Bigg Boss Nominations
ది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఇప్పుడు ఎవరి ఊహకు అందని మలుపులతో ఆరో వారంలోకి అడుగుపెట్టింది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున తీసుకునే క్లాసులు ఒక ఎత్తు అయితే, సోమవారం హౌస్‌లో జరిగే నామినేషన్ల(Bigg Boss Nominations) పర్వం మరో ఎత్తు అన్నట్లుగా అసలైన మంటలను రాజేస్తుంది.
ఈసారి నామినేషన్లను(Bigg Boss Nominations) మరింత రంజుగా మార్చడానికి బిగ్‌బాస్ మరో కొత్త ప్లాన్ వేశాడు. హౌస్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్లకు నామినేషన్ ప్రాసెస్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన పవర్‌ను అప్పగించాడు. ప్రతీ రౌండ్ స్టార్టయ్యే ముందు ఒక సైరన్ మోగిన తర్వాత వైల్డ్ ఫైర్స్ ఇద్దరు ఓజీ కంటెస్టెంట్లను బరిలోకి దింపాలి.
ఆ ఇద్దరి మధ్య జరిగే టాస్క్‌లో గెలిచినవారికి.. ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెబుతాడు. అక్కడితో అయిపోలేదు గెలిచినవాళ్లు చెప్పిన రీజన్స్, నామినేట్ అయిన వాళ్ల వాదనలు వైల్డ్ ఫైర్స్ విని.. వారిలో కేవలం ఒకరి నామినేషన్‌ను మాత్రమే ఫైనల్ చేయాల్సి రావడం ఈ వీక్ గేమ్ రూల్‌గా మారింది.
ముందుగా రంగంలోకి దిగిన శివ.. ఓజీ కంటెస్టెంట్లుగా త్రిగుణ్, రోహిత్‌ను సెలెక్ట్ చేయగా, వీరిద్దరి మధ్య జరిగిన గేమ్‌లో రోహిత్ విజేతగా నిలిచాడు. ఇక నామినేషన్ ఛాన్స్ చేతికి రావడంతో రోహిత్ .. ముందుగా వంశీని టార్గెట్ చేశాడు. ఎదుటి మనుషులకు మీరు గౌరవం ఇవ్వాలని అంటుంటారు కదా, కానీ ముందు మీరు ఆ పద్ధతి పాటించి అందరికీ చెబితే బాగుంటుందని కౌంటర్ ఇస్తూ నామినేట్ చేశాడు. దీంతో వంశీకి రోహిత్‌కు మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది.
ఆ తర్వాత రోహిత్ తన రెండో నామినేషన్‌గా ఝాన్సీ పేరును తెరపైకి తెచ్చాడు. ప్రజల మీద మీకంత నమ్మకం ఉన్నప్పుడు, ఆ ఎవిక్షన్ ప్రీ పాస్‌ను మీ స్వార్థానికి, మీకు అనుకూలంగా ఎలా వాడుకుంటారని.. మీరు మాట్లాడే మాటలకు, చేతలకు పొంతన లేని విధంగా ఉందన్నాడు. రెండు వైపుల వాదనలు విన్న వైల్డ్ ఫైర్ శివ ఫైనల్ డెసిషన్‌గా వంశీ నామినేషన్‌ను ఆమోదించాడు.
తర్వాత శ్వేతా నాయుడు వంతు రాగా.. ముకేష్, అమన్‌ను సెలెక్ట్ చేసింది. ఈ టాస్క్‌లో ముకేష్ విజయం సాధించి నామినేట్ చేసే పవర్ దక్కించుకున్నాడు. ముందుగా అమన్‌ను నామినేట్ చేసిన ముకేష్.. నువ్వు మళ్లీ పాత ఫౌల్ లాంగ్వేజ్‌నే వాడుతున్నావని చెబుతూ నామినేట్ చేశాడు. దీంతో బిగ్ బాస్ ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కిపోయింది.
ఇద్దరి మధ్య ఫైర్ అవుతుండగా మధ్యలోకి త్రిగుణ్ ఎంట్రీ ఇవ్వడంతో గొడవ కాస్తా పెద్ద రచ్చగా మారింది. నువ్వు ఎవడివా రా నాకు చెప్పేది అనడంతో.. నువ్వు రా అంటే రా అంటా, బే అంటే బే అంటా అంటూ అమన్ మరోసారి రెచ్చిపోయాడు. చివరికి మిగిలిన హౌస్‌మేట్స్ కలుగజేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పాల్సి వచ్చింది.
ఆ తర్వాత ముకేష్ తన రెండో నామినేషన్‌గా షాలిని పేరును చెబుతూ.. గేమ్‌లో బాగానే ఎఫర్ట్ పెడుతున్నా కానీ, ఆటలో ఇంకాస్త ఇన్వాల్‌మెంట్ చూపించాలని చెప్పాడు . వీరిద్దరిలో శ్వేతా నాయుడు మాత్రం అమన్ నామినేషన్‌ను(Bigg Boss Nominations) ఓకే చేసింది.
ఇక మూడో రౌండ్‌లో నీతూ నటరాజ్ ఎంట్రీ ఇచ్చి షాలిని, వర్షిణిని బరిలో దించగా, ఈ గేమ్‌లో షాలిని గెలిచింది. గెలిచిన జోష్‌లో షాలిని.. దేబ్జానీని నామినేట్ చేస్తూ..మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉందని అర్థమైంది, కానీ మీరు కేవలం మీ స్వార్థం కోసమే ఆడుతున్నారని చెప్పింది.
నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడటం వల్ల, నేను చాలా లోగా ఫీల్ అయిపోయానని చెబుతూ షాలిని ఫైర్ అయింది. దీంతో షాలినికి దేబ్జానీకి మధ్య కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇలా ఒకరిని మించి ఒకరు హద్దులు దాటి మరీ విసురుకున్న విమర్శలు, మాటలతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. వైల్డ్ ఫైర్ల ఎంట్రీతో హౌస్ మేట్స్ మధ్య అసలు సిసలు క్యారెక్టర్లు బయటపడుతున్నాయి.
Keyboard Letters : కీబోర్డులో అక్షరాల వెనుక ఇంత కథ ఉందా? 150 ఏళ్ల మైండ్ బ్లాకింగ్ సీక్రెట్ తెలుసా?
