Just EntertainmentLatest News

Dragon : తారక్ డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్‌.. రవి బస్రూర్ మ్యాజిక్‌తో మ్యూజికల్ హిట్ గ్యారంటీనా?

Dragon : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ డ్రగ్ వార్ కాన్సెప్ట్ , 2027 కొత్త రిలీజ్ డేట్ గురించి ఇక్కడ చదవండి.

Dragon

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , మాస్ యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రెస్టీజియస్ పాన్-ఇండియా మూవీ ..డ్రాగన్(Dragon), కేజీఎఫ్, సలార్ వంటి ఇండస్ట్రీ హిట్లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, తారక్‌తో చేయబోయే ప్రాజెక్ట్‌పై తాజాగా ఒక బ్లాస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు.

రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ప్రశాంత్ నీల్, ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు అత్యంత ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. డ్రాగన్(Dragon) మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని ఓ నెటిజన్ ప్రశ్నించగా, ది వన్ అండ్ ఓన్లీ రవి బస్రూర్ సర్ అంటూ నీల్ అఫీషియల్‌గా చెప్పేశాడు.

దీంతో రవి బస్రూర్ అందించే ఊరమాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డ్రమ్స్ ఎలివేషన్లు అన్నీ కలిపి ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు యాడ్ అయితే థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవడం గ్యారంటీ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ మేకింగ్ ,రవి బస్రూర్ మ్యూజిక్ కాంబినేషన్ ఇప్పటికే కేజీఎఫ్, సలార్‌లతో బాక్సాఫీస్‌ను ఏలింది కాబట్టి, ఇప్పుడు తారక్‌తో కూడా అదే సీన్ రిపీట్ కాబోతోందని నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇప్పటికే బయటికొచ్చిన డ్రాగన్ గ్లింప్స్‌లో ఈ మూవీ స్టోరీ లైన్ ఏదో సాధారణ యాక్షన్ డ్రామా కాదని, గ్లోబల్ స్థాయి కాన్సెప్ట్‌తో వస్తోందని స్పష్టమవుతోంది. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ , గోల్డెన్ ట్రయాంగిల్ మధ్య నడిచే అంతర్జాతీయ ఓపియం (డ్రగ్ మాఫియా) వార్ బ్రాక్ డ్రాప్‌తో ఈ కథ నడవనుంది.

దీనిలో ఎన్టీఆర్ లూగర్ అలియాస్ డ్రాగన్’అనే వెరీ డేంజరస్ అండ్ పవర్‌ఫుల్ కిల్లర్ క్యారెక్టర్‌లో కొత్త గెటప్‌లో మెరవబోతున్నాడు. అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ దీనిలో నార్కోటిక్స్ బ్యూరో చీఫ్‌గా అత్యంత పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తుండగా, మలయాళ యాక్టర్ బిజూ మీనన్ మరొక కీ రోల్‌లో నటిస్తూ సినిమాకి మరింత బలాన్ని చేకూరుస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వంటి టాప్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచే తారక్ ఈ మూవీ షూటింగ్‌లో కంటిన్యూగా పాల్గొంటున్నాడు.

అయితే ఈ మూవీని మొదట జూన్ 25వ తేదీన థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసినా కూడా, వీఎఫ్ఎక్స్ , క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకూడదనే ఉద్దేశంతో రిలీజ్ డేట్‌లో మార్పు చేశారు. తాజా ఇన్ఫో ప్రకారం ఈ విజువల్ వండర్‌ను 2027 జూన్ 11న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి టీమ్ రెడీ అవుతోంది.

Ramayana : బాక్సాఫీస్ వద్ద రామాయణ మేనియా.. అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ..

Related Articles

Back to top button