Pawan Kalyan:పవన్ కళ్యాణ్ మాస్ హుక్ స్టెప్పుతో సోషల్ మీడియా షేక్
Pawan Kalyan: తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి రిలీజైన మూడో పాట ప్రోమో ఇప్పుడు రచ్చ లేపుతోంది.
Pawan Kalyan
మెగా ఫ్యాన్స్ ఏ కాంబినేషన్ కోసం అయితే ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారో.. ఆ క్రేజీ కాంబో మళ్లీ పట్టాలెక్కినప్పటి నుంచి అంచనాలు ఓ రేంజ్‌లో పీక్స్‌కు వెళ్లిపోయాయి. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలిసి చేస్తున్న మూవీ.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్‌డేట్ కూడా ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజైన మూడో పాట ప్రోమో ఇప్పుడు రచ్చ లేపుతోంది.
ఎక్కే, దిగే కిక్కులోన దక్కేదేముందే.. అరె సచ్చే దాకా కిక్కే ఉండాలే.. అంటూ సాగే ఈ సాంగ్‌లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వేసిన హుక్ స్టెప్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మాస్ ట్యూన్‌కు రామ్ మిరియాల తనదైన శైలిలో గాత్రాన్ని అందించగా.. కాసర్ల శ్యామ్ సాహిత్యం నుంచి వచ్చిన సాంగ్.. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ఆటిట్యూడ్‌కు దగ్గరగా ఉంది. కేవలం ప్రోమోతోనే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుంటే, ఇక థియేటర్లలో ఈ సాంగ్ పడ్డప్పుడు రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుంద ఊహించుకోవచ్చు.

ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, గ్లింప్స్ చూస్తుంటే, పవన్ మార్కు మేనరిజమ్స్ ,హరీష్ శంకర్ రాసిన పదునైన డైలాగులు సినిమాకు మెయిన్ స్ట్రెంత్ కానున్నాయని అర్థమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
గతేడాది ఓజీ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్.. అదే జోరును ఉస్తాద్‌తో కంటెన్యూ చేయాలని పట్టుదలతో ఉన్నారు. హరిహర వీరమల్లు పీరియాడికల్ డ్రామాగా సాగితే, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మార్చి 19న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. మార్చి నెలలో పవర్ స్టార్ బాక్సాఫీస్ సునామీ క్రియేట్ చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది.
Volume up…and start dancing 🕺
Etthara Etthara Collar Ey Etthara 💥💥#UstaadBhagatSingh third single #CollarEyEtthara Song promo out now 🕺🔥Full song on March 12th at 5 PM.
A Rockstar @ThisIsDSP Musical
Sung by energetic #RamMiriyala
Lyrics… pic.twitter.com/n6mdXBWWpW— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 10, 2026





