Emotional Availability : పార్ట్నర్స్ ఆలోచనలు కలిస్తే సరిపోదా? బంధంలో ఎమోషనల్ అవైలబిలిటీ అవసరమా?
Emotional Availability : బంధాలను నిలబెట్టడంలో ఎప్పుడూ కూడా ఎమోషనల్ అవైలబిలిటీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు.
Emotional Availability
ఇద్దరి ఇష్టాయిష్టాలు ఒక్కటే, ఇద్దరి గోల్స్ కూడా ఒకటే, గొడవలు అసలే పడరు.. చూడటానికి ఇది పర్ఫెక్ట్ జంటలా కనిపిస్తుంది అందరికీ. అయితే ఒకేలాంటి ఆలోచనలు ఉండటం మంచిదే అయినా, అది ఒక రిలేషన్‌షిప్‌కి పునాదిగా ఉంటుంది తప్ప పూర్తి గ్యారంటీ ఇవ్వలేదని అంటున్నారు సైకాలజిస్టులు.
పార్ట్నర్ మనసులోని భావాలను అవతలివారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా, వారి మాటలకు వ్యాల్యూ ఇవ్వలేకపోయినా లేదంటే కష్ట సమయంలో వారి పక్కన నిలబడలేకపోయినా, ఎంత పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అయినా లోపల శూన్యమే మిగులుతుంది. అందుకే బంధాలను నిలబెట్టడంలో ఎప్పుడూ కూడా ఎమోషనల్ అవైలబిలిటీ(Emotional Availability) అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు.
మనం సాధారణంగా మన బిహేవియర్‌ను, ఆలోచనలను సరిగ్గా అర్థం చేసుకునే పర్సన్ మనకు పర్ఫెక్ట్ జోడీ అని నమ్ముతుంటాం. అయితే ఒకేసారి పుట్టిన కవల పిల్లల ఆలోచనలే వేర్వేరుగా ఉన్నప్పుడు, వేరు వేరు కుటుంబాలు , డిపరెంట్ వాతావరణాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు అన్ని విషయాలలో ఒకేలా ఆలోచిస్తారనుకోకూడదు. బంధాన్ని నడిపించేది ఎప్పుడూ పర్ఫెక్ట్ రూపురేఖలు, ఆలోచనలు కానే కాదు.. ఎదుటివారి ఎమోషన్స్‌కు ఎంత అందుబాటులో ఉన్నామనేదే అసలు విషయం.
ఎమోషనల్ అవైలబిలిటీ(Emotional Availability) అంటే పార్ట్నర్ చెప్పేది వినాలి, వారి మెంటల్ నీడ్స్ అర్థం చేసుకోవాలి , వారి ప్లేస్‌లో నిలబడి ఆలోచించాలి. ఒకవేళ మీ పార్ట్నర్ మీ నుంచి ఏదొక విషయం తనను బాధించిందని చెప్పినప్పుడు.. నువ్వెప్పుడూ ఇంతే అనో..లేదంటే నేను ఏం చేసినా నీకు నచ్చదని ఎదురు దాడికి దిగితే ఆ మాటలు అక్కడితో ఆగిపోతాయి కానీ ఆ లోపలి పెయిన్ అలాగే ఉండిపోతుంది. ఏళ్లు గడుస్తున్నా మీరు ఇంకా మారలేదనే మాట వారి నుంచి వినిపిస్తుందంటే,పార్ట్నర్ మనసులోని అసలు అవసరాన్ని మీరింకా గుర్తించకపోవడమే కారణమని అంటున్నారు సైకాలజిస్ట్‌లు.

ఒకరి మాటలు వినడమంటే కేవలం ఆ మాటల శబ్దాలను వినడం కాదు. వారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారనేది ఆలోచించాలి. అది కాస్త నమ్మకం కావొచ్చు, ప్రేమ కావొచ్చు లేదా ఒక గౌరవం కావొచ్చు. అలా అని ప్రతీ విషయంలో పార్ట్నర్తో ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ ఆలోచించే విధానంలో మీ యాంగిల్ వేరైనా, ఈ విషయం వారిని ఎందుకు బాధపెట్టిందో అర్థం చేసుకోగలనని చెప్పే ఒక్క మాట.. మీ బంధాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత మీ పార్ట్నర్కు ఇచ్చే మాటను మీ చేతల్లో చూపించడమే నిజమైన ప్రేమ అని తెలుసుకోవాలి.
మీ ఇష్టాలు, అలవాట్లు, ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే విధానం వేర్వేరుగా ఉన్నా.. ఒకరినొకరు అర్థం చేసుకునే మనసుంటే మాత్రం ఆ తేడాను దాటుకుని అద్భుతమైన జీవితాన్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఒకేలాంటి అభిప్రాయాలున్నంత మాత్రాన ఒకరి ఫీలింగ్స్‌ను ఒకరు గౌరవించుకోకపోతే..ఆ రిలేషన్ ఎప్పటికీ నిలబడదన్న విషయాన్ని తెలుసుకోవాలి. మనకు సరిగ్గా సరిపోయే పర్సన్ కోసం వెతకడం కంటే.. మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే పార్ట్‌నర్స్‌తో ప్రయాణించడమే అసలైన బంధం.
Age For Marriage : పెళ్లికి ఏజ్ ఒక్కటే సరిపోదా?..మ్యారీడ్ లైఫ్‌ను లీడ్ చేసే మెచ్యూరిటీ ఉండాలా?





