Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss Task : బిగ్ బాస్ బిగ్గెస్ట్ మాస్టర్ మైండ్ ట్విస్ట్.. గోట్ ఆఫ్ ఎండ్యురెన్స్ టాస్క్‌లో హైడ్రామా..

Bigg Boss Task : బిగ్ బాస్ హౌస్‌లో గురువారం రోజు జరిగిన ఎపిసోడ్ రచ్చ రంబోలాగా నడిచింది . ఎల్లో జోన్ నుంచి గ్రీన్ జోన్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి బిగ్ బాస్ పెట్టిన 'గోట్ ఆఫ్ ఎండ్యురెన్స్' టాస్క్ హౌస్‌లో మంటలు పుట్టించింది. కంటెస్టెంట్లు గ్రూపులుగా విడిపోయి ఆడిన సేఫ్ గేమ్‌కు బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

Bigg Boss Task

బిగ్ బాస్ హౌస్‌లో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు . గురువారం అక్టోబర్ 22 రోజు జరిగిన ఎపిసోడ్‌లో ఎల్లో జోన్‌లో ఉన్న మెంబర్లను గ్రీన్ జోన్‌లోకి పంపడానికి పెట్టిన ‘గోట్ ఆఫ్ ఎండ్యురెన్స్’ టాస్క్ (Bigg Boss Task)నెక్స్ట్ లెవెల్ రచ్చ లేపింది. సంచాలక్‌గా శ్వేతను పెట్టి స్టార్ట్ చేసిన ఈ ఆటలో రెడ్ టీమ్ మెంబర్లు చెప్పినట్టుగా.. ఎల్లో టీమ్ వారికి బరువైన వెయిట్స్ తగిలించాలి. ఈ టార్చరెంట్ గేమ్‌లో లాస్ట్ వరకు నిలబడిన వాళ్లకు ‘గోట్’ (జీవోటీ) బిరుదుతో పాటు 2వీక్స్‌కు ఇమ్యూనిటీ దక్కుతుందని బిగ్ బాస్ ప్రకటించడంతో ఆట మరింత వేడెక్కింది.

ముందుగా శ్వేత తన పవర్‌తో ఆర్కేని సెలెక్ట్ చేయగా, బిగ్ బాస్ ఇచ్చిన ఆర్డర్‌తో అంతా కలిసి వర్షిణి మీదే ఎక్కువ వెయిట్స్ వేసి టార్గెట్ చేయడంతో..వెయిట్ మోయలేక వర్షిణి కళ్లు తిరిగి పడిపోయింది. ఆ తర్వాత శివ్ ఏకంగా 32 కిలోల వెయిట్‌ను మోసి అందరి కంట్లో నలుసయ్యాడు.

ముకేష్, రోహిత్ గ్యాంగ్ అయితే ప్లాన్ ప్రకారం శివ్, త్రిగుణ్‌ మీద ఫుల్ ఫోకస్ పెట్టి వాళ్లను గేమ్ నుంచి తరిమేసేలా చేశారు. త్రిగుణ్ కూడా ఎక్కువ వెయిట్స్ మోసినా కూడా విసిగిపోయి చివరకు గేమ్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ముకేష్‌ను టార్గెట్ చేయడం, మళ్లీ అంతా కలిసి అమన్‌ను ముంచేయాలని చూడటం గేమ్‌కు హైలైట్‌గా నిలిచాయి.

అమన్, రాంప్రసాద్, ముకేష్ మిగిలిన టైమ్‌లో వంశీ, శ్వేత కలిసి వెయిట్స్ బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. రాంప్రసాద్ కూడా వెళ్లిపోవడంతో ఫైనల్‌గా అమన్, నరేష్ మాత్రమే మిగిలారు. అయితే అంతా కలిసి కావాలనే అమన్‌ను టార్గెట్ చేసి విపరీతమైన వెయిట్స్ వేస్తే, నరేష్‌కు మాత్రం తక్కువ వెయిట్స్‌తో సేఫ్ గేమ్‌ ఆడేలా సెట్ చేశారు.

ఎవరి సపోర్ట్ లేకుండా తన ఒక్కడి మీదే అంతా కక్ష కట్టినట్లు బరువు వేశారని అమన్ తెగ ఫీలయ్యాడు. ఇదే టైమ్‌లో శివ్‌ను పర్సనల్‌గా టార్గెట్ చేసిన ముకేష్.. బయట నీ స్టోరీస్ అన్నీ నాకు తెలుసు, లవర్ బాయ్ లా బిల్డప్ ఇవ్వకు అని అనడంతో శివ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇక అందరూ కలిసి నరేష్‌ను ఈజీగా గెలిపించడానికి ఒక పక్కా ప్లాన్ వేసుకుని సేఫ్ గేమ్ ఆడిన వారికి ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్. ఎవరైతే తెలివిగా ఎవరికీ వెయిట్స్ పడకుండా సేఫ్ గేమ్ ఆడి నరేష్‌ను గెలిపించాలనుకున్నారో, ఆ ప్లాన్‌ను బిగ్ బాస్ ఒక్క మాటతో క్రాష్ చేశాడు. అసలు వెయిట్ లేని ఎండ్యురెన్స్ గేమ్‌కు వాల్యూ లేదని, చివరి వరకు ఉండి నరేష్ ఒక్కడే ‘గోట్’ కాలేడని షాకిచ్చాడు.

ఈ గేమ్‌లో నిజంగా ఎక్కువ వెయిట్స్ మోసి నరకం చూసిన అమన్, అలాగే ఎక్కువ బరువు భరించిన లేడీ కంటెస్టెంట్ నీతూ, చివరి వరకు పోరాడిన దేబ్జానీ అసలైన ‘గోట్స్’ అని బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ ముగ్గురూ వచ్చే వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అవుతారని చెప్పడంతో వారి ఫేసుల్లో చిరునవ్వులు పూశాయి.

మరోవైపు నరేష్ మాత్రం ఈ రిజల్ట్ చూసి వెక్కివెక్కి ఏడ్చాడు. నాకు ముందే తెలుసు ఈ బరువులు మోయలేనని, అలాంటప్పుడు ఈ గేమ్‌లో ఎందుకు పెట్టారని బాధపడతాడు. ముందే చెప్తే ఎప్పుడో బయటికి వచ్చేసేవాడిని కదా అంటూ రాంప్రసాద్ ముందు ఏడ్చాడు. మొత్తానికి హౌస్‌లో ప్లాన్లు వేసిన వాళ్లకు ..బిగ్ బాస్ రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో ఈ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ముగిసింది .

Prabhas : డార్లింగ్ ప్రభాస్ బర్త్‌డే..రాజు గారి రేంజ్ వేరే లెవెల్ ..

Related Articles

Back to top button