Bigg BossJust EntertainmentLatest News

Elimination : బిగ్ బాస్ 11వ వారం నీతూ ఎలిమినేషన్.. రష్మిక సందడి..

Elimination : బిగ్ బాస్ పదకొండవ వారం ఎలిమినేషన్‌లో నీతూ బయటకు వెళ్లింది. ఇక 12వ వారం బడ్డీ అప్ థీమ్, కెప్టెన్సీ కంటెండర్లు, రష్మిక సందడితో బిగ్ బాస్ హౌస్‌లో జోష్ పెరిగింది.

Elimination

బిగ్ బాస్ హౌస్‌లో 11వ వీక్ డిక్టేటర్ల హోరుతో రసవత్తరంగా సాగింది. టీంను బాగా నడిపిస్తూ త్రిగుణ్ మంచి మార్కులే కొట్టేశాడు. అయితే ఈ వీక్ చివరికి వచ్చేసరికి గేమ్‌లో కీలక మలుపు తిరిగింది. ఎలిమినేషన్‌(Elimination)లో నీతూ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. పదకొండవ వారం స్టోరీ ఇలా ముగియగానే, 12వ వారం బడ్డీ అప్ థీమ్‌తో కొత్త గేమ్ మొదలవుతుందని నాగార్జున హింట్ కూడా ఇచ్చారు. ఈ కొత్త కాన్సెప్ట్‌లో ఎవరి గ్రాఫ్ ఎటు తిరుగుతుందో, ఎవరు నిలబడతారో చూడాలి. ఇప్పటికే 12వ వారం కెప్టెన్సీ కంటెండర్లు ఎవరనేది క్లారిటీ వచ్చేసింది.

సండే ఫండే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లను పెయిర్స్‌గా విడగొట్టి పోటీలు పెట్టారు. ఈ టాస్కుల్లో నెగ్గిన త్రిగుణ్, శివ్, ముకేష్, దేబ్జానీ, రాం ప్రసాద్, ఆర్కే నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. కాగా ఈ వీక్ నామినేషన్‌లో ఉన్న వారిలో ముందుగా దేబ్జానీ, త్రిగుణ్ సేఫ్ అని నాగ్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత త్రిగుణ్, వంశీ మధ్య జరిగిన రోప్ టాస్క్ 8 మినిట్స్‌కు పైగా హోరాహోరీగా గేమ్ సాగింది. చివరకు వంశీ వదిలేయగా త్రిగుణ్ విన్ అయ్యాడు. సంచాలక్ వర్షిణిని కూడా నాగార్జున ఈ టాస్క్ ట్రై చేయమని అడగ్గా, ఆమె మధ్యలో ఆగుతూ ఒక నిమిషం నెట్టుకొచ్చింది.

అయితే ఈ ఎపిసోడ్‌కు హీరోయిన్ రష్మిక రావడంతో స్టేజ్ మీద సందడి మొదలైంది. సినిమా డైలాగ్స్ గెస్ చేయడం, డ్యాన్స్‌లతో సెగ్మెంట్ వంటివాటితో హౌస్‌లో నవ్వులు పూయించింది. కన్నడలో ముకేష్, శివ్‌తో మాట్లాడటం హైలైట్‌గా నిలిచింది. రష్మిక చేతుల మీదుగా ముకేష్, వంశీ సేఫ్ అయినట్లు ప్రకటించారు.

ఆపై రాం ప్రసాద్, నరేష్ పోటీలో నరేష్ గెలవగా శివ్, రాం ప్రసాద్ కూడా సేవ్ అయ్యారు. అమన్, శివ్ టైర్ల టాస్క్‌లో శివ్ గెలవగా, ఆర్కే, వర్షిణి సేవ్ అయ్యారు. దేబ్జానీ, నీతూ గేమ్‌లో దేబ్జానీ నెగ్గగా.. అమన్ సేవ్ అయ్యాడు. సుధీర్, ఆర్కే టాస్క్‌లో ఆర్కే గెలిచి, ఫస్ట్ టైం తాను గెలిచానంటూ ఉత్సాహంగా అరిచాడు.

చివరిగా నీతూ, సుధీర్‌ను గార్డెన్ ఏరియాలోకి పిలిచిన బిగ్ బాస్.. కళ్లకు గంతలు కట్టించి కారులో కూర్చోబెట్టించాడు. సుధీర్ తిరిగి లోపలికి రావడంతో నీతూ నటరాజ్ ఎలిమినేట్ అయింది. స్టేజ్‌పై తన జర్నీని చూసుకుని నీతూ బాగా ఎమోషనల్ అయింది. గొడవలు, అరుపులు తనకు సెట్ కావని చెబుతూ, అమన్, శివ్, త్రిగుణ్ ఫుల్ ట్యాంక్ అని చెప్పిన నీతూ.. వంశీ, సుధీర్, ముకేష్ ఎంప్టీ ట్యాంక్ అని చెప్పింది. వెళ్తూ వెళ్తూ ముకేష్ సొంత నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఇక 12వ వారం బడ్డీ అప్ థీమ్‌తో గేమ్‌ ఎలా మారుతుందో చూడాలి.

Karthika Pournami : కార్తీక పౌర్ణమి విశిష్టత.. 365 ఒత్తుల దీపారాధన ఎలా చేయాలి?

Related Articles

Back to top button