Just Entertainmentjust AnalysisLatest News

RAPO23 : డైరెక్టర్‌ రామ్ పోతినేని ..సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌తో రాపో కొత్త జర్నీ..

RAPO23 : ఒక యాక్టర్‌గా కెమెరా ముందు పర్ఫార్మ్ చేయడం వేరు, డైరెక్టర్‌గా వందలాది మంది టెక్నీషియన్లను లీడ్ చేస్తూ విజువల్ క్లారిటీతో మూవీని తెరకెక్కించడం వేరు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం రామ్‌కు కత్తిమీద సాము వంటిదే.

RAPO23

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్త ఎక్స్పెరిమెంట్‌కి తెరలేపారు. ఇప్పటివరకు హీరోగా తనదైన స్టైల్, డ్యాన్స్, మాస్ ఇమేజ్‌తో థియేటర్లలో రచ్చ రేపిన రామ్ పోతినేని.. ఇప్పుడు కొత్త అవతారంలో ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. కేవలం హీరోగానే కాకుండా, మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా కూడా తన లక్‌ను టెస్ట్ చేసుకోవడానికి రెడీ అయ్యారు.

రామ్ యాక్షన్ చేస్తూ.. స్వయంగా డైరెక్ట్ చేయబోతున్న #RAPO23 మూవీ జూన్ 29న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీకి హీరో రామ్ స్వయంగా స్టోరీని కూడా అందించడం టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై రామ్ పోతినేని బ్రదర్.. కృష్ణ పోతినేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీకి టాలీవుడ్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ తిరు కెమెరామెన్‌గా వర్క్ చేయబోతున్నారు.

ఓపెనింగ్ రోజే పూజా కార్యక్రమాలు ముగించుకుని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లడానికి..మూవీ యూనిట్ పక్కా ప్లాన్‌తో రెడీ అయిపోయింది. యాక్టర్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న ఒక స్టార్ హీరో.. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ బాధ్యతలను సింగిల్ హ్యాండ్‌తో హ్యాండిల్ చేయడం సాధారణ విషయమేమీ కాదు. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే రామ్ కెరీర్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం గ్యారంటీ అంటూ రామ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో డైరెక్టర్‌గా మారడం కొత్తేమీ కాదు. పాత తరం విషయానికి వస్తే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ వంటి మహానటులు కొన్ని మూవీలకు డైరెక్షన్ వహించి సక్సెస్ అయ్యారు.

నిజానికి యాక్టర్‌గా బిజీగా ఉంటూనే, డైరెక్షన్ వైపు అడుగులు వేయడం చాలా డేరింగ్ స్టెప్‌ అనే చెప్పాలి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో కొంతమంది హీరోలు మెగాఫోన్ పట్టినా, వారిలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఒక యాక్టర్‌గా కెమెరా ముందు పర్ఫార్మ్ చేయడం వేరు, డైరెక్టర్‌గా వందలాది మంది టెక్నీషియన్లను లీడ్ చేస్తూ విజువల్ క్లారిటీతో మూవీని తెరకెక్కించడం వేరు.

RAPO23
RAPO23

ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కత్తిమీద సాము వంటిదే. నేషనల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్‌లో అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, ఫర్హాన్ అక్తర్.. కోలీవుడ్‌లో ధనుష్ వంటి స్టార్స్ యాక్టర్లుగా ఉంటూనే డైరెక్టర్లుగా మారి మెప్పించారు. ఇప్పుడు అదే బాటలో రామ్ పోతినేని కూడా నిలబడటంతో అందరి దృష్టి రామ్‌పై పడింది.

RAPO23
RAPO23

#RAPO23 కేవలం రామ్ క్రియేటివిటీకి చాలా పెద్ద పరీక్ష అనే చెప్పాలి. రామ్ ఎంచుకున్న జోనర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇలాంటి మూవీలలో స్క్రీన్‌ప్లే మైండ్ బ్లోయింగ్‌గా ఉండటంతో పాటు ప్రతీ క్యారెక్టర్‌లోనూ ఎంతో డెప్త్ అవసరం. రామ్ తనలోని రైటర్‌ను, డైరెక్టర్‌ను నమ్మి ఈ ఛాలెంజింగ్ సబ్జెక్ట్‌ను లైన్‌లోకి తెచ్చారు.

ఏది ఏమైనా రామ్ పోతినేని తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్ సక్సెస్ కావాలని, డైరెక్టర్‌గా ఆయన టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని రామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Enumeration : బీఎల్‌వో రాకపోయినా టెన్షన్ వద్దు..మొబైల్ నుంచే ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసేయొచ్చు

Related Articles

Back to top button