Nagarjuna Bigg Boss : బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కి నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్లు ..రోహిత్ సింపతీ కార్డు చించేసిన నాగ్..
Nagarjuna Bigg Boss : రోహిత్, వంశీ, రామ్ ప్రసాద్ మాత్రమే అఫీషియల్ గ్రూప్ సభ్యులు అయ్యారని.. మిగిలిన 11 మంది కూడా ఇంకా డేంజర్ జోన్‌లోనే ఉన్నారని నాగార్జున హెచ్చరించారు.
Nagarjuna Bigg Boss
ఫస్ట్ వారంలోనే బిగ్‌బాస్ ఊహించని డబుల్ షాక్ ఇచ్చి హౌస్‌మేట్స్ మైండ్ బ్లాంక్ చేశాడు. చరణ్, చైత్రను పంపేసి ఇంటి సభ్యులను, ఆడియన్స్‌ను అయోమయంలో పడేయడం ఒక ఎత్తయితే, శనివారం హోస్ట్‌గా నాగార్జున ఎంట్రీ మరో ఎత్తు అయ్యి హౌస్‌లో హీట్ నెక్ట్స్ లెవెల్‌కి చేరింది. రోహిత్ ఆడుతున్న సింపతీ గేమ్‌ని నాగ్ ఎండగట్టడం, ఎవరెవరికి క్లాస్ పడిందనేది ఈ ఎపిసోడ్‌లో అసలైన హైలైట్‌గా నిలిచింది.
హౌస్‌లో అగ్నిపరీక్ష బ్యాచ్ పేరుతో రోహిత్ ఆడుతున్న డ్రామాను త్రిగుణ్ పక్కాగా డీకోడ్ చేశాడు. వర్షిణి, ముకేశ్ దగ్గర కూర్చుని.. రోహిత్ సెంటిమెంట్ కార్డును ప్లే చేస్తూ ఎలా ఎమోషనల్ గేమ్ ఆడుతున్నాడో కళ్లకు కట్టినట్లు వివరించాడు. మరోవైపు ఆటో రామ్ ప్రసాద్, నరేష్ కలిసి బిగ్‌బాస్ కెమెరాల ముందు రోహిత్ సేఫ్ గేమ్‌ను కామిక్‌గానే ఎండగట్టేశారు.
ఆ తర్వాత స్టేజ్‌పైకి ఎంటర్ అయిన కింగ్ నాగార్జున.. ముందుగా రామ్ ప్రసాద్, నరేష్ రివ్యూకు థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన చరణ్, చైత్ర సీక్రెట్ రూమ్‌లో ఉన్నారనే ఊహాగానాలకు తెరదించడానికి, బయటికెళ్లిన చరణ్, చైత్రతో వీడియో కాల్ మాట్లాడించారు. చరణ్ ఇంకాస్త ఎనర్జిటిక్‌గా ఉంటే బాగుండేదని నాగార్జున అనగా, చరణ్ షాలినితో మాట్లాడాడు. ఇక చైత్ర మాత్రం రోహిత్ వల్లే తాను ఎలిమినేట్ అయ్యానని చెబుతూ అతడి స్ట్రాటజీని ఓపెన్‌గానే బయటపెట్టేసింది.
కాగా ఇప్పటికే రోహిత్, వంశీ, రామ్ ప్రసాద్ మాత్రమే అఫీషియల్ గ్రూప్ సభ్యులు అయ్యారని.. మిగిలిన 11 మంది కూడా ఇంకా డేంజర్ జోన్‌లోనే ఉన్నారని నాగార్జున హెచ్చరించారు. అయితే ఈ ముగ్గురికీ డ్రింక్స్ ఇచ్చి, వాళ్లు తాగిన కప్పులను నాగార్జునే కడిగి చూపించి హౌస్ మేట్స్‌కు షాక్ ఇచ్చారు.
మెయిన్‌గా ఎంగిలి కప్పులు కడగను, చేతికి రాసుకున్న మాయిశ్చరైజర్ పోతుందంటూ రోహిత్ చెప్పిన డైలాగులను ఇలా గుర్తు చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రోహిత్ దానికి ఇంకేదో చెప్పబోగా, వీడియో ప్లే చేసి మరీ అతడి తప్పును ప్రూవ్ చేశారు. అలాగే ఎంట్రీలోని వాటర్ గ్లాస్ టాస్క్ చేయలేకపోవడంతో.. రోహిత్‌కు రోజంతా కప్పులు కడిగే పెద్ద పనిష్మెంట్ ఇచ్చి, దాన్ని దగ్గరుండి చూసే బాధ్యతను మాత్రం షాలినికి ఇచ్చారు.
తర్వాత ఆడియన్స్ వేసిన ఓట్లతో త్రిగుణ్ నాలుగో హౌస్‌మేట్‌గా సేఫ్ అవగా.. గ్రూప్ గేమ్స్ పక్కనపెట్టి సోలోగా ఆడాలని నాగార్జున సలహా ఇచ్చారు. ఇక షాలిని ఓవరాక్షన్ చేసి త్రిగుణ్‌కు పనిష్మెట్ ఇమ్మంటే, నాగ్ ట్విస్ట్ ఇస్తూ రోజంతా ఏడుస్తూ ఉండకూడదని, మాట్లాడకుండా ఉండాలనే విచిత్రమైన శిక్షను తనకే వేశారు. అలాగే రోహిత్‌ను కామెంట్ చేసిన త్రిగున్ చేత సారీ చెప్పించి, టైర్ బరువు మోసే శిక్ష ఇచ్చారు.
తెలుగులో బాగా మాట్లాడుతున్న దేబ్జానీకి, మంచి గేమ్ ఆడుతున్న రామ్ ప్రసాద్‌కి నాగార్జున మార్కులు వేశారు. కానీ రామ్ ప్రసాద్ కామెడీ కాస్త ఎక్కువ చేసి షాలినిపై కామెంట్స్ చేయడంతో, బోర్డుపై 500 సార్లు సారీ సారీ అని రాయాలని ఆర్డర్ వేశారు.
ఇదే టైమ్‌లో రోహిత్ వాడిన ఒక పదం తనకు నచ్చలేదని ముకేశ్ గౌడ నాగార్జునకు చెప్పగా, దాన్ని తట్టుకోలేక రోహిత్ మళ్లీ రచ్చ మొదలుపెట్టేశాడు. ఈ గ్యాప్‌లోనే షాలిని ఐదో హౌస్‌మేట్‌గా ఎంపికైంది.
అయితే ఎప్పటిలాగే రోహిత్‌కి వంతపాడిన షాలిని, చైత్ర ఎలిమినేషన్ సీన్‌లో పాటలు పాడిన విషయాన్ని కవర్ చేసుకోవాలని చూసింది. దాంతో నాగ్ ఆమె యాటిట్యూడ్‌కి చెక్ పెడుతూ సీరియస్‌గా క్లాస్ పీకారు.

చివరగా నాగార్జున ఒక ఇంట్రస్టింగ్ టాస్క్ పెట్టారు. హౌస్‌లో ఎవరెవరికి ఎవరు హార్ట్‌కి క్లోజ్, ఎవరు ఫార్ అనే విషయాన్ని తేల్చమన్నారు. దేబ్జానీకి ఓటు వేసిన వర్షిణి రోహిత్‌ను పక్కనపెట్టింది. రామ్ ప్రసాద్‌ను ఓన్ చేసుకున్న దేబ్జానీ రోహిత్‌ను దూరం పెట్టింది. ఎప్పుడూ తనతో ఫైట్ చేసే త్రిగుణ్ పేరు చెప్పిన రోహిత్ .. సింపతీ వర్కౌట్ చేయడానికి ట్రై చేశాడు. ఝాన్సీకి సపోర్ట్ చేసిన త్రిగుణ్.. సుధీర్‌ను పక్కనపెట్టాడు. ముకేశ్‌ను ఓన్ చేసుకుని రోహిత్‌ను ఝాన్సీ సైడ్ చేసింది. దేబ్జానీకి సపోర్ట్ చేసి సృష్టి.. వర్షిణిని దూరం పెట్టింది.
మిగిలిన వారి పేర్లను ఆదివారం చెబుతానని నాగ్(Nagarjuna Bigg Boss) ముగిస్తూ, చివరిగా కన్నడ బ్యూటీ దేబ్జానీని ఆరో హౌస్‌మేట్‌గా ఎనౌన్స్ చేశారు. మొత్తానికి ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో రోహిత్, షాలిని పప్పులు ఇకపై ఉడకవని తేలిపోయింది.





