Radhika Apte comments:టాలీవుడ్‌ను టార్గెట్ చేస్తున్న హీరోయిన్లు.. రాధికా ఆప్టే కామెంట్లతో మళ్లీ తెరపైకి వివాదాలు..
Radhika Apte comments:టాలీవుడ్‌పై రాధికా ఆప్టే చేసిన తాజా కామెంట్లు మళ్లీ పెద్ద చర్చకు దారితీశాయి. ఇదే విధంగా గతంలో తెలుగు సినీ పరిశ్రమపై వివాదాస్పద కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొన్న నటీమణులెవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
Radhika Apte comments
సినీ ఇండస్ట్రీలో ఏ భాషలోనైనా సరే, తమకు నటనలో ఛాన్స్ ఇచ్చి గుర్తింపును అందించిన ఇండస్ట్రీని గౌరవించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అన్న విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు టాలీవుడ్‌ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్లు చేస్తూ ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నారు.
తమకు ఆఫర్లు ఇచ్చి భారీ పారితోషికాలు ఇచ్చి ఇక్కడే గుర్తింపునిచ్చిన టాలీవుడ్‌ను.. ఓ రేంజ్‌కు వెళ్లిన హీరోయిన్లు అదంతా మర్చిపోయి ఇప్పుడు చులకన చేస్తూ మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. తాజాగా బాలీవుడ్ నటి రాధికా ఆప్టే(Radhika Apte comments) ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, మెయిన్‌గా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలపై కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేయడంతో దానిపై నిర్మాత ఎస్కేఎన్, పాయల్ రాజ్‌పుత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే రాధికా ఆప్టే ఇష్యూతో గతంలో టాలీవుడ్‌ను విమర్శించిన మరికొందరు హీరోయిన్ల పేర్లు మరోసారి సోషల్ మీడియాలో తెరపైకి వచ్చాయి.
గతంలో ‘ఝుమ్మంది నాదం’ మూవీతో తెలుగులో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయిన తాప్సీ పన్ను, ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత సౌత్ సినిమాలపై చాలాసార్లు కాంట్రవర్శీగా కామెంట్లు చేసింది. మెయిన్‌గా ఒక ఇంటర్వ్యూలో సౌత్ కమర్షియల్ మూవీలలో హీరోయిన్ల పాత్రల గురించి, గ్లామర్ షో గురించి, మరీ ముఖ్యంగా సౌత్ డైరెక్టర్లు బొడ్డు మీద కొబ్బరికాయలు కొట్టడం వంటి సీన్లు పెడతారంటూ చేసిన కామెంట్లు అప్పట్లో టాలీవుడ్లో పెద్ద దుమారాన్నే రేపాయి. తెలుగు ఆడియన్స్ ఆమెను కార్నర్ చేసి విపరీతంగా ట్రోల్ చేశారు.
అలాగే టాలీవుడ్లో దేవదాసుతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్గా ఎదిగిన ఇలియానా కూడా బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యాక సౌత్ ఇండస్ట్రీని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్లో హీరోయిన్లను కేవలం ఒక గ్లామర్ డాల్ లాగా, బొమ్మలాగే చూపిస్తారని, తనకు అక్కడ యాక్షన్‌కు పెద్దగా స్కోప్ ఉండదన్నట్లుగా మాట్లాడింది. ఇక్కడ ఇన్ని కోట్లు వెనుకేసుకుని, క్రేజ్ తెచ్చుకున్నాక ఇలా అనడంపై అప్పట్లో ఫ్యాన్స్ బాగా ఫైరయ్యారు.
ఇక లెజెండ్, రక్త చరిత్ర వంటి మూవీలలో నటించిన రాధికా ఆప్టే(Radhika Apte comments) కూడా టాలీవుడ్‌ను టార్గెట్ చేస్తూ వస్తోంది. తెలుగు ఇండస్ట్రీ పూర్తిగా మేల్ డామినేషన్‌తో కూడుకుందని, సెట్స్‌లో హీరోయిన్లను మూడో మనిషిలా చూస్తారని, వయసు మీరిన హీరోల పక్కన నటించాల్సి వస్తుందంటూ గతంలోనూ, ఇప్పుడు కూడా కామెంట్లు చేసింది.
వీరితో పాటు టాలీవుడ్లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే కూడా సౌత్ మేకింగ్ స్టైల్ గురించి, కమర్షియల్ మూవీల గురించి కొన్ని సందర్భాల్లో చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. మొత్తంగా ఎక్కడయితే పేరు, గుర్తింపుతో డబ్బులు సంపాదించుకుంటున్నారో తిరిగి అక్కడే బురద చల్లేసి వెళ్లిపోవడం కొంతమంది నార్త్ హీరోయిన్స్‌కు అలవాటు అయిందన్న టాక్ నడుస్తోంది.





