Just EntertainmentLatest News

Jailer 2 : బాక్సాఫీస్ దగ్గర రజినీ మాస్ జాతర..రూ.100 కోట్లు దాటేసిన జైలర్ 2 ఫస్ట్ డే కలెక్షన్లు

Jailer 2 : అక్టోబర్ 15న గ్రాండ్‌గా రిలీజైన రజినీ కాంత్ జైలర్ 2 మూవీ.. బాక్సాఫీస్ ముందు కనక వర్షాన్ని కురిపిస్తోంది.

Jailer 2

ఈ ఏజ్‌లో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ బాక్సాఫీస్ బాద్‌షా అని ప్రూవ్ చేసుకున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దెబ్బకు థియేటర్లలో విజిళ్లు, గోలలతో థియేటర్ల వద్ద వాతావరణం మరింత వేడెక్కిపోయింది. అక్టోబర్ 15న గ్రాండ్‌గా రిలీజైన జైలర్ 2(Jailer 2) బాక్సాఫీస్ ముందు కనక వర్షాన్ని కురిపిస్తోంది. ఫస్ట్ డేనే కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 125.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను కూడా షాక్‌కు గురి చేసింది. యూత్ పోటీ వచ్చినా కూడా రజినీ మ్యాజిక్ ఏమాత్రం తగ్గలేదని ఈ నెంబర్లు క్లియర్‌గా చెప్పేస్తున్నాయి.

ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. భారత దేశంలోనే ఫస్ట్ డే రూ. 59.70 కోట్ల నెట్, రూ. 70.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదయ్యాయి. అంతేకాదు ఓవర్సీస్‌లోనూ రజినీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌లో కనిపించింది. విదేశాల్లో ఫస్ట్ రోజే సుమారు రూ. 55 కోట్లు రాబట్టి రజినీ మేనియాను మరోసారి చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా 37 లక్షల మందికి పైగా మూవీ లవర్స్ మొదటి రోజే థియేటర్లకు క్యూ కట్టారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ తలైవా హవా గట్టిగానే నడిచింది. ఇక్కడ ఫస్ట్ డే రూ. 12.50 కోట్ల గ్రాస్ రాబట్టి మాస్ రాంపేజ్ చూపించింది. తమిళనాట 70% ఆక్యుపెన్సీతో రూ. 43.35 కోట్ల నెట్ రాబట్టి టాప్‌లో నిలిచింది. బాక్సాఫీస్ హిట్స్ కూలీ, లియో మూవీల ఫస్ట్ డే రికార్డులను కొద్దిలో మిస్ చేసినా కూడా కోలీవుడ్ సినీ హిస్టరీలోనే థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన మూవీగా ‘జైలర్ 2′(Jailer 2) నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇంకా రానున్న రోజుల్లో ఈ వసూళ్ల వీరవిహారం ఇంకా ఏ రేంజ్‌కు వెళుతుందో చూడాలి.

Sai Pallavi : రామాయణ ఈవెంట్‌లో మెరిసిన సీతమ్మ..రణ్‌బీర్, యశ్ మధ్యలో స్పెషల్ అట్రాక్షన్‌గా సాయి పల్లవి!

Related Articles

Back to top button