Just EntertainmentJust TelanganaLatest News

Jr NTR : కిమ్స్ నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్..ఇంకా ఎన్ని రోజులు రెస్టులో ఉండాలి?

Jr NTR : డిశ్చార్జ్‌కి ముందు తారక్‌తో దిగిన ప్రత్యేకమైన ఫోటోను డాక్టర్ల టీమ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.

Jr NTR

గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు సూపర్ కబురు వచ్చేసింది. జూలైలో జిమ్‌లో కఠినమైన వర్కౌట్లు చేస్తుండగా తారక్ భుజానికి గట్టిగా దెబ్బ తగలడం, ఆ తర్వాత ఆగస్ట్ 12వ తేదీ బుధవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో సర్జరీ జరగడం తెలిసిందే.

అయితే డాక్టర్ల పర్ఫెక్ట్ కేర్,తారక్ ఫ్యాన్స్ ప్రార్థనలు ఫలించి ఆర్థ్రోస్కోపిక్ షోల్డర్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. తారక్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో గురువారం ఆసుపత్రి వర్గాలు ఆయనను డిశ్చార్జ్ చేశాయి. ప్రస్తుతం యంగ్ టైగర్ తన ఇంటికి చేరుకోవడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోని నిపుణులైన ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ శ్రీనివాస్ రావు, డాక్టర్ మధుసూదన్ రావు టీమ్.. అత్యంత జాగ్రత్తగా ఎన్టీఆర్ షోల్డర్‌ సర్జరీని పూర్తి చేసింది. డిశ్చార్జ్‌కి ముందు తారక్‌తో దిగిన ప్రత్యేకమైన ఫోటోను డాక్టర్ల టీమ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కిమ్స్ మేనేజ్‌మెంట్ తమ అఫీషియల్ ఎక్స్ అకౌంట్‌లో ప్రత్యేక హెల్త్ బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా ఉందని, ఆయన త్వరగా కోలుకోవడానికి కొద్దిరోజులు డాక్టర్ల రీహాబిలిటేషన్ ప్రాసెస్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Jr NTR
Jr NTR

కాగా ఆగస్ట్ 12 రాత్రి ఆపరేషన్ ముగిసిన వెంటనే ఎన్టీఆర్(Jr NTR) స్వయంగా ఎక్స్ వేదికగా తన హెల్త్ కండిషన్‌పై అప్‌డేట్ ఇచ్చారు. సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిందని వెల్లడిస్తూ.. తనను జాగ్రత్తగా చూసుకున్న కిమ్స్ డాక్టర్లకు, కంటిన్యూగా కేర్ చూపించిన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ప్రాణంగా భావించే ఫ్యాన్స్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అయితే సర్జరీ తర్వాత తారక్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం మూడు నెలల పాటు ఎలాంటి హార్డ్ పనులు చేయకుండా పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు గట్టిగా సూచించారు. దీంతో ఎన్టీఆర్ కొన్ని నెలల పాటు షూటింగ్ లైట్స్, కెమెరాలకు దూరంగా ఉండబోతున్నారు.

IND vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్లాష్‌కి కొత్త కౌంట్‌డౌన్ స్టార్ట్..జపాన్ వేదికగా మహా సంగ్రామం

Related Articles

Back to top button