Just EntertainmentLatest News

Dimple Hayathi : బాలయ్యతో డింపుల్…క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Dimple Hayathi : సీనియర్ హీరోల్లో బాలకృష్ణ ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటారు. అభిమానుల కోసం స్టార్ డైరెక్టర్లతో కాంబినేషన్లు రిపీట్ చేస్తూ వారిని అలరిస్తుంటారు

Dimple Hayathi

సీనియర్ హీరోల్లో బాలకృష్ణ ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటారు. అభిమానుల కోసం స్టార్ డైరెక్టర్లతో కాంబినేషన్లు రిపీట్ చేస్తూ వారిని అలరిస్తుంటారు. ఈ క్రమంలో వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వలో బాలయ్య బాబు నటిస్తున్న చిత్రం వర్కింగ్ టైటిల్ NBK 111.

ఈ మూవీ ప్రకటించినప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. హీరోయిన్ ఎవరు.. విలన్ ఎవరు… కథేంటి అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తూనే ఉన్నారు. హీరోయిన్ గా నయనతార పేరు కన్ఫర్మ్ చేసారని, మరో హీరోయిన్ గా డింపుల్ హయాతి(Dimple Hayathi) అంటూ వార్తలు వచ్చాయి. కీలక పాత్రలో రాయ్ లక్ష్మి కూడా నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే డింపుల్ హయాతి(Dimple Hayathi) పేరు వినబడగానే అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఫ్లాప్ హీరోయిన్ ను బాలయ్య పక్కన పెడుతున్నారా అంటూ అభిమానులు ప్రశ్నలు గుప్పించారు.

మంచి కాంబోలో వస్తున్న మూవీని చెడగొట్టొద్దంటూ డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి సలహాలు ఇచ్చారు. డింపుల్ ప్లేస్ లో రవీనా టాండన్ ను తీసుకోవచ్చుగా అంటూ సెటైర్లు కూడా వేశారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ గట్టిగానే నడిచింది. ఈ వార్తలు డైరెక్టర్ గోపీచంద్ కు చేరడంతో వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. పనిలో పనిగా పుకార్లకు తనదైన శైలిలో సెటైరిక్ గా బ్రేక్ వేశాడు.

Dimple Hayathi
Dimple Hayathi

మహేష్ బాబు గతంలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మీకేమన్నా చెప్పారా.. అన్న డైలాగ్ ను వాడుతూ అందరికీ జవాబిచ్చారు. అప్పట్లో మహేష్ బాబు మాట్లాడిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఒక క్రేజీ మీమ్ గా మారింది. ఇప్పుడు అదే మీమ్ తో గోపిచంద్ మలినేని డింపుల్ హయాతీ హీరోయిన్ అంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టారు.

అంటే ఆ వార్తల్లో నిజం లేదు.. తనకు నిజంగా తెలీదు అని చెప్పేందుకు ఈ మీమ్ ను ఉపయోగించి జవాబిచ్చారు. దీంతో బాలయ్య మూవీలో ఫ్లాప్ హీరోయిన్ అనే ప్రచారానికి ముగింపు పలికారు. NBK 111 మూవీలో బాలకృష్ణ రాజుగా, నయనతార హీరోయిన్ గా కనిపిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. బడ్జెట్ ఎక్కువవడంతో మళ్లీ కథ మార్చినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే కథపై ఇప్పటి వరకూ ఎలాంటి విషయాలు వెల్లడించలేదని మూవీ మేకర్స్ స్పష్టం చేసారు.

Indian Railways : మిడిల్ బెర్త్ బుక్ చేసుకున్నారా ?…ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే

Related Articles

Back to top button