Instagram Instants:ఇన్‌స్టాలో టెన్షన్ పెడుతున్న కొత్త అప్డేట్..ప్రైవసీని దెబ్బతీస్తున్న ఫీచర్‌ను ఇలా ఆఫ్ చేయండి.
Instagram Instants :పొరపాటున పర్సనల్ ఫోటోలు, రాంగ్ ఫోటోలు సెండ్ అయిపోతుండటంతో యూజర్లు బాబోయ్ మాకీ ఫీచర్ వద్దు అంటూ సోషల్ మీడియాలో నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.
Instagram Instants
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్గా ఇన్స్టంట్స్ ( Instagram Instants) అనే ఒక సరికొత్త ఫీచర్‌ను మెటా కంపెనీ యూజర్ల ముందుకు తీసుకువచ్చింది. ఈ ఫీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. యూజర్లు తామున్న చోట నుంచి అప్పటికప్పుడే రియల్ టైమ్ ఒరిజినల్ ఫోటోలను చాలా ఈజీగా తమ స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు.
అలా పంపిన ఫోటోలు కొంత టైమ్ తర్వాత వాటంతట అవే అదృశ్యమవుతాయి (Disappear). వినడానికి ఇది చాలా అద్భుతమైన ఫీచర్లా అనిపించినా, ప్రస్తుతం ఈ ఫీచర్ ఇన్స్టాగ్రామ్ యూజర్లను ఒక రేంజ్లో టెన్షన్ పెడుతోంది. అసలు ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో తెలియక, పొరపాటున పర్సనల్ ఫోటోలు, రాంగ్ ఫోటోలు సెండ్ అయిపోతుండటంతో యూజర్లు బాబోయ్ మాకీ ఫీచర్ వద్దు అంటూ సోషల్ మీడియాలో నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. గూగుల్‌లో కూడా ఈ ఫీచర్‌ను ఎలా ఆఫ్ చేయాలో అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఈ కొత్త ఇన్స్టాగ్రామ్ ఇన్స్టంట్స్ (Instagram Instants)ఫీచర్‌ను ఫస్ట్ టైమ్ వాడుతున్నప్పుడు అది ఎలా పని చేస్తుందో గమనించడం చాలా ఇంపార్టెంట్. మీ ఇన్స్టాగ్రామ్ ఇన్‌బాక్స్ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ కింద భాగంలో చిన్న ఫోటోల గ్రూప్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయగానే ఈ ఫీచర్‌కు సంబంధించిన చిన్న ఇంట్రడక్షన్ స్క్రీన్ మీద వస్తుంది.
దీనిలో(Instagram Instants )పంపే ఫోటోలు కాసేపటికే డిలీట్ అయిపోతాయని, వీటిని ఎవరు చూశారో తెలుసుకునే వ్యూ లిస్ట్ ఉండదని, అలాగే వీటికి వచ్చే రిప్లైలు, రియాక్షన్లు పూర్తిగా ప్రైవేట్‌గా ఉంటాయని ఇన్స్టాగ్రామ్ చెప్తుంది. ఆ తర్వాత కెమెరా సెక్షన్ ఓపెన్ అయినప్పుడు కింద ఒక షట్టర్ బటన్ ఉండి, దాని పక్కన ఫ్రెండ్స్ , క్లోజ్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. డిఫాల్ట్‌గా ఇది ఫ్రెండ్స్ అని సెట్ అయి ఉండటం వల్లే చాలా మంది పొరపాటున ఫోటోలు సెండ్ చేస్తూ ఇబ్బందుల్లో పడుతున్నారు.
సాధారణంగా యూజర్లు తమ ఫోటోలు షేర్ చేసే ముందు ఎడిట్ చేయడం కానీ రివ్యూ చేయడం కానీ చేస్తుంటారు. కానీ దీనిలో అప్పటికప్పుడే క్లిక్ అయి సెండ్ అయిపోతుండటంతో ఇది యూజర్ల ప్రైవసీకి పెద్ద తలనొప్పిగా మారింది.
ఒకవేళ మీరు పొరపాటున ఏదైనా ఇన్స్టంట్ ఫోటో పంపించేస్తే, దానిని వెంటనే వెనక్కి తీసుకోవడానికి మెటా ఒక క్యాన్సిల్ , అన్‌సెండ్ ఆప్షన్‌ను కూడా కల్పించింది. మీరు ఫొటో పంపిన వెంటనే ఆ షట్టర్ బటన్ కింద అండూ (Undo) అనే ఆప్షన్ కనిపిస్తుంది. అవతలి వ్యక్తి ఆ ఫోటోను ఇంకా ఓపెన్ చేసి చూడకపోతే వెంటనే అన్‌సెండ్ చేయొచ్చు.
లేదా మీ ప్రొఫైల్ లోని ఆర్కైవ్ సెక్షన్లోకి వెళ్లి కూడా ఆ ఇన్‌స్టంట్‌ను డిలీట్ చేసే ఆప్షన్ ఉంటుంది . దీని కోసం కెమెరా స్క్రీన్ పైన రైట్ సైడ్ ఉండే ఫోర్ బాక్స్ ఐకాన్‌ను ట్యాప్ చేసి అక్కడ నుంచి డిలీట్ చేస్తే, మీ స్నేహితులకు ఆ ఫోటో ఇక కనిపించదు.
ఈ టెన్షన్ అంతా మాకొద్దు, అసలు ఈ ఫీచరే మా యాప్‌లో కనిపించకూడదనుకునే వారి కోసం ఇన్స్టాగ్రామ్ దీనిని పూర్తిగా ఆఫ్ చేసుకునే సెట్టింగ్‌ను కూడా ఇచ్చింది. ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయడానికి ముందుగా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు వెళ్లాలి. అక్కడ రైట్ సైడ్ పైన ఉన్న త్రీ లైన్ మెనూ (సెట్టింగ్స్) పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే కంటెంట్ ప్రిఫరెన్సెస్ (Content Preferences) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేయగానే హైడ్ ఇన్స్టంట్స్ ఇన్‌బాక్స్ ( Hide Instants inbox )అనే ఒక బటన్ ఉంటుంది, దానిని ఆన్ చేసుకోవాలి. ఈ చిన్న సెట్టింగ్ మార్చడం వల్ల ఇన్స్టంట్స్ ఫీచర్ ఇన్‌బాక్స్ నుంచి పూర్తిగా మాయమవుతుంది.
అయితే దీనివల్ల ఇతరులు పంపే ఇన్స్టంట్స్ మీకు కూడా కనిపించవు. మీరు పొరపాటున మీ ఫోటోలు ఎవరికీ పంపే అవకాశం ఉండదు. ఒకవేళ పూర్తిగా ఆఫ్ చేయడం ఇష్టం లేకపోతే, మీ ఇన్‌బాక్స్‌లోని ఇన్స్టంట్స్ గ్రూపుపై కాసేపు నొక్కి పట్టి రైట్ సైడ్ స్వైప్ చేస్తే, టెంపరరీగా ఆ ఫోటోలు రావడం ఆగిపోతాయి.





