Tulasi Puja : కార్తీక మాసంలో తులసి పూజ ఎందుకు చేయాలి? క్షీరాబ్ధి ద్వాదశి వేడుక వెనుకున్న రహస్యం ఏంటి?
Tulasi Puja : కార్తీక మాసంలో తులసి పూజ విశిష్టత, క్షీరాబ్ధి ద్వాదశి తులసి వివాహ పవిత్రత , ఇంట్లో పాటించాల్సిన ప్రత్యేక పూజా విధానాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Tulasi Puja
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉండే పవిత్రత, విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ నెలలో నదీ స్నానాలు, ఉసిరి చెట్టు కింద దీపారాధన ఎంత ముఖ్యమో, తులసి మాతను మొక్కను పూజించడం కూడా అంతే పవిత్రమైనదిగా భావిస్తారు.
శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తులసమ్మను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. ఈ మాసంలో తులసి కోట ముందు దీపం వెలిగించి, భక్తితో ప్రదక్షిణలు చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోవడంతో పాటు లక్ష్మీనారాయణుల పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ధి ద్వాదశి లేదంటే చిలుక ద్వాదశి రోజు తులసి వివాహ వేడుకను కార్తీక శుద్ధ ద్వాదశి రోజు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది తులసి వివాహం నవంబర్ 21,శనివారం రోజు వస్తుంది. ఈరోజు ఇంట్లో తులసి కోట వద్ద ఉసిరి కొమ్మను ఉంచి అలాగే పసుపుకుంకుమలు, పూలతో అలంకరించి శ్రీమహావిష్ణువుతో కళ్యాణాన్ని జరిపిస్తే సకల శుభాలు కలుగుతాయి.
పురాణాలు చెబుతున్నదాని ప్రకారం, పాల కడలిని మథించినప్పుడు ఉద్భవించిన తులసిని, దివ్యమైన క్షీరాబ్ధి ద్వాదశి రోజు శ్రీమహావిష్ణువు వివాహం చేసుకున్నాడని అంటార. అందుకే ఈరోజు తులసి కోట(Tulasi Puja)ను పసుపు, కుంకుమలు, పూలతో అందంగా అలంకరించి, ఉసిరి కొమ్మను తులసి మొక్క వద్ద ఉంచి సాక్షాత్తు విష్ణుమూర్తితో వివాహ మహోత్సవాన్ని జరిపిస్తారు. ఈ కళ్యాణాన్ని చూడటం కానీ ఇంట్లోనే నిర్వహించడం వల్ల కానీ వివాహం కాని వారికి త్వరగా పెళ్లి కుదురుతుందని, సంతాన లేమితో బాధపడేవారికి శుభ ఫలితాలు ఉంటాయని భక్తుల విశ్వాసం.
అలాగే ఇంట్లో తులసి పూజ(Tulasi Puja) చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలని పండితులు చెబుతారు. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి తులసికి శుద్ధమైన జలాన్ని సమర్పించాలి. కార్తీక మాసంలో ప్రతిరోజూ సాయంత్రం తులసి కోట దగ్గర ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుందని వేదపండితులు చెబుతున్నారు. అలాగే తులసి ఆకును పొరపాటున కూడా రాత్రి వేళల్లో తుంచకూడదు.
Rumours : రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తారు? దీనిపై సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?





