Just EntertainmentLatest News

Peddi Collections : థియేటర్లలో తిరుగులేని రియల్ ఛాంపియన్..ఆగని పెద్ది కలెక్షన్ల సునామీ

Peddi Collections : పెద్ది మూవీ యూనిట్ తాజాగా అఫీషియల్‌గా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.345 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుని రియల్ బాక్సాఫీస్ ఛాంపియన్‌గా నిలిచింది.

Peddi Collections

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ కలెక్షన్స్ ఊచకోత మామూలుగా లేదు . బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో వచ్చిన విలేజ్ స్పోర్ట్స్ డ్రామా వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రికార్డుల వేట మొదలుపెట్టేసింది.

రిలీజైన ఫస్ట్ డే నుంచే వసూళ్ల సునామీ సృష్టిస్తున్న పెద్ది మూవీ.. ఇప్పుడు మొదటి వారం రన్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. అయితే వారం దాటినా అందులోనూ స్కూల్స్, కాలేజీలు స్టార్ట్ అయినా కూడా కలెక్షన్ల జోరు అస్సలు తగ్గడం లేదు.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు ఓవర్సీస్, ఇటు నార్త్ ఇండియాలో కూడా పెద్ది సినిమా భారీగా కలెక్షన్స్ రాబడుతోంది.

మూవీ యూనిట్ తాజాగా అఫీషియల్‌గా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.345 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుని రియల్ బాక్సాఫీస్ ఛాంపియన్‌గా నిలిచింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా చరణ్‌కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇప్పటికే 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిపోయి ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.

థియేటర్లలో ఆడియెన్స్ రియాక్షన్ ఇలా

ఈ వారంలో కూడా థియేటర్లలో పెద్దికి పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో.. లాంగ్ రన్‌లో ఈ మూవీ వసూళ్లతో(Peddi Collections )మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ , వృద్ధి సినిమాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రెస్టీజియస్‌గా వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది.

Peddi Collections
Peddi Collections

అలాగే శివరాజ్ కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, రవి కిషన్, సత్య వంటి నటులు ఈ మూవీ సక్సెస్‌కు ప్లస్ పాయింట్‌గా నిలవగా.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మెయిన్ పిల్లర్స్‌లా నిలిచి ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తున్నాయి.

Gold Price : దిగివస్తున్న పసిడి ధర..త్వరలోనే లక్ష దిగువకు..?

Related Articles

Back to top button