HealthLatest News

Cigarette : సిగరెట్లకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా? నిపుణులు చెప్పే ఈ సలహాలు పాటించండి..

Cigarette : మీరు స్మోకింగ్ పూర్తిగా మానేయాలని స్ట్రాంగ్‌గా అనుకోవాలి. ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్‌తో పంచుకోవడం వల్ల వారి నుంచి మోరల్ సపోర్ట్ వస్తుంది.

Cigarette

సిగరెట్ తాగడం హెల్త్‌కు హానికరమని తెలిసినా, బాడీలో నికోటిన్ అలవాటు కావడం వల్ల చాలామందికి స్మోకింగ్ మానడం ఒక పెద్ద ఛాలెంజింగ్‌గా మారుతుంది. అయితే సరైన ప్లానింగ్, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్, కొన్ని హెల్దీ మార్పులతో ఈ అలవాటు నుంచి బయటపడొచ్చని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

దీనికోసం ముందుగా మీరు స్మోకింగ్ పూర్తిగా మానేయాలని స్ట్రాంగ్‌గా అనుకోవాలి. ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్‌తో పంచుకోవడం వల్ల వారి నుంచి మోరల్ సపోర్ట్ వస్తుంది. అలాగే మీ చుట్టుపక్కల సిగరెట్లు, లైటర్లు, యాష్‌ట్రే వంటి వస్తువులు ఏమీ లేకుండా క్లియర్ చేసేయడం చాలా ముఖ్యం.

సాధారణంగా టీ, కాఫీ తాగినప్పుడో లేదా స్ట్రెస్ ఫీలైనప్పుడో సిగరెట్ తాగాలనే క్రేవింగ్స్ ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి అలాంటి సిట్యుయేషన్స్‌కు ముందే దూరంగా ఉండటానికి ట్రై చేయాలి. ఒకవేళ మీకు సిగరెట్(Cigarette) తాగాలనే ఫీలింగ్ బాగా వచ్చినప్పుడు లాంగ్ బ్రీత్ తీసుకోవడం, గ్లాసుడు చల్లటి నీరు తాగడం, కొద్దిసేపు వాకింగ్ చేయడం వంటి పనులతో మీ మైండ్‌ను వేరే వైపు మళ్లించాలి.

ఆ టైమ్‌లో నోటికి ఏదైనా పని చెప్పడానికి షుగర్-ఫ్రీ చూయింగ్ గమ్, సోంపు, క్యారెట్ ముక్కలు, హెల్దీ స్నాక్స్ తీసుకోవడం వల్ల మెల్లగా ఆ కోరిక తగ్గుతుంది. దీంతో పాటు రోజూ వర్కవుట్స్, యోగా , మెడిటేషన్ చేయడం వల్ల మెంటల్ స్ట్రెస్ తగ్గి, స్మోకింగ్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ తగ్గుతుంది.

Cigarette
Cigarette

మీరు సిగరెట్(Cigarette) తాగకుండా గడిపిన ప్రతి రోజును ఒక సక్సెస్‌గా అనుకుని, మీకు మీరే చిన్న ట్రీట్ ఇచ్చుకోవడం వల్ల మీలో పట్టుదల పెరుగుతుంది. ఒకవేళ ఈ ప్రాసెస్‌లో మధ్యలో ఎప్పుడైనా కంట్రోల్ తప్పి మళ్లీ సిగరెట్ తాగినా సరే ఏమాత్రం డిజప్పాయింట్ అవకుండా.. మీ ఎఫర్ట్స్ వెనక్కి తగ్గకుండా స్మోకింగ్ మానేయడాన్ని కంటిన్యూ చేయాలి. అవసరమైతే డాక్టర్లను సంప్రదించి నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ వంటి మెడికల్ ట్రీట్‌మెంట్స్ గురించి సలహా తీసుకున్నా పర్వాలేదు.

మీరు స్మోకింగ్ మానేయడం వల్ల లంగ్స్ హెల్త్ మెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యూచర్‌లో వచ్చే హార్ట్ అటాక్, క్యాన్సర్ వంటి డేంజరస్ డిసీజెస్ రిస్క్ తగ్గుతుంది. శ్వాస తీసుకోవడం ఫ్రీ అవ్వడమే కాకుండా, మీ నాలుకకు రుచిని, ముక్కుకు వాసనను గుర్తించే కెపాసిటీ బాగా పెరుగుతుంది. మొత్తంగా బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరిగి మీ లైఫ్ క్వాలిటీ బాగా మెరుగవుతుంది.

NATO : నాటో వేదికపై స్పెయిన్‌కు ట్రంప్ వార్నింగ్..అమెరికా అధ్యక్షుడి తీరుపై స్పెయిన్ ఫైర్

Related Articles

Back to top button