస్తున్నావా? నేను నిన్ను మోసం చేశానని అనుకుంటున్నావా అంటూ ముందే కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత రామ్ ప్రసాద్, నరేష్ హౌస్‌మేట్స్‌ను ఇమిటేట్ చేస్తూ కాసేపు హౌస్‌లో నవ్వులు పూయించారు.

అయితే కెప్టెన్సీ రేసులోనున్న ఐదుగురిలో అర్హత లేని ఒకరిని నేరుగా తప్పించడం, లేదా వారిలో ఒకరిని ఛాలెంజ్ చేసి గేమ్ ఆడి ఓడించి ఆ రేసులోకి తను వెళ్లాలని చరణ్‌కు బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో చరణ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా త్రిగుణ్‌ను టార్గెట్ చేసి..తను కెప్టెన్ అవ్వడం సరైనది కాదని, అందుకే అతడిని ఆడి ఓడిస్తానని సవాల్ విసిరాడు.

Bigg Boss Captain Task
Bigg Boss Captain Task

దీంతో వీరిద్దరికీ ఫోర్ కలర్స్ టైల్స్‌తో ఒక కలర్‌ఫుల్ వే వేసుకుంటూ వెళ్లి బోర్డును దక్కించుకునే మైండ్ అండ్ స్పీడ్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. రామ్ ప్రసాద్‌ను సంచాలక్‌గా పెట్టాడు. ఈ గేమ్‌లోని కొత్త రూల్స్ వల్ల సంచాలక్‌తో సహా అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. చరణ్ చాలా తెలివిగా స్మార్ట్ గేమ్ ఆడినా, త్రిగుణ్ తెలివిగా గెలిచి తన కెప్టెన్సీ కంటెండర్ ప్లేస్‌ను కాపాడుకున్నాడు.

రీ-ఎంట్రీ ఇచ్చిన చరణ్ త్రిగుణ్ చేతిలో బోల్తా పడి తన మొదటి ఛాన్స్‌ను మిస్ చేసుకున్నా కూడా.. హౌస్‌లో రోహిత్ మైండ్ గేమ్‌కు మాత్రం గట్టిగానే చెక్ పెట్టేలా కనిపిస్తున్నాడు. కాగా ఈ ఐదుగురిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ ఫస్ట్ కెప్టెన్(Bigg Boss Captain Task )అవుతారో చూడాలి మరి.

Bloating On The Flight : ఫ్లైట్ ఎక్కగానే పొట్ట ఉబ్బుతోందా? జర్నీలో కడుపు తేలికగా ఉండాలంటే ఇవి ఫాలో అవ్వండి..

Related Articles

Back to top button