Just EntertainmentLatest News

Nandamuri Tejeswini : సినిమాల్లోకి నందమూరి తేజస్విని ..స్పోర్ట్స్ డ్రామాతో అరంగేట్రం?

Nandamuri Tejeswini : తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న టాక్ ఫిల్మ్ నగర్‌లో బాగా నడుస్తోంది. కమర్షియల్ చిత్రంలో కాకుండా యూత్‌ను ఆకట్టుకునేలా స్పోర్ట్స్ డ్రామాతో అరంగేట్రం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Nandamuri Tejeswini

నటసింహం నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఆమె అరంగేట్రం కోసం ఒక స్పోర్ట్స్ డ్రామా కూడా సిద్ధమైందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ కుమార్తెగానే కాకుండా, సోషల్ మీడియాలో వీడియోల ద్వారా తేజస్వినికి మంచి ఫాలోయింగే ఉంది.

ఇప్పటి వరకూ ఆమె తండ్రికి సంబంధించిన కొన్ని ఈవెంట్లకు తెరవెనుక ఉండి పని చేసారు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం వంటి పనులు కూడా తేజస్వినే చూసుకుంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తేజస్విని డాన్స్ చేస్తున్న వీడియోలు చాలా వైరల్ అయ్యాయి.

నందమూరి కుటుంబమే కావడంతో సహజంగానే ఎలాంటి బెరుకు లేకుండా డ్యాన్సుల్లో, హావభావాల్లో ఆమె అదరగొట్టేశారు. అప్పటి నుంచే తేజస్విని సినిమాల్లోకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా బాలయ్య ఫ్యాన్స్ నుంచే వ్యక్తమైంది. కొంతకాలంగా కెమెరా వెనుక ఉండే కొన్ని విభాగాల్లో ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆహా ఓటీటీలో వచ్చే అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కార్యక్రమానికి ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్‌గా కూడా వ్యవహరించారు.

అలాగే బాలకృష్ణ చిత్రాల ప్రొడక్షన్ పనులు కూడా తేజస్విని(Nandamuri Tejeswini) చూస్తున్నారు. గతంలో సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్ వాణిజ్య ప్రకటనలో బ్రాండ్ అంబాసిడర్‌గా కెమెరా ముందుకొచ్చారు. ఇటీవల సారంగదరియా పాటకు ఆమె వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి.

ఇదే జోష్‌లో తేజస్విని(Nandamuri Tejeswini) సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న టాక్ ఫిల్మ్ నగర్‌లో బాగా నడుస్తోంది. కమర్షియల్ చిత్రంలో కాకుండా యూత్‌ను ఆకట్టుకునేలా స్పోర్ట్స్ డ్రామాతో అరంగేట్రం చేయబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కథా చర్చలు కూడా చివరి దశకు చేరుకున్నట్టు టాక్.

Nandamuri Tejeswini
Nandamuri Tejeswini

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని తెలుస్తోంది. బాలకృష్ణ కథ ఓకే చేస్తే అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ వార్తలపై అటు బాలయ్య కానీ, ఇటు తేజస్విని కానీ స్పందించలేదు. అయితే బాలయ్య అభిమానులు మాత్రం తెగ సంబరపడుతున్నారు. మోక్షజ్ఞ కంటే ముందే తేజస్విని ఎంట్రీ ఉండబోతుందా అంటూ చర్చించుకుంటున్నారు.

Vitamin D : ఎగ్ తినడానికి ఓ లెక్కుందట.. ఈ చిన్న మిస్టేక్స్ చేస్తున్నారేమో చూడండి..

Related Articles

Back to top button