Just EntertainmentLatest News

Chiranjeevi:మరోసారి మానవత్వాన్ని చాటుకున్న చిరంజీవి..ఆ ఇద్దరినీ ఆదుకున్న మెగాస్టార్

Chiranjeevi: సినీ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న శివనాథ్ అనే వ్యక్తి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Chiranjeevi

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, అంతకు మించిన గొప్ప మనసున్న వ్యక్తి అని చిరు ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. తెరపై తన యాక్షన్‌తో కోట్లాది మందిని అలరించే మెగాస్టార్, తెర వెనుక వేలాది మంది కష్టాల్లో పాలు పంచుకుంటూ సినీ ఇండస్ట్రీ నిజమైన స్టార్ అనిపించుకుంటున్నారు.

బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ వంటి సేవా కార్యక్రమాలతో తన సేవలు మొదలుపెట్టి, కరోనా మహమ్మారి విస్తరించిన కష్టకాలంలో ఆక్సిజన్ బ్యాంకులు పెట్టడం ద్వారా వేలాది మంది ప్రాణాలు కాపాడటం వరకు చిరంజీవి చేసిన సేవలు అజరామరం. తాజాగా మెగాస్టార్ చేసిన మరో రెండు గొప్ప సాయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

సినీ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న శివనాథ్ అనే వ్యక్తి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ కోసం భారీగా ఖర్చు కావడంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న శివనాథ్ పరిస్థితి మెగాస్టార్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన చిరంజీవి, శివనాథ్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం ఏకంగా 10.5 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని అందించారు. కేవలం డబ్బు ఇవ్వడమే కాకుండా, శివనాథ్ కుటుంబాన్ని స్వయంగా పిలిపించి మాట్లాడి, వారికి కొండంత ధైర్యాన్ని కూడా ఇచ్చారు.

Chiranjeevi
Chiranjeevi

అలాగే, గతంలో తన వద్ద మేనేజర్‌గా పనిచేసిన నరసయ్య భార్యకు అత్యవసరంగా సర్జరీ చేయాల్సి రావడంతో చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆమె ట్రీట్మెంట్ కోసం సుమారు 9 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడమే కాకుండా, పర్సనల్‌గా అపోలో ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి ఆపరేషన్ విజయవంతం అయ్యేలా చూసుకున్నారు. ఇలా వారం రోజుల్లోనే 20 లక్షల రూపాయల వరకు సాయాన్ని అందించి ఇద్దరి ప్రాణాలను కాపాడారు చిరంజీవి.

ఒకవైపు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ.. మరోవైపు సినిమాలతో అభిమానులను అలరించేందుకు చిరంజీవి (Chiranjeevi)సిద్ధమవుతున్నారు.చిరు ప్రధాన పాత్రలో నటించిన భారీ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత బాబీ డైరెక్షన్‌లో మరో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి మెగాస్టార్ సిద్ధమవుతున్నారు.

Loan :ఆ మహిళలకు బంపర్ ఆఫర్..2 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్..

Related Articles

Back to top button