Bigg BossJust EntertainmentLatest News

Sunday Episode : రోహిత్ చుట్టూనే షాలినీ ఆట.. సీక్రెట్ రూమ్ నుంచి వచ్చాక ఆమె స్ట్రాటజీ ఛేంజ్ అవుతుందా?

Sunday Episode : తను ప్రాణంగా ఇష్టపడుతున్న షాలినీ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోతుందనేసరికి రోహిత్ వెక్కి వెక్కి ఏడ్వడం అందరినీ కదిలించింది.

Sunday Episode

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆరో వారం ఎలిమినేషన్ స్టేజ్‌కు వచ్చేసరికి ఊహించని మలుపులు తిరిగింది. హౌస్ మేట్స్ అందరికీ ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ టీమ్. ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చేసిన షాలినీకి.. క్లైమాక్స్‌లో ఇచ్చిన బంపర్ ఆఫర్ కంటెస్టెంట్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

షాలినీని డైరెక్టుగా బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్‌లోకి పంపి హంగామా క్రియేట్ చేశారు. దీంతో ఆమెకు ఈ వారం నామినేషన్స్ నుంచి రిలీఫ్ దొరికినట్లే అయినట్లే అయింది. డైరెక్టుగా 8వ వారంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న షాలినీ.. ఇకనైనా ఆమె రోహిత్ జపం పక్కన పెట్టి అసలైన గేమ్ మీద ఫోకస్ పెడుతుందా లేదా అన్నది చూడాలి.

అక్టోబర్ 18వ తేదీ ఆదివారం ఎపిసోడ్‌(Sunday Episode)లో హౌస్ మొత్తం మాత్రం ఫుల్ ఎమోషన్స్, ఎంటైర్టైన్‌మెంట్‌తో నిండిపోయింది. తను ప్రాణంగా ఇష్టపడుతున్న షాలినీ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోతుందనేసరికి రోహిత్ వెక్కి వెక్కి ఏడ్వడం అందరినీ కదిలించింది. హౌస్‌మేట్స్‌తో పాటు అందరూ ఆమె నిజంగానే ఎలిమినేట్ అయిందని అనుకుంటున్న టైమ్‌లో నాగ్ అసలు ట్విస్ట్ రివీల్ చేశారు. నువ్వు ఎలిమినేట్ అవ్వలేదు, సీక్రెట్ రూమ్‌కి వెళ్తున్నావని నాగార్జున చెప్పగానే షాలినీ ఫేస్‌లో ఆనందం డబుల్ అయింది.

సండే ఫండే ఎపిసోడ్‌(Sunday Episode)లో భాగంగా ముందుగా జరిగిన డాన్స్ ఫేస్ ఆఫ్ అందరినీ అలరించింది. నరేష్ టీమ్ ఈ డాన్స్ బ్యాటిల్‌లో గెలిచింది. దేబ్జానీ- దక్షి, త్రిగుణ్- శివ్, అమన్- ముకేష్ ఇలా అందరూ తమదైన స్టెప్పులతో స్టేజీని షేక్ చేశారు. రాంప్రసాద్ మార్కులు వేయగా, ఫైనల్ జడ్జ్‌గా నాగ్ వాటిని కన్ఫర్మ్ చేశారు. ఈ పర్ఫార్మెన్స్‌లో నీతూ, షాలినీ వేసిన డ్యాన్స్ గురించి రోహిత్‌ను నాగార్జున అడగగా.. నీతూ మాస్టర్ బాగా చేశారంటూ చెప్పాడు రోహిత్. అయితే ఈ డాన్స్ టాస్కులో అమన్ తన స్టెప్పులతో అందరినీ ఫిదా చేశాడు.

ఆ తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లపై ఓజీ కంటెస్టెంట్ల ఒపీనియన్ చెప్పాలని నాగ్ ఒక చిన్న టాస్క్ పెట్టారు. దీనిలో మెజారిటీ సభ్యులు దక్షి పేరును నెగిటివ్‌గా వినిపించారు. ఆమెకు ఓ మిర్చి ఇచ్చి రీజన్ చెప్పాలని నాగార్జున చెప్పడంతో దక్షికి డైరెక్టుగా రెండు వారాల పాటు నామినేట్ అయ్యే పనిష్మెంట్ తగిలింది. ఇక మెజార్టీ ఓట్లతో రాంప్రసాద్ ఈ వారం స్టార్ ప్లేయర్‌ అయ్యాడు.

ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి వర్షిణి, షాలినీ డేంజర్ జోన్‌లో మిగిలిపోయారు. ముకేష్ వర్షిణి సేఫ్ కావాలని కోరుకుంటే, రోహిత్ షాలినీ సేఫ్ కావాలని కంటతడి పెట్టుకున్నాడు. చివరికి షాలినీ ఎలిమినేట్ అని నాగ్ ప్రకటించడంతో రోహిత్ ఏడ్చేయడంతో..కప్పుతోనే బయటికి రావాలంటూ రోహిత్‌కి ధైర్యం చెప్పింది షాలినీ.

స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత షాలినీ జర్నీకి సంబంధించిన వీడియో (Audio Visual) ప్లే చేయగా, దానిలో పూర్తిగా రోహిత్ గురించే ఉండటంతో.. ఆట మొత్తం అతనే ఉన్నాడు, ఏవీలో కూడా అతనే కనిపిస్తున్నాడంటూ నాగ్ పంచ్ వేశారు. అంతేకాదు, నువ్వు ఉండాల్సిన ప్లేస్‌లో ఎవరు ఉండాలో నాగ్ ఒక టాస్క్ ఇవ్వగా.. వంశీ, సుధీర్, వర్షిణి పేర్లను చెప్పింది షాలిని. అందులో వంశీ ఎప్పుడూ నోరు జారలేదు, స్ట్రాంగ్ అని నాగ్ అనడంతో..సర్ మీరు నన్ను రోస్ట్ చేయాలనే ఫిక్స్ అయ్యారంటూ నాగ్ కౌంటర్లకు జవాబిచ్చింది.

చివరికి హౌస్‌మేట్స్ అందరికీ బై చెప్పి వెళ్లిపోవాలని నాగార్జున అనడం, వెంటనే ఆమెకు ట్విస్ట్ ఇచ్చి సీక్రెట్ రూమ్‌కి పంపడం ఇంట్రస్టింగ్‌గా మారింది. మరి సీక్రెట్ రూమ్ నుంచి తిరిగి హౌస్‌ మేట్స్‌ దగ్గరకు రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత షాలినీ తన గేమ్‌ను మార్చుకుంటుందా లేదా అనేది చూడాలి.

Heart Attack : గుండెపోటు లక్షణాలు మగవారిలో, మహిళలలో వేరువేరుగా ఉంటాయని తెలుసా? ఆ సమయంలో ఏం చేయాలి?

Related Articles

Back to top button