Just EntertainmentJust InternationalLatest News

Dhurandhar 2 : పాక్ ను వణికిస్తున్న ధురంధర్…బట్టలిప్పి తనిఖీలు చేస్తున్న వైనం

Dhurandhar 2 : బాలీవుడ్ మూవీ ధురంధర్ దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులన్నీ గల్లంతయ్యాయి. కేవలం వారం రోజుల్లో 1000 కోట్లు వసూలు చేసిన సరికొత్త రికార్డులు సృష్టించింది

Dhurandhar 2

బాలీవుడ్ మూవీ ధురంధర్ దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులన్నీ గల్లంతయ్యాయి. కేవలం వారం రోజుల్లో 1000 కోట్లు వసూలు చేసిన సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ మూవీ దెబ్బ కేవలం ఇండస్ట్రీలోనే కాదు మన శతృదేశం పాకిస్థాన్ కు వణుకు పుట్టిస్తోంది. భారత గూఢఛారి పాక్ వెళ్లి అక్కడి రహస్యాలు తెలుసుకుని వారి కుట్రలను అడ్డుకునే కథతోనే ఇది తెరకెక్కింది.

ఈ మూవీ సెకండ్ పార్టుతో పాక్ గుండెల్లో వణుకు మొదలైంది. గతంలో జరిగిన కొన్ని సీక్రేట్ ఆపరేషన్లకు కొనసాగింపుగా పాక్ లో ఉండే ఉగ్రవాద నెట్ వర్క్ ను కనిపెట్టడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ ధురంధర్ చేపట్టింది. దీనిని ఆధారంగా చేసుకునే రణవీర్ సింగ్ హీరోగా ధురంధర్ తెరకెక్కింది. సినిమాలో హీరో గూఢచారిగా చేసే హంగామా చూసి ఇప్పుడు పాక్ నిఘా వర్గాలకు, సైనికాధికారులకు కొత్త టెన్షన్ మొదలైంది.

ఇంకా భారత్ కు చెందిన సీక్రేట్ ఏజెంట్లు ఎవరైనా దేశంలోనే ఉన్నారేమోనని జల్లెడ పడుతున్నారు. వారి భయం ఏ స్థాయికి చేరిందంటే అనుమానం వచ్చిన వారిని సాధారణ తనిఖీలు కాకుండా బట్టలు విప్పించి అణువణువూ చెక్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సున్తీ చేసుకున్నారా లేదా అనే విషయాన్ని ఫ్యాంట్లు విప్పించి మరీ తనిఖీ చేయడం షాకింగ్ గా మారింది.

ధురంధర్ 2 (Dhurandhar 2) సినిమాలో చూపించినట్టు భారత్ గూఢచారులు తమ దేశంలోకి ముస్లిం వేషధారణలో వచ్చి తిరుగుతున్నారేమోనని పాక్ ఐఎస్ఐ తెగ కంగారు పడుతోంది. దీంతో పాక్ సరిహద్దు ప్రాంతాల్లో కీలకంగా ఉన్న పంజాబ్, బలూచిస్థాన్ లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అడుక్కునే వాళ్లు, చెత్త ఏరుకునే వారే లక్ష్యంగా తనిఖీలు ముమ్మరం చేశారు.

Dhurandhar 2
Dhurandhar 2

ఈ క్రమంలో పాక్ పోలీసులు, ఇతర నిఘ వర్గాల అధికారులు సాధారణ పౌరులను కూడా వేధిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. మీరు ముస్లిం వ్యక్తులేనా అంటూ ధృవ పత్రాలు చూసి కాకుండా ఫిజికల్ టెస్టుల పేరుతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దీని కోసం సున్తీ చేయించుకున్న వారే ముస్లింలుగా ఉంటారని , దానిపైనే తనిఖీలు చేస్తున్నారు.

అనుమానం వచ్చిన వాహనాల్లో అందరినీ పక్కకు తీసుకెళ్లి ప్రైవేటు భాగాలు చెక్ చేస్తున్నారు. దీంతో పాక్ సైనికుల తీరుపై స్థానికంగా నివసించే ముస్లింలు, ప్రజలు మండిపడుతున్నారు. పక్క దేశం గూఢచారులను గుర్తించేందుకు ఇలాంటి పనికిమాలిన విధానాలు వాడతారా అంటూ తిట్టిపోస్తున్నారు.

Rose Plants:గులాబీ మొక్కలు పెంచుతున్నారా.. ఏడాదంతా పూలు పూయాలంటే ఇలా చేయండి..

Related Articles

Back to top button