Just EntertainmentLatest News

Peddi : బాక్సాఫీస్ దగ్గర పెద్ది వేట..400 కోట్ల క్లబ్‌కు ఒక్క అడుగు దూరంలోనే..

Peddi : టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా మార్క్ ఎమోషన్స్, చరణ్ పెర్ఫార్మెన్స్ తోడవ్వడంతో ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.

Peddi

బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మాస్ పవర్ మరోసారి ప్రూవ్ అయింది. జూన్ 4వ తేదీన థియేటర్లలోకి వచ్చిన పెద్ది(Peddi) మూవీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ, కేవలం మెగా ఫ్యాన్స్‌నే కాకుండా కామన్ సినీ లవర్స్‌ని కూడా థియేటర్లకు పరుగులు పెట్టిస్తోంది.

టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా మార్క్ ఎమోషన్స్, చరణ్ పెర్ఫార్మెన్స్ తోడవ్వడంతో ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ సమయంలోనే మూవీ రిలీజ్ అయిన కేవలం 11 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 393 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి నయా రికార్డు క్రియేట్ చేసింది. ఈ అద్భుతమైన కలెక్షన్ల మైల్‌స్టోన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ మూవీ టీం సోషల్ మీడియాలో ఒక క్రేజీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

ఈ గ్రాండ్ సక్సెస్ పోస్టర్ చూశాక ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. పెద్ది(Peddi) మూవీ 400 కోట్ల క్లబ్‌లో చేరడానికి ఇంకొక్క రూ. ఏడు కోట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈరోజు అంటే జూన్ 15న రన్ అవుతున్న కలెక్షన్ల ట్రెండ్‌ను చూస్తుంటే, ఈ రోజే పెద్ది నాలుగు వందల కోట్ల మార్కును చాలా ఈజీగా దాటేయడం పక్కా అని సినీ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.

మూవీలో చెర్రీ కనబరిచిన అద్భుతమైన యాక్షన్, పల్లెటూరి వాతావరణం, అలాగే గుండెకు హత్తుకునే ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడమే ఈ రేంజ్ కలెక్షన్లకు మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు.

Peddi
Peddi

ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్‌కు జోడీగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా లు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు.

ఈ మూవీలో జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ వంటి గ్రేట్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించి మూవీ సక్సెస్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మొత్తానికి బుచ్చిబాబు సానా మెగా పవర్ స్టార్ ..రామ్‌చరణ్‌తో కొట్టిన ఈ బ్లాక్‌బస్టర్ టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోబోతోంది.

Gold Silver Prices : ట్రంప్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్..భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Related Articles

Back to top button