Just EntertainmentLatest News

Ram Charan : రామ్ చరణ్‌కు గాయం…ఆగిపోయిన పెద్ది షూటింగ్‌

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ గాయపడ్డాడన్న వార్తలు మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. చరణ్ కు ఎలా ఉందో అంటూ ఆరా తీస్తున్నారు

Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ గాయపడ్డాడన్న వార్తలు మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. చరణ్ కు ఎలా ఉందో అంటూ ఆరా తీస్తున్నారు. చెర్రీ ప్రస్తుతం పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

చివరి సీన్లలో రామ్ చరణ్(Ram Charan) నటిస్తుండగా కంటికి గాయమైంది దీంతో షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే చరణ్ గాయంపై మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్(Ram Charan) కు తగిలిన గాయం చిన్నదే అని, తీవ్రమయినది కాదనీ పేర్కొన్నారు.

అభిమానులు ఆందోళన చెందొద్దని చెప్పారు.యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా కనురెప్పపై చిన్న గాయం అయిందనీ వివరణ ఇచ్చారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పిన విషయాన్ని కూడా వెల్లడించారు. రెండు రోజుల తర్వాత షూటింగ్ లో జాయిన్ అవుతారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెద్ది మేకర్స్ స్పష్టం చేశారు.

Ram Charan
Ram Charan

రామ్ చరణ్(Ram Charan) – బుచ్చిబాబు కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. విలేజ్ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కు మృణాళ్ ఠాకూర్ చరణ్ తో స్టెప్పులేస్తోంది. వాస్తవానికి పెద్ది సినిమా మార్చి ఎండింగ్ లో రావాల్సి ఉండగా….ఏప్రిల్ 30న డేట్ ఫిక్స్ చేశారు.

మార్చి 27 చరణ్ బర్త్ డే సందర్భంగా బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ఇప్పటికే ప్రకటించారు. అదే రోజు మెగా అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఉండబోతోందని..టీజర్ రాబోతోందని సమాచారం. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ , బొమన్ ఇరానీ, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

RCB : ఆర్సీబీ సేల్ @ 16 వేల కోట్లు…గంటల్లోనే రాజస్థాన్ రికార్డు బ్రేక్

Related Articles

Back to top button